వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడాలి నానిని ఎర్రగడ్డలో, అచ్చెన్నాయుడిని వెటర్నరీ ఆస్పత్రిలో నేతల మధ్య మాటలయుద్ధం

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Winter Sessions 2019 : Kodali Nani vs Achhenaidu || అచ్చెన్నాయుడు పై కొడాలి నాని ఫైర్!!

ఏపీ అసెంబ్లీలో వ్యక్తిగత దూషణల పర్వం కొనసాగింది. దిశ బిల్లు చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు తన పేరు ప్రస్తావించారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు లేవనెత్తడంతో చర్చకు దారితీసింది. అచ్చెన్నాయుడు, మంత్రి కొడాలి నాని మధ్య మాటల యుద్ధం జరిగింది. ఏపీ దిశ బిల్లుపై సభలో సభ్యులు చర్చించారు. తర్వాత అసెంబ్లీ బిల్లుకు ఆమోదం తెలిపినట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

లోకేశ్ మార్షల్ పీక పట్టుకున్నారు..: చంద్రబాబు..ఆ పత్రిక పైన కొడాలి ఫైర్: వీడియో ప్రదర్శన..!లోకేశ్ మార్షల్ పీక పట్టుకున్నారు..: చంద్రబాబు..ఆ పత్రిక పైన కొడాలి ఫైర్: వీడియో ప్రదర్శన..!

ఎర్రగడ్డ

ఎర్రగడ్డ

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మహిళలను ఇబ్బంది పెట్టారని వైసీపీ నేతలు ఆరోపించారు. దీనిపై అచ్చెన్నాయుడు స్పందించారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న నానికి చికిత్స అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించాలని సూచించారు. వ్యక్తులను గౌరవిస్తున్నారు కానీ... వినడానికి బాగుండటం లేదని అచ్చెన్నాయుడు అన్నారు.

ఫేక్ సర్టిఫికెట్

ఫేక్ సర్టిఫికెట్

తనపై కేసులు ఉంటే విచారణ జరిపించాలని అచ్చెన్నాయుడు కోరారు. చేసిన తప్పులను ఎత్తి చూపడమే నేరమా అని అభిప్రాయపడ్డారు. ఎస్టీ కాకున్న సర్టిఫికెట్ తీసుకొని డిప్యూటీ సీఎం పదవీ దక్కించుకున్నారని విమర్శించారు.

 వెటర్నరీ ఆస్పత్రి

వెటర్నరీ ఆస్పత్రి

అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను మంత్రి కొడాలి నాని తప్పుపట్టారు. తనను ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్చడం కాదు.. అచ్చెన్నాయుడును