వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేకాడితే ఉరేస్తారా ? చంద్రబాబు, ఉమలా వ్యభిచార గృహాలు నడపలేదు : కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

గుడివాడ నియోజకవర్గంలో పేకాట శిబిరాలపై దాడులు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఎస్ఈబి చేసిన దాడులు ఏపీ రాజకీయాలలో దుమారం గా మారాయి. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ని టార్గెట్ చేసి విమర్శలు వెల్లువగా మారాయి. మొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుడివాడ నియోజకవర్గంలో పేకాట క్లబ్ లు నిర్వహించడం పైనే ప్రధానంగా దృష్టి పెట్టారు ఎమ్మెల్యే అని ఆరోపణలు గుప్పించిన వేళ, తాజాగా జరిగిన దాడులలో కొడాలి నాని అనుచరులు పట్టుబడడం ఆసక్తికరంగా మారింది.

కొడాలి నానీని పేకాడేస్తున్న ప్రతిపక్షాలు .. ఉన్నపళంగా సీఎం జగన్ దగ్గరకు మంత్రి కొడాలి నాని..ఏపీలో హాట్ టాపిక్కొడాలి నానీని పేకాడేస్తున్న ప్రతిపక్షాలు .. ఉన్నపళంగా సీఎం జగన్ దగ్గరకు మంత్రి కొడాలి నాని..ఏపీలో హాట్ టాపిక్

పేకాడిన వారిలో నా అనుచరులు ఉంటే ఏమవుతుంది.. ఉరేస్తారా ?

పేకాడిన వారిలో నా అనుచరులు ఉంటే ఏమవుతుంది.. ఉరేస్తారా ?

ఇక పేకాట వ్యవహారంపై స్పందించిన కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేకాటలో పట్టుబడిన వాళ్ళల్లో నా అనుచరులు ఉంటే ఏమవుతుంది అంటూ ప్రశ్నించారు. పేకాట ఆడితే ఏం శిక్ష వేస్తారు ? ఉరిశిక్ష ఏమైనా వేస్తారా అంటూ షాకింగ్ ప్రశ్నలు సంధించారు కొడాలి నాని. ఇక టీడీపీ అధినేత చంద్రబాబుపై, మాజీ మంత్రి దేవినేని ఉమా పై విమర్శల వర్షం కురిపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎంపీ ఇంట్లోనే జూదం నడిచేదని ఆరోపణలు చేశారు కొడాలి నాని.

చంద్రబాబు నాయుడు క్లబ్ లు , బ్రోతల్ హౌస్ లు నిర్వహించారని సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు నాయుడు క్లబ్ లు , బ్రోతల్ హౌస్ లు నిర్వహించారని సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు నాయుడు క్లబ్ లు , బ్రోతల్ హౌస్ లు నిర్వహించారని సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని,1975లో ఎమ్మెల్యే ఆయన నాటి నుండి చంద్రబాబునాయుడు చెయ్యని దందా లేదంటూ ఆరోపణలు గుప్పించారు. ఇక గుడివాడ నియోజకవర్గంలో పేకాట శిబిరాలపై దాడులు చేయించింది తమ ప్రభుత్వమేనని మీడియానో , దేవినేని ఉమానో కాదని కొడాలి నాని మండిపడ్డారు. పేకాట ఆడే వాళ్లకు ఒక పార్టీ , ఒకే కులం ఉంటాయా అని ప్రశ్నించిన నాని తాను పేకాట ఆడిస్తే ఉమా , చంద్రబాబు ఎందుకు పట్టుకోలేదు అంటూ ప్రశ్నించారు.

