వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రికార్డుల్లొకెక్కారు: కొత్త అసెంబ్లీలో తొలి పలుకు అచ్చెన్నాయుడిదే!

ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీలో మొదట గొంతు విప్పిన సభ్యుడిగా శ్రీకాకుళం జిల్లా శాసనసభ్యుడు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రికార్డుల్లో నిలిచారు. కొత్త సభలో సొమవారంతో ప్రారంభమైన బడ్జెట్‌ .

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీలో మొదట గొంతు విప్పిన సభ్యుడిగా శ్రీకాకుళం జిల్లా శాసనసభ్యుడు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రికార్డుల్లో నిలిచారు. కొత్త సభలో సొమవారంతో ప్రారంభమైన బడ్జెట్‌ సమావేశాల్లో తొలిరోజు గవర్నర్‌ ప్రసంగం మినహా సభ్యులెవరూ మాట్లాడలేదు.

రెండో రోజైన మంగళవారం ఉదయం 9గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలకు కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం అనంతరమే సభ్యుల గళం వినిపించింది. స్థానిక శాసనసభ్యుడు శ్రావణ్‌తోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు విద్యుత్ పంపిణీ నష్టాలపై ప్రశ్నలు అడిగారు.

kinjarapu atchannaidu speech is AP assembly's first speech

విద్యుత్ శాఖను సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్నందున ఆయన తరఫున అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. కొత్త సభలో తొలి గళం వినిపించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి అన్నారు.

ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల ఆందోళనతో ఉభయ సభలను మార్చి 13కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. శాసనసభలో విపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండగానే సభను స్పీకర్ వాయిదా వేయడం గమనార్హం.

English summary
It is said that Minister Kinjarapu Atchannaidu speech is Andhra Pradesh assembly's first speech.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X