• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి దేవినేని .. వెన్నుపోటుకు పేటెంట్ బాబుదే .. కొడాలి నాని తిట్ల దండకం

|

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శల వర్షం కురిపించారు. ప్రభుత్వం ఇచ్చే పట్టా భూములు అమ్ముకోకూడదని కోర్టులకు వెళ్లి 25 కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడని ధ్వజమెత్తిన కొడాలి నాని జగన్ చేసే అభివృద్ధి చూసి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు కోడి గుడ్డుకు ఈకలు పీకే పని మొదలు పెట్టాడని మండిపడ్డారు.

బూతుల మంత్రి అన్నా ఐ డోంట్ కేర్ , సీఎం జగన్ జోలికొస్తే ఊరుకోను .. కొడాలి నాని

 పేదవారి ఇంటి కలలు నిజం చేసిన జగన్ .. కొడాలి నాని కితాబు

పేదవారి ఇంటి కలలు నిజం చేసిన జగన్ .. కొడాలి నాని కితాబు

లక్షలాది మంది పేదవారి ఇంటికలను సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిజం చేశారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గొల్లపూడిలో మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని రాష్ట్రంలో ఎవరూ ఊహించనంత గొప్పగా ఏపీ సీఎం జగన్ అభివృద్ధి చేస్తున్నారంటూ కితాబిచ్చారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగోలేకున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం సీఎం జగన్ పరితపిస్తున్నారు అని చెప్పారు.

 జేబుదొంగ, వెన్నుపోటు దారుడు అనే పదాలకు పేటెంట్ హక్కు చంద్రబాబుకే

జేబుదొంగ, వెన్నుపోటు దారుడు అనే పదాలకు పేటెంట్ హక్కు చంద్రబాబుకే

ఇక సొల్లు ఉమా, చంద్రబాబు కలిసి కులాలు మతాలు పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని, కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను వంచించడానికి, రెచ్చగొట్టడానికి చంద్రబాబు ఎంత నీచానికైనా ఒడిగడతాడని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జేబుదొంగ, వెన్నుపోటు దారుడు అనే పదాలకు పేటెంట్ హక్కు ఉన్నది చంద్రబాబుకే అని కొడాలి నాని తన దైన స్టైల్లో తిట్టిపోశారు. ఎన్టీఆర్ మరణానికి కారకుడైన దుర్మార్గుడే చంద్రబాబు అంటూ పేర్కొన్న కొడాలి నాని, వదినని చంపి శాసన సభ్యుడైన వ్యక్తి దేవినేని ఉమా అంటూ మండిపడ్డారు.

 దేవినేని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే బడిత పూజ చేస్తాం

దేవినేని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే బడిత పూజ చేస్తాం

ఇక వారు తనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి అయిన దేవినేనిది ,ఒక్క నిరుపేదకు కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వలేని దౌర్భాగ్యం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. మీడియా ముందు పోసుకోలు కబుర్లు చెప్పే దేవినేని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే బడిత పూజ చేస్తామంటూ కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు.

అంతకుముందు కొడాలి నాని ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నప్పటికీ టిడిపి వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి నాడు ఆ మహనీయుని స్మరించుకుంటూ ట్వీట్ చేశారు.

 ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కొడాలి నాని ట్వీట్

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కొడాలి నాని ట్వీట్

కథానాయకుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 25వ వర్ధంతి అన్న గారికి ఇవే నా నివాళులు అంటూ కొడాలి నాని ట్వీట్ చేశారు. అంతేకాదు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని నమ్మిన ప్రజా నాయకులు స్ఫూర్తిప్రదాతకు ఇవే మా నివాళులు అంటూ కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. టిడిపి ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన కొడాలి నాని, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ని, టీడీపీ ముఖ్య నాయకులు ని టార్గెట్ చేసి తీవ్ర పదజాలంతో దూషించినా, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు సీనియర్ ఎన్టీఆర్ పై తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

English summary
AP Minister Kodali Nani once again attacked Chandrababu. Kodali Nani was angry that Chandrababu would go to any lengths to deceive and provoke the people. Kodali Nani scolded in his own style that Chandrababu has the patent for the words 'pickpocket' and back Attacker in the state. chandrababu was the culprit behind the death of NTR and Devineni uma was the culprit behind his sister-in-law's death .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X