వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్‌పై షిండేను రిక్వెస్ట్ చేసిన తివారీ, నాతో ఆగదని కిల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
న్యూఢిల్లీ/శ్రీకాకుళం: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదాకు గల కారణం కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత మనీష్ తివారీ అని తెలుస్తోంది. బాలల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు తివారీ హైదరాబాద్ వస్తున్నారు. తాను ఎపికి వెళ్లనున్న సమయంలో కిరణ్ అక్కడే ఉండేలా చూడాలని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు తివారీ విజ్ఞప్తి చేశారట. ఆ కారణంగానే కిరణ్ పర్యటన వాయిదా పడిందని తెలుస్తోంది.

మనీష్ తివారీ కోరిక మేరకే కిరణ్ ఢిల్లీ పర్యటన వాయిదా పడిందని ఏఐసిసి వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు కిరణ్ జివోఎంతో భేటీ కానున్నారు. కిరణ్ ఢిల్లీ పర్యటన వాయిదా వెనుక రచ్చబండ, ఆసక్తి లేకపోవడం అని అందరూ భావించారు. అయితే అధిష్టానం మాత్రం తివారీ వస్తున్నందు వల్లనే అని చెబుతోంది.

సిఎం మార్పుపై సమాచారం లేదు: శైలజానాథ్

ముఖ్యమంత్రి మార్పు పైన తమకు ఎలాంటి సమాచారం లేదని మంత్రి శైలజానాథ్ హైదరాబాదులో చెప్పారు. తివారీ వస్తున్నందువల్లే కిరణ్ పర్యటన వాయిదా పడిందని తాను భావిస్తున్నానని చెప్పారు.

నేను అంగీకరించకున్నా ఆగదు: కిల్లి

తాను అంగీకరించకున్నా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ అవుతుందని కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శ్రీకాకుళం జిల్లాలో చెప్పారు. బిజెపి యూ టర్న్ తీసుకుంటే తప్ప విభజన ఆగదన్నారు. టిడిపి విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి ఇప్పుడు జివోఎం ముందుకు వెళ్లకుండా డ్రామాలు ఆడుతోందన్నారు.

English summary
Chief Minister Kiran Kumar Reddy's Delhi tour postponed to November 18.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X