• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చంద్రబాబు చచ్చిన పాము ...జగన్ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడు : కొడాలి నానీ తీవ్ర వ్యాఖ్యలు

|

చంద్రబాబు పై వ్యక్తిగతంగా దాడి చేయాల్సిన అవసరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ లేదని కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు ఆల్రెడీ చచ్చిన పాము అంటూ కొడాలి నాని విమర్శించారు. 23 సీట్లకే పరిమితం అయిన చంద్రబాబుపై కక్ష సాధించాల్సిన అవసరం వైసిపికి లేదంటూ కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంలో చంద్రబాబు మాటలు విని తప్పు చేశామని ఒప్పుకుంటే బాగుండేదని వ్యాఖ్యానించారు.

గతంలో వైఎస్సార్ కాళ్ళు పట్టుకున్నట్టే .. జగన్ కాళ్ళు పట్టుకో : కొడాలి నానీ

గతంలో వైఎస్సార్ కాళ్ళు పట్టుకున్నట్టే .. జగన్ కాళ్ళు పట్టుకో : కొడాలి నానీ

గతంలో చంద్రబాబు వైయస్సార్ కాళ్లు పట్టుకుని చంద్రబాబుపై వేసిన విచారణలు నిలుపుదల చేసుకున్నట్లుగా, ఇప్పుడు కూడా చీకట్లో జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడితే జగన్మోహన్ రెడ్డి క్షమించే వారంటూ వ్యాఖ్యానించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ విషయంలో కక్షసాధింపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం సిఐడి విచారణ జరిపిస్తోందని టిడిపి నేతలు కోర్టుకు వెళితే కోర్టు విచారణను ఆపటం జరిగిందన్నారు. ఏ వ్యవస్థ అయినా రాజ్యాంగానికి లోబడి పని చేయాల్సి ఉంటుందని అయితే కొన్ని వ్యవస్థలు కొంతమంది వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం, వ్యవస్థలో ఉన్న లొసుగులతో వాళ్లకి లాభం చేకూరేలా పనిచేయడం చేస్తున్నారని కొడాలి నాని విమర్శించారు.

 మేమే సుప్రీమ్ అన్నట్టుగా కొన్ని వ్యవస్థలు వ్యవహరిస్తున్నాయి

మేమే సుప్రీమ్ అన్నట్టుగా కొన్ని వ్యవస్థలు వ్యవహరిస్తున్నాయి

మేమే సుప్రీమ్ అన్నట్టుగా కొన్ని వ్యవస్థలు వ్యవహరిస్తున్నాయని కొడాలి నాని పేర్కొన్నారు. అలాంటి వ్యవస్థలను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు. కోర్టుల వైఖరిపై వైసిపి నేతలు మండి పడుతున్న సమయంలో కొడాలి నాని పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు .

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జరుగుతున్న పరిణామాలు అనుమానాలు రేకెత్తించి విధంగా ఉన్నాయని కొడాలి నాని పేర్కొన్నారు. ఏపీలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు రాజధాని అమరావతి భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, తద్వారా చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు లబ్ధి పొందారని ఆరోపించారు కొడాలి నాని.

దమ్ముంటే విచారణ చెయ్యమన్నారు .. విచారణ చేస్తుంటే కోర్టులకు వెళ్తున్నారు

దమ్ముంటే విచారణ చెయ్యమన్నారు .. విచారణ చేస్తుంటే కోర్టులకు వెళ్తున్నారు

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం గుర్తిస్తే, మేము కడిగిన ముత్యంలా బయటకు వస్తామంటూ దమ్ముంటే సీబీఐ,సిట్ దర్యాప్తునకు ఆదేశించాలని సొల్లు కబుర్లు చెప్పాడు బాబు అంటూ మండిపడ్డారు. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి టిడిపి నాయకులు ఎవరు ఎంత భూములను కొనుగోలు చేశారు, ఏ మేరకు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందో నివేదిక మేరకు కోర్టును ఆశ్రయించాలని సీఎం జగన్ భావించారని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వానికి అమరావతి భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని సిబిఐ విచారణకు ఆదేశించాలని లేఖలు రాసినప్పటికీ స్పందించకపోవడం తోనే, సిఐడి విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించిందని కొడాలి నాని చెప్పారు.

