• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చంద్ర‌బాబు ఆవిష్క‌ర‌ణ కాదు..ఇది అస‌లు కియో కారు!! సీఎం పెట్టుబ‌డుల వేట‌: 9న భారీ స‌ద‌స్సు..!

|

ప్ర‌ముఖ కార్ల త‌యారీ సంస్థ అనంత‌పురంలోని త‌మ ప్లాంట్ ద్వారా తొలి ఉత్ప‌త్తిని మార్కెట్‌లోకి విడుద‌ల చేసేందు కు ముహూర్తం ఖ‌రారైంది. ఈ ప్లాంట్‌లో త‌యారైన మొద‌టి కారును ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్రారంభించ‌నున్నారు. ఈ మేర‌కు సంస్థ ప్ర‌తినిధులు సీఎంను ఆహ్వానించారు. ఇక‌..ఏపీలో పెట్టుబ‌డుల కోసం ముఖ్య‌మంత్రి వేట ప్రారంభించా రు. ఇందు కోసం ఆగ‌స్టు 9న విజ‌య‌వాడ‌లో పెట్టబడుల ఆకర్షణకై రాష్ట్ర ప్రభుత్వం భారీ సదస్సు నిర్వ‌హిస్తోంది. ఈ స‌ద‌స్సులో 30-40 దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు, కాన్సులేట్‌ జనరళ్లు హాజ‌రు కానున్నారు. త‌మ ప్ర‌భుత్వ పారిశ్రా మిక విధానం గురించి వారితో సీఎం జ‌గ‌న్ ముఖాముఖి చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు.

కియో కారు ప్రారంభం..జ‌గ‌న్‌కు ఆహ్వానం

కియో కారు ప్రారంభం..జ‌గ‌న్‌కు ఆహ్వానం

దక్షిణ కొరియాకు చెందిన కియా కంపెనీ తన కొత్త కారును ఆగస్టు 8 నుంచి విడుదలకు సన్నాహాలు చేస్తోంది. అనంత పురం జిల్లా పెనుగొండ సమీపంలో తన కొత్తకారును మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఎన్నిక‌ల ముందు ఇదే సంస్థ‌లో తొలి కారు విడుద‌ల అంటూ నాటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఒక కారును ఆవిష్క‌రించారు. అయితే, అప్ప‌టికి త‌యారీ పూర్తి కాలేద‌ని..కేవ‌లం ఎన్నిక‌ల ముందు ప్ర‌చారం కోస‌మే అలా చేసార‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.చంద్ర‌బాబు త‌న కార‌ణంగానే కియో వ‌చ్చింద‌ని చెప్పుకున్నా.. ఇప్పుడు జ‌గ‌న్ హాయంలో మార్కెట్లోకి విడుద‌ల అవుతు న్నాయి. ఈ క‌ర్య‌క్ర‌మానికి సీఎం హోదాలో జ‌గ‌న్ హాజ‌ర‌వుతున్నారు. శాస‌న‌స‌భ‌లోనూ దీని పైన చ‌ర్చ జ‌రిగింది. నాడు వైయ‌స్సార్ అభ్య‌ర్ద‌న‌..ఇచ్చిన మాట మేర‌కే ఏపీలో యూనిట్ ఏర్పాటు చేసామ‌ని కియో సీఈవో ముఖ్య‌మంత్రికి లేఖ రాసారు. దీని పైనా కేంద్రం..చంద్ర‌బాబు ఇది త‌మ క్రెడిట్ అంటే త‌మ‌దే అంటూ పోటీ ప‌డ్డారు. ఇదే స‌మ‌యంలో ఏపీ ప్ర‌భుత్వం రాష్ట్రంలో పెట్టుబ‌డుల దిశ‌గా కార్యాచ‌ర‌ణకు దిగింది.

9న పారిశ్రామిక వేత్త‌ల‌తో స‌ద‌స్సు..