పేకాట శిబిరాలపై దాడులు చెయ్యాలని ఆదేశించింది తామేనన్న కొడాలి నానీ

పేకాట శిబిరాలపై దాడులు చెయ్యాలని ఆదేశించింది తామేనన్న కొడాలి నానీ

ఆన్లైన్ పేకాట లేదా గ్యాంబ్లింగ్ జరిగినట్లు గమనిస్తే పట్టుకోవాలని సీఎం జగన్ పోలీసులకు ఇచ్చిన ఆదేశాల మేరకే ఎస్ఈబీ అధికారులు రైడ్ చేశారని , దొరికిన వారిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరుస్తున్నా మని మంత్రి కొడాలి నాని తెలిపారు. తమకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టే, ఆరోపణలు వచ్చినప్పటికీ పేకాట శిబిరాలపై దాడులు చెయ్యాలని ఆదేశించామని, ఈ వ్యవహారంలో చంద్రబాబు ఉన్న వాడి బాబు ఖర్జూర నాయుడు ఉన్న పట్టుకొస్తామంటూ కొడాలి నాని నిప్పులు చెరిగారు.

పేకాట ఆడినందుకు ఏమైనా ఉరిశిక్ష లు ఉన్నాయా? జైలు కేమైనా వెళతారా?

పేకాట ఆడినందుకు ఏమైనా ఉరిశిక్ష లు ఉన్నాయా? జైలు కేమైనా వెళతారా?

పేకాట ఆడే వాళ్ళలో తన సహచరులు ఉంటే ఏమవుతుంది అని ప్రశ్నించిన కొడాలి నాని , తన తమ్ముడే ఉన్నా సరే పేకాట ఆడినందుకు ఏమైనా ఉరిశిక్ష లు ఉన్నాయా? జైలు కేమైనా వెళతారా? దానికోసం నేను క్యాంప్ ఆఫీస్ కి వచ్చి ఏం చెయ్యాలి అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు. అంతేకాదు అందుకే కదా చట్టాలను మారుస్తోంది అంటూ పేర్కొన్న కొడాలి నాని దాని కోసం సీఎం దగ్గరకు పరిగెత్తుకుంటూ రావాల్సిన అవసరం ఏమిటి ? అంటూ వ్యాఖ్యానించారు. ప్రజలకు అవసరమైనప్పుడు సీఎంను కలవడానికి వస్తున్నానని, వ్యక్తిగత పనుల మీద ఎప్పుడూ సీఎంను కలవడానికి రాలేదని కొడాలి నాని పేర్కొన్నారు.

చంద్రబాబు నాయుడు , దేవినేని ఉమాలా వ్యభిచార గృహాలు పేకాట శిబిరాలు నిర్వహించలేదు

చంద్రబాబు నాయుడు , దేవినేని ఉమాలా వ్యభిచార గృహాలు పేకాట శిబిరాలు నిర్వహించలేదు

అంతేకాదు పేకాట ను అరికట్టడం కోసం వైయస్ జగన్ గ్యాంబ్లింగ్ యాక్ట్ తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇక ఈ వ్యవహారంలో సీఎం జగన్ ను కలవడానికి వెళ్లలేదని పేర్కొన్న కొడాలి నాని తాను రోడ్డు పనుల కోసం సిఎం ను కలిశాను అంటూ క్లారిటీ ఇచ్చారు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయని పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్న నాని చంద్రబాబు నాయుడు , దేవినేని ఉమాలా వ్యభిచార గృహాలు పేకాట శిబిరాలు నిర్వహించడం లేదని ఫైర్ అయ్యారు. పేకాట స్థావరాలపై జరిగిన దాడులతో తన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడిన నాని పేకాట ఆడుతూ పట్టుబడితే కోర్టుకెళ్లి ఫైన్ కట్టి వస్తారంటూ వ్యాఖ్యానించారు.

English summary
Kodali Nani made sensational remarks in response to the poker affair. Asked what would happen if my followers were among those caught in poker. What is the penalty for playing poker? Kodali Nani was asked shocking questions as to whether he would be hanged. Meanwhile, TDP chief Chandrababu and former minister Devineni Uma were showered with criticism. Kodali Nani has accused chandrababu and devineni uma organized brothel houses .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X