టిపై కిరణ్: జగన్ పార్టీ ఫైర్, మొగుడు - పెళ్లాల సామెత
హైదరాబాద్: శాసన మండలిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన తీరుపై వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం, తెలంగాణ ప్రాంత నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రే స్వయంగా చర్చను ప్రారంభింప చేశారని మరికొందరు అంటున్నారు.
చర్చ ఏవిధంగా జరగాలి, ఎన్ని రోజులు జరగాలనే అంశంపై ముఖ్యమంత్రి సభాపతి, చైర్మన్‌లను అడగడం సరికాదన్నారు. ముందు ఆయన స్పష్టత ఇవ్వాలన్నారు. ఇతర రాష్ట్రాల విభజనను మండలిలో ప్రస్తావించిన కిరణ్‌కు బీహార్ వంటి రాష్ట్రాల్లో తీర్మానం పెట్టాకే చర్చ జరిగిన విషయం తెలియదా అన్నారు. బిల్లుపై ఏం సమాచారం ఇచ్చారని సభ్యుల అభిప్రాయం అడుగుతున్నారో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా బీహార్ వంటి రాష్ట్రాల సంప్రదాయం పాటించాలంటే మొదట తీర్మానం కావాలన్నారు.

ముఖ్యమంత్రి తీరు మొగుడు కొట్టినట్లు.. పెళ్లాం ఏడ్చినట్లు నటిస్తే అప్పులోడు వెళ్లిపోయినట్లుగా ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి మండలి సభ్యుడు స్వామి గౌడ్ అన్నారు. కిరణ్ చర్చపై మాట్లాడినా సీమాంధ్ర సభ్యులు అడ్డుకుంటున్నారన్నారు. సీమాంధ్ర సమస్యల పరిష్కారం కోసం చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. నొప్పి వస్తే కాళ్లు చేతులు కొట్టుకోకుండా డాక్టర్ వద్దకు వెళ్తేనే తగ్గుతుందని, అలాగే మీ సమస్యలు తీరాలంటే చర్చ జరగాలన్నారు.
ముఖ్యమంత్రే శాసన మండలిలో చర్చను ప్రారంభించారని తెలంగాణ ప్రాంత సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడు, ఎన్ని రోజులో అడగటం ద్వారా కిరణే చర్చ ప్రారంభించినట్లయిందంటున్నారు. శాసన సభలో ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారన్నారు. కిరణ్ చర్చను ప్రారంభించాలని చెబుతారనుకుంటే ఎప్పుడు చర్చిస్తారో చెప్పాలని అడగటమేమిటని ఇంకొందరు అంటున్నారు.
కాగా, అంతకుముందు మండలిలో యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. కిరణ్ ప్రకటనలో స్పష్టత లేదని, చర్చ ఎప్పుడు, ఎన్ని రోజులు పెడతారో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి చర్చను ప్రారంభించాలని టి కాంగ్రెసు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అన్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications