విద్యార్ధుల జోలికి వస్తే తాటతీస్తాం : మమ్మల్ని చూసి పారిపోయారు : కొడాలి నాని - వంశీ ఫైర్..!!
టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై మాజీ మంత్రి కొడాలి నాని.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫైర్ అయ్యారు. లోకేష్ పదో తరగతి పరీక్షల్లో ఫలితాల అంశంలో ప్రభుత్వంపైన విమర్శలు చేసారు. విద్యార్ధులతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసారు. ఈ జూమ్ మీటింగ్ లో ఆకస్మికంగా మాజీ మంత్రి కొడాలి నాని.. ఎమ్మెల్యే వంశీ ప్రత్యక్షమయ్యారు. దీంతో..వారి లైన్లు వెంటనే కట్ చేసారు. వైసీపీ నేతలు దొంగ తనంగా జూమ్ మీటింగ్ లోకి వచ్చారని..ప్రత్యక్షంగా వస్తే సమాధానం చెబుతామని లోకేష్ హెచ్చరించారు. దీని పైన స్పందించిన కొడాలి నాని..వంశీ లోకేష్ పైన రియాక్ట్ అయ్యారు.

అంతమంది ఫెయిట్ అవ్వటం వెనుక
విద్యార్ధులు ఎందుకు ఫెయిల్ అయ్యారనే అంశం పైన క్లారిటీ ఇచ్చారు. రెండేళ్లుగా క్లాసులు జరగలేదని..ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్దులకు ట్యాబ్ లు..స్మార్టు ఫోన్లు లేవని..వారికి ఎనిమిది -తొమ్మది తరగతుల పాఠ్యాంశాల పైన పట్టు లేక పదో తరగతిలో ఫెయిల్ అయ్యారని చెప్పుకొచ్చారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధులకు మరింత బాధ పెట్టేలా వాళ్లను మీటింగ్ లో కూర్చొబెట్టి.. ప్రసంగాలు ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. ఫెయిల్ అయిన విద్యార్దులకు మనోధైర్యం చెప్పాల్సిన సమయంలో..రాజకీయం కోసం వారిని వాడుకోవటం ఏంటని ప్రశ్నించేందుకు తాము జూమ్ మీటింగ్ లోకి వెళ్లామంటూ ఇద్దరు నేతలు చెప్పుకొచ్చారు.

అలా చేస్తే ఆ ఇద్దరిలా అవుతారు
గత ఏడాది కరోనా ఇబ్బందులు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తామంటే..అడ్డుకున్నది వీరనేని గుర్తు చేసారు. పదో తరగతిలో స్టాండర్డ్స్ లేకుండా పాస్ చేస్తే ఆ విద్యార్ధులంతా ఇంటర్ లో ఇబ్బంది పడతారని..వారు పవన్ కళ్యాణ్ - లోకేష్ లా అవుతారరంటూ ఎద్దేవా చేసారు. విద్యార్ధులకు నెల రోజుల్లో తిరిగి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని..అందులో పాస్ అయితే ఇప్పుడు రెగ్యులర్ గా పాసయిన వారితో పాటుగానే వారికి కంపార్ట్ మెంటల్ గా కాకుండా సర్టిఫికెట్లు జారీ చేస్తారని వివరించారు. లోకేష్ జూమ్ మీటింగ్ కు సంబంధించి ముందుగానే పాస్ వర్డులు పంపారని చెప్పారు.

పిల్లలతో రాజకీయాలు చేస్తూ ఊరుకోం
తమకు సంబంధించిన పిల్లలు మీటింగ్ లో పాల్గొంటే తాము అందులోకి వెళ్లామని వివరించారు. లోకేష్ చేస్తున్నది ప్రశ్నించేందుకే తాము వెళ్లామని చెప్పుకొచ్చారు. విద్యార్దుల్లో ప్రమాణాలు పెరిగేలా టీచర్లు- పేరెంట్స్ చర్యలు తీసుకోవాలని కోరారు. లోకేష్ తో చర్చకు సిద్దమేనని వల్లభేని వంశీ స్పష్టం చేసారు. అయితే, లోకేష్ మాత్రం ప్రభుత్వ అసమర్ధత కారణంగానే రెండు లక్షల మంది విద్యార్ధులు ఫెయిల్ అయ్యారని విమర్శించారు. విద్యార్ధులకు మద్దతుగా తాను పోరాటం చేస్తానని వెల్లడించారు.