వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ రెడ్డిపై అన్నీ పుకారే: పనబాక, వెళ్తా: జెసి

By Pratap
|
Google Oneindia TeluguNews

Panabaka Lakshmi
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ వీడితారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారనే వార్తల్లో కూడా వాస్తవం లేదని ఆమె అన్నారు. బుధవారం బాపట్లలో ఆమె మీడియాతో మాట్లాడారు.

కిరణ్ కుమార్ రెడ్డి నిజమైన కాంగ్రెసు వాది అని, కాంగ్రెసు పార్టీకి కట్టుబడి ఉన్న కుటుంబం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి, తాతలు కాంగ్రెసుకు నిబద్ధులైన నేతలని ఆమె అన్నారు. జనవరి 23వ తేదీ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా సమర్పిస్తారని వస్తున్న వార్తలు ఊహాగానాలేనని ఆమె అన్నారు.

కాగా, కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడతారో, లేదో చెప్పలేమని తెలంగాణకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గా రెడ్డి అన్నారు. ఎవరు ఫ్లెక్సీలు పెట్టినా కిరణ్ కుమార్ రెడ్డి పెట్టారనే ప్రచారం జరుగతోందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికలను కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోనే ఎదుర్కుంటామని ఆయన అన్నారు.

త్వరలో ఎఐసిసి సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఆ కమిటీ సభ్యుడు జెసి దివాకర్‌రెడ్డి బుధవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఏఐసీసీ సమావేశాలకు వెళతానని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి బాగోలేదని ఆ సమావేశంలో చెబుతానని ఆయన అన్నారు. ఆ సమావేశంలో సమైక్యవాదం వినిపించేవారిని బయటకు గెంటేస్తారట కదా అన్న మీడియా ప్రశ్నకు జవాబుగా జేసీ నవ్వుతూ సమాధానం దాటవేశారు.

English summary
Union minister panabaka Lakshmi said that CM Kiran kumar Reddy will not launch party. JC Diwakar Reddy said that he will attend AICC meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X