అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఒక్కసారి సీఎం అయితే, ఎవర్నీ నిలబెట్టినా: బాబుపై నాని సంచలనం

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాల్లో ఎలాంటి అభ్యర్థిని కేటాయించినా పార్టీకి 44 శాతం ఓట్లు వస్తాయని వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాల్లో ఎలాంటి అభ్యర్థిని కేటాయించినా పార్టీకి 44 శాతం ఓట్లు వస్తాయని వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.

వైసిపి ప్లీనరీలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన రాజకీయ తీర్మానాన్ని ఆయన బలపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గత ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి వైసిపి శ్రేణులను వేధిస్తున్నారన్నారు.

బెదిరిస్తున్నారు

బెదిరిస్తున్నారు

పార్టీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని నాని మండిపడ్డారు. ఏదో ఒక రకంగా బెదిరించి ప్రలోభాలకు గురి చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఎంపీలను టిడిపిలో చేర్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా చంద్రబాబు అనైతిక చర్యలకు పాల్పడ్డారన్నారు.

సత్తా కలిగిన నేతలే ఉన్నారు, వారు చవటలు, దద్దమ్మలు

సత్తా కలిగిన నేతలే ఉన్నారు, వారు చవటలు, దద్దమ్మలు

గుండె ధైర్యం, ఎవరినైనా ఎదిరించగల సత్తా గల నేతలు ఇప్పుడు పార్టీలో ఉన్నారని నాని అన్నారు. చవట, దద్దమమ్మలే తెలుగుదేశం పార్టీలో చేరారని వ్యాఖ్యానించారు. వైసిపి గత ఆరేళ్ల నుంచి అనేక పోరాటాలు చేసిందన్నారు. ప్రజల సమస్యలు తన సమస్యలుగా భావించి వారికి అండగా నిలిచిన ఏకైక నేత జగన్ అన్నారు.

సింగిల్‌గా పోటీ చేసినా..

సింగిల్‌గా పోటీ చేసినా..

2014 ఎన్నికల్లో బిజెపికి లేదా టిడిపికి రాని ఓట్లు సింగిల్‌గా పోటీచేసిన వైసిపికి వచ్చాయని నాని చెప్పారు. ఇప్పుడు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమ పార్టీ గెలుస్తుందని, జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. జగన్ ఎలాంటి అభ్యర్థిని నిలబెట్టినా దాదాపు సగం శాతం ఓట్లు వస్తాయన్నారు.

చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు

చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు

చంద్రబాబు అత్యంత మోసపూరితమైన వ్యక్తి అని, వెన్నుపోటుదారుడు అని నాని మండిపడ్డారు. కుట్ర రాజకీయాలు చేస్తారన్నారు. అవసరమైతే కాళ్లు, లేదంటే జుట్టు పట్టుకుంటాడన్నారు. ఈ రాష్ట్రంలో ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో అవన్నీ ఒక్క చంద్రబాబులోనే ఉన్నాయన్నారు. రాష్ట్రాన్ని దొంగ సీఎం పాలిస్తున్నారన్నారు. చంద్రబాబుకు 70 ఏళ్ల వయస్సు రావడంతో మైండ్ పని చేయడం లేదని, ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు పోతారో తెలియదని, అలాంటి వ్యక్తి ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బతికున్నంత కాలం జగనే సీఎం, లోకేష్ ముంచుతారు

బతికున్నంత కాలం జగనే సీఎం, లోకేష్ ముంచుతారు

జగన్ అబద్దాలు చెప్పకుండా నిజాయితీగా ప్రతిపక్షంలో ఉన్నారని నాని చెప్పారు. 2019లో జగన్ సీఎం అయితే బతికి ఉన్నంత వరకు ఆయనే ముఖ్యమంత్రి అన్నారు. చంద్రబాబు మరణిస్తే లోకేష్ టైటానిక్ షిప్‌ను ముంచినట్లు టిడిపిని ముంచుతారన్నారు. టిడిపి నేతలంతా అప్రమత్తమై వేరే పార్టీలోకి జంప్ కావాలన్నారు.

English summary
YSR Congress MLA Kodali Nani controversial comments on AP CM Chandrababu Naidu and Nara Lokesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X