వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జై సమైక్యాంధ్ర: కిరణ్ దుకాణం మూసేశాడు (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన కార్యాలయాన్ని మూసేశారు. దాంతో పార్టీని ఆయన ఎత్తేసినట్లేనని భావిస్తున్నారు. ఎన్నికల్లో ఏ మాత్రం సత్తా చాటకపోవడంతో ఆ తర్వాత జై సమైక్యాంధ్ర పార్టీ నాయకులు కార్యాలయానికి రావడమే మానేశారు.

ఎన్నికల తర్వాత పార్టీ సమావేశాలు గానీ భవిష్యత్తు కార్యాచరణపై గానీ ఏ విధమైన చర్చలు, సమీక్షలు లేవు. అసలు పార్టీ సమావేశాలే జరగలేదని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆ తర్వాత పార్టీ గురించి మాట్లాడలేదు. ఈ మేరకు మంగళవారం మీడియాలో వార్తలు వచ్చాయి.

హైదరాబాదులోని మాదాపూర్‌లో ఎన్నికలకు ముందు పార్టీ కార్యాలయాన్ని తెరిచారు. దాన్ని ఇప్పుడు పూర్తిగా మూసేశారు. మాదాపూర్‌లోని కృతికా లేఅవుట్‌లో ఐదంతస్థుల భవనానికి ఉన్న పార్టీ పోస్టర్లను, బ్యానర్లను, జెండాలను రెండు రోజుల క్రితం తొలగించారు.

రెండు రోజుల క్రితమే కార్యాలయం నుంచి ఫర్నీచర్‌ను, స్టేషనరీని తరలించినట్లు ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరుతారంటూ వార్తలు వస్తున్నాయి. బిజెపి తెలంగాణ నేత జి. కిషన్ రెడ్డి భేటీతో ఆ ప్రచారం ఊపందుకుంది.

ఎన్నికలకు ముందు

ఎన్నికలకు ముందు

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాదులోని మాదాపూర్‌లో జై సమైక్యాంధ్ర పార్టీ కార్యాలయం ఎన్నికలకు ముందు ఇలా కనిపించింది.

ఎన్నికలకు ముందు

ఎన్నికలకు ముందు

ఎన్నికలకు ముందు మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఛాయాచిత్రంతో జై సమైక్యాంధ్ర కార్యాలయం ఇలా కనిపించింది.

ఎన్నికల తర్వాత

ఎన్నికల తర్వాత

ఎన్నికల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర కార్యాలయం ఇలా కనిపిస్తోంది.

ఎన్నికల తర్వాత

ఎన్నికల తర్వాత

ఎన్నికల తర్వాత జై సమైక్యాంధ్ర పార్టీ కార్యాలయానికి సంబంధించిన ఆనవాళ్లు ఏమీ మిగల్చలేదు. ఆ భవనం అద్దె కోసం పలు బడా సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి.

English summary
Ex CM Kiran kumar Reddy has closed Jai Samaikyandhra party office at Madhapur in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X