వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్ కే ; ఎన్టీఆర్ చావుకు కారణమైన వాళ్ళే దండలేస్తారా :ఏకిపారేసిన కొడాలి నాని

|
Google Oneindia TeluguNews

ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి , ఎన్టీఆర్ ను సీఎం సీటు నుండి దించిన వ్యక్తి ఈరోజుఎన్టీఆర్ వర్ధంతికి దండలు వేయటం దారుణమని మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణమని మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రపంచ రత్న అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి దేవినేని .. వెన్నుపోటుకు పేటెంట్ బాబుదే .. కొడాలి నాని తిట్ల దండకంచంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి దేవినేని .. వెన్నుపోటుకు పేటెంట్ బాబుదే .. కొడాలి నాని తిట్ల దండకం

అఖిల ప్రియ ను ఏపీలో అరెస్ట్ చేస్తే చంద్రబాబు నటవిశ్వరూపం చూడాల్సి వచ్చేది

అఖిల ప్రియ ను ఏపీలో అరెస్ట్ చేస్తే చంద్రబాబు నటవిశ్వరూపం చూడాల్సి వచ్చేది

బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ అరెస్ట్ గురించి చంద్రబాబు నోరు విప్పడం లేదని పేర్కొన్న కొడాలి నాని పాపం ఆడపిల్ల అంటూ సానుభూతి చూపారు . అదే అరెస్టు ఏపీలో జరిగితే చంద్రబాబు నట విశ్వరూపం చూడాల్సి వచ్చేదని , నానా గోల చేసేవారని విమర్శించారు. పదవుల కోసం చంద్రబాబు దిగజారిపోయారని విమర్శించిన కొడాలి నాని, తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేసింది చంద్రబాబునాయుడు అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

 ముఖాన ఉమ్మేసినా సరే సిగ్గు శరం లేకుండా చంద్రబాబు వ్యాఖ్యలు

ముఖాన ఉమ్మేసినా సరే సిగ్గు శరం లేకుండా చంద్రబాబు వ్యాఖ్యలు

చంద్రబాబు , లోకేష్ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై దుష్ప్రచారం చేస్తున్నారని, విగ్రహ ధ్వంసం ఘటనలను కావాలనే ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఉడత బెదిరింపులకు భయపడేది లేదని మంత్రి కొడాలి నాని తేల్చిచెప్పారు . ఎన్టీఆర్ బొమ్మను తాకే అర్హత కూడా చంద్రబాబుకు లేదని మండిపడ్డారు. ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి ముఖాన ఉమ్మేసినా సరే సిగ్గు శరం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ తెర మీద నటుడు అయితే, చంద్రబాబు నిజజీవితంలో నటుడని కొడాలి నాని పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వెన్నుపోటులో చంద్రబాబుకు ప్రపంచ రత్న ఇవ్వాలి

వెన్నుపోటులో చంద్రబాబుకు ప్రపంచ రత్న ఇవ్వాలి

చంద్రబాబుకు వెన్నుపోటులో ప్రపంచ రత్న ఇవ్వాలని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. రామారావు బొబ్బిలి పులి అయితే చంద్రబాబు పిల్లి అని విమర్శించారు. ఎన్టీఆర్ ఆస్తులు ధ్వంసం చేసిన కాంగ్రెస్ తో ఎందుకు జతకట్టారు అని ప్రశ్నించారు కొడాలి నాని. ఎన్టీఆర్ గొప్పతనం గురించి ఏ పార్టీ లోనూ సెకండ్ ఒపీనియన్ లేదని పేర్కొన్న కొడాలి నాని ఎన్టీఆర్ ఆశీస్సులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉంటాయంటూ వ్యాఖ్యలు చేశారు .

 చంద్రబాబు పక్కా రాజకీయ వ్యభిచారి

చంద్రబాబు పక్కా రాజకీయ వ్యభిచారి

చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమేయాలని, చంద్రబాబు పక్కా రాజకీయ వ్యభిచారి అని కొడాలి నాని నిప్పులు చెరిగారు. వెన్నుపోటుకు పేటెంట్ హక్కున్న చంద్రబాబు లాంటి నీచుడిని బంగాళాఖాతంలో కలపాలని కొడాలి నాని తిట్టిపోశారు. ఎన్టీఆర్ బొమ్మను కూడా తాకటానికి చంద్రబాబుకు అర్హత లేదని పేర్కొన్న కొడాలి నాని చంద్రబాబు ,పప్పు నాయుడు ఇద్దరూ కలిసి టిడిపిని నాశనం చేశారు అన్నారు. ఇంకా పాతికేళ్లు గడిచినా సరే ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేస్తూనే ఉంటాడు అని ఎద్దేవా చేశారు కొడాలి నాని.

అప్పుడు భారతరత్న ఎందుకు తేలేకపోయారు .. నానీ సూటి ప్రశ్న

అప్పుడు భారతరత్న ఎందుకు తేలేకపోయారు .. నానీ సూటి ప్రశ్న

చంద్రబాబు హయాంలో ఢిల్లీలో చక్రం తిప్పినప్పుడు భారతరత్న ఎందుకు తీసుకు రాలేదని చంద్రబాబును ప్రశ్నించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వడం చంద్రబాబు కు ఇష్టం లేదని, చంద్రబాబు బతికుండగా ఎన్టీఆర్ కు భారత రత్న రాదని పేర్కొన్నారు.

చంద్రబాబు చేసేవన్నీ నీచ రాజకీయాలని మండిపడ్డారు . పిల్లనిచ్చిన మామనే పార్టీ నుండి గెంటేసిన ఘనుడు అంటూ నిప్పులు చెరిగారు . మహనీయుడు ఎన్టీఆర్ గురించి చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదన్నారు .

English summary
Minister Kodali Nani made harsh remarks against Chandrababu, the man who back attacked NTR and the man who ousted NTR from the CM's seat today. Chandrababu was blamed for NTR's death. asked to give the World's Gem Award to Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X