9న పారిశ్రామిక వేత్త‌ల‌తో స‌ద‌స్సు..

ఏపీలో పెట్ట‌బడులు ఆక‌ర్షించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం భారీ స‌ద‌స్సు ఏర్పాటుకు నిర్ణ‌యించింది. భారత విదేశాంగశాఖ సమన్వయంతో ఆగస్టు 9 న విజయవాడలో భారీ సదస్సు నిర్వహించనుంది. 30-40 దేశాలకు చెందిన రాయబారులు, దౌత్యవేత్తలు, కాన్సులేట్‌ జనరళ్లు హాజరు కానున్నారు. సదస్సులో మొదట ఆయా దేశాల రాయబారులు, కాన్సులేట్‌ జనరళ్లతో సీఎం సమావేశమవుతారు. ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు పారిశ్రామిక రంగానికి ఏవిధంగా లాభప డతాయో వివరిస్తారు. గ‌తంలో టీడీపీ హ‌యాంలో ప్ర‌తీ ఏటా భాగ‌స్వామ్య స‌ద‌స్సులు నిర్వ‌హించే వారు. అక్క‌డ ల‌క్ష‌లా ది కోట్ల విలువైన ఒప్పందాలు జ‌రిగాయ‌ని...ల‌క్ష‌లాది ఉద్యోగాలు వ‌చ్చ‌య‌నే ప్రచారం సైతం జ‌రిగింది. దీనిని వైసీపీ విమ‌ర్శించింది. ఏపీ ప్ర‌భుత్వం నాడు గొప్ప‌ల కోసం ఆ విధంగా ప్ర‌చారం చేసుకోవటంతో కేంద్రం నుండి రావాల్సిన సాయం అంద‌కుండా పోయింద‌ని ప్ర‌తిప‌క్ష‌నేత‌గా నాడు జ‌గ‌న్ విమ‌ర్శించారు. ఇప్పుడు ఏపీలో అమ‌లు చేస్తున్న పారి శ్రామిక విధానం వివ‌రించి..పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించేందుకే ఈ స‌ద‌స్సు అని ప్ర‌భుత్వం చెబుతోంది.

పారిశ్రామిక విధానంలో ఇదే ప్రాధాన్యం..

పారిశ్రామిక విధానంలో ఇదే ప్రాధాన్యం..

రాష్ట్రంలో వివిధ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏర్పాటుచేయనున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రాలద్వారా నాణ్యమైన మానవనరులను అందుబాటులోకి తీసుకురానున్న అంశాన్నికూడా ఈ సదస్సులో వివరించనుంది. విద్యుత్‌ శాఖలో తీసుకొస్తున్న సంస్కరణల కారణంగా అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్యుత్‌ను తీసుకొస్తామని వారికి హామీ ఇవ్వ‌నుంది. రాష్ట్రంలో ఉన్న వనరులు, తీరప్రాంతం, రవాణా, సర్వీసు, వైద్యం, సాంకేతిక రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను కూడా వారికి వివరిస్తుంది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత తొలి సారి ఏర్పాటు చేస్తున్న ఈ స‌ద స్సుకు వ‌చ్చే స్పంద‌న ద్వారా..రానున్న రోజుల్లో మ‌రిన్ని స‌ద‌స్సులు ఏర్పాటు చేయ‌టానికి ప్ర‌య‌త్నాలు సాగుతు న్నాయి. ఇదే స‌ద‌స్సులో అవినీతి లేని పాల‌న‌తో..రూపాయి ఎవ‌రికీ ఇచ్చే అవ‌స‌రం లేకుండా పారిశ్రామిక వేత్త‌ల‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని ముఖ్య‌మంత్రి హామీ ఇవ్వ‌నున్నారు.

English summary
KIO inaugurating cars from Anantapur plant on August 8th. On 9th AP Govt conducting investors meet in Vijayawada to attract investments for AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X