వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్ను ఓడించే దమ్ముందా?, రాష్ట్రం విడ్చివెళ్తా: టీడీపీకి కొడాలి నాని సవాల్

తెలుగుదేశం పార్టీ నేత రావి వెంకటేశ్వరరావుపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

నన్ను ఓడించే దమ్ముందా? టీడీపీకి సవాల్ Kodali Nani fired at TDP leaders | Oneindia Telugu

కృష్ణా: తెలుగుదేశం పార్టీ నేత రావి వెంకటేశ్వరరావుపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు. వచ్చే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో నన్ను ఓడిస్తే రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతానని స్పష్టం చేశారు.

 దమ్ముందా..?

దమ్ముందా..?

అంతేగాక, ఈ సవాల్‌ను స్వీకరించే దమ్మున్న టిడిపి నేత ముందుకు రావాలని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. రాష్ట్ర పార్టీని, డబ్బును దింపి తనను ఓడించే సత్తా ఎవరికీ లేదన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక శరత్ థియేటర్లో ఎమ్మెల్యే కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.

రావికి ఆనవాయితీగా మారింది..

రావికి ఆనవాయితీగా మారింది..

వరుస ఓటమిలు చవిచూస్తున్న రావి.. గుడివాడలో చేసేది ఏమీలేదన్నారు. ఆయనకు అకస్మాత్తుగా మీడియా ముందుకు వచ్చి తనపై ఆరోపణలు చేయడం ఆనవాయతీగా మారిపోయిందన్నారు.

జగన్ యువసేన

జగన్ యువసేన

నియోజకవర్గ ప్రజలందరికీ ఎవరెలాంటి వారో తెలుసని కొడాలి నాని అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి గుడివాడ నియోజకవర్గంలో 10వేల మంది యువతతో జగన్ యువసేనను నిర్మిస్తానన్నారు. ఎమ్మెల్యే కొడాలి నానిపై ఆరోపణలు చేయడం కన్నా.. వాటిపై దర్యాప్తు ఎందుకు జరిపించలేక పోతున్నారని వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ ప్రశ్నించారు.

జైలుకెళ్లడం ఖాయం

జైలుకెళ్లడం ఖాయం

ఇది ఇలావుండగా, వలివర్తిపాడు ప్రాంతంలో ప్రభుత్వ భూములను వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని బినామీ పేర్లతో ఆక్రమించారని గుడివాడ టీడీపీ ఇన్‌చార్జ్ రావి వెంకటేశ్వరరావు ఆరోపించారు. భూకబ్జాలపై విచారణ జరుగుతోందన్నారు. ఆర్నెళ్లలో కొడాలి నాని జైలుకెళ్లడం ఖాయమని రావి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.

English summary
YSRCP MLA Kodali Nani fired at TDP leadeer Ravi venkateswara rao for his comment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X