 సిగ్గు లేకుండా టీడీపీ ఎంపీల వ్యాఖ్యలు

సిగ్గు లేకుండా టీడీపీ ఎంపీల వ్యాఖ్యలు

చంద్రబాబు నాయుడు కోర్టులకు వెళ్లి సిఐడీ ఎంక్వయిరీ, సిట్ ఎంక్వయిరీ, మంత్రివర్గ ఉపసంఘం ఎంక్వయిరీ ఆపేయించారని కొడాలి నాని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నుండి కొంత మంది ఎంపీలను బిజెపికి పంపించి వారిని అడ్డుపెట్టుకొని సిబిఐ ఎంక్వైరీ వేయకుండా అడ్డుకుంటున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. వైసిపి ఎంపీలు పార్లమెంట్ లో న్యాయ వ్యవస్థపై ప్రశ్నిస్తే సిగ్గులేకుండా టిడిపి ఎంపీలు అడ్డు పడ్డారని ఫైర్ అయ్యారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి వంటి నీతిపరుడు, నిజాయితీపరుడు అయిన సీఎం దగ్గర పని చేయడం తనకు చాలా గర్వంగా ఉందని కొడాలి నాని పేర్కొన్నారు. కొండలనైనా డీ కొట్టే శక్తి ఉన్న జగన్మోహన్రెడ్డి దగ్గర పనిచేయడం తనకు సంతోషంగా ఉందన్నారు. దమ్మున్న వ్యక్తి జగన్ అంటూ కితాబిచ్చారు.

సుప్రీం కోర్టుకు వెళ్తాం .. పార్లమెంట్ లో చర్చ పెట్టి అంతు తేలుస్తాం

సుప్రీం కోర్టుకు వెళ్తాం .. పార్లమెంట్ లో చర్చ పెట్టి అంతు తేలుస్తాం

ఉడుత ఊపులకు భయపడేది లేదని పేర్కొన్న కొడాలి నాని సుప్రీం కోర్టుకు వెళ్తామని, అవసరమైతే పార్లమెంట్ లో చర్చకు పెట్టి అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ పై అంత తేలుస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న మీడియాపై మండిపడ్డారు. డబ్బా ఛానల్లు , సొల్లు పేపర్లు అంటూ విరుచుకుపడిన కొడాలి నాని జగన్ ను నాశనం చేయడమే లక్ష్యంగా, చంద్రబాబును సిఎం కుర్చీలో కూర్చోబెట్టినట్టుగా ఓ వర్గం మీడియా పని చేస్తుందంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రజలు ఏమైతే ఏంటి ? చంద్రబాబుకు డబ్బాకొట్టి , భజన చేసే భజన సంఘాలు జగన్ మోహన్ రెడ్డి ఏం చేసినా దారుణంగా రాస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు.

  S Thaman పై సెటైర్స్, కానీ తమన్ ఎప్పటికీ గొప్ప టెక్నీషియనే.. ఎందుకంటే? || Oneindia Telugu
  అంబేద్కర్ విగ్రహానికి క్షమాపణ చెప్పు .. కుల ,మత రాజకీయాలపై ఫైర్

  అంబేద్కర్ విగ్రహానికి క్షమాపణ చెప్పు .. కుల ,మత రాజకీయాలపై ఫైర్

  రాష్ట్రంలో బార్లు తెరవడం పై విమర్శలు గుప్పిస్తున్న చంద్రబాబు గతంలో ఐదేళ్లపాటు 840 బార్లకు లైసెన్సులు ఐదేళ్లపాటు ఇచ్చింది నిజం కాదా అంటూ కొడాలి నాని మండిపడ్డారు. దళితుల గురించి మాట్లాడుతున్న చంద్రబాబు విజయవాడ లోని అంబేద్కర్ విగ్రహం ముందు సాష్టాంగ నమస్కారం చేసి టిడిపి ప్రభుత్వ హయాంలో దళితుల విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశామని, తప్పు చేశామని క్షమాపణలు చెప్పాలంటూ కొడాలి నాని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు దళితుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు . మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చంద్రబాబు చేస్తున్న కుట్రలు అన్నీ ఇన్నీ కావన్నారు కొడాలి నాని. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ, హిందూ సంఘాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేసే జూమ్ రాజకీయాలను ప్రజలు నమ్మరని కొడాలి నాని తేల్చిచెప్పారు.

  English summary
  Kodali Nani said that neither the YSR Congress nor Jaganmohan Reddy needed to personally attack Chandrababu. Kodali Nani criticized Chandrababu Already as a dead snake. Kodali Nani said there was no need for the YCP to take revenge against Chandrababu, who is limited to 23 seats. Minister Kodali Nani, had made harsh remarks against Chandrababu
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X