వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

7 నెలలవుతోన్నా జరగని న్యాయం.. నారా లోకేశ్‌ను కలిసిన కిరణ్ ఫ్యామిలీ మెంబర్స్..

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్‌పై నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. జగన్ పాలనలో దళితులపై దమనకాండ కొనసాగుతోందని విమర్శించారు. లాక్ డౌన్ సమయంలో ప్రకాశం జిల్లా చీరాలలో కిరణ్ అనే యువకుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. కిరణ్ కుటుంబ సభ్యులు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ను కలిశారు. దీనిపై లోకేశ్ ట్వీట్టర్ లో స్పందించారు. జగన్ పాలనలో దళితులపై దాడులు కొనసాగుతున్నాయని విమర్శించారు.

మాస్క్ పెట్టుకోలేదని చీరాల పోలీస్ స్టేషన్‌లో దళిత యువకుడు కిరణ్‌ను కొట్టి చంపారని నారా లోకేశ్ ఆరోపించారు. ఏడు నెలలు అయినా ఆ కుటుంబానికి న్యాయం జరగలేదని తెలిపారు. హత్య చేసిన పోలీసులకు శిక్ష పడలేదని ఆయన వివరించారు. వైసీపీ నేత బంధువు అనే కారణంతో ఎస్సైని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదీ సరికాదు అని.. దీనిని దళితుల గుర్తించాలని కోరారు.

kiran family members meets nara lokesh

కిరణ్‌కు జరిగిన అన్యాయం మరే కుటుంబానికి జరగడానికి వీల్లేదని లోకేశ్ ఉద్ఘాటించారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్న జగన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి దళిత జాతి ఏకం అవ్వాలని పిలుపునిచ్చారు. కిరణ్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని నారా లోకేశ్ తెలిపారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.

ఫోటోలు: ఇంటి వద్దకే రేషన్ చేర్చే మొబైల్ వాహనాలను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

కిరణ్ అంశం అప్పట్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. అధికార పార్టీకి చెందిన నేతలపై విమర్శలు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ కేసు నమోదు చేసినా.. కొలిక్కి రాలేదు. దీంతో కిరణ్ కుటుంబసభ్యులు ఇవాళ నారా లోకేశ్‌ను కలిశారు. వారి తరఫున పోరాటం చేస్తామని లోకేశ్ వివరించారు.

English summary
dalit man kiran family members meets tdp leader nara lokesh today
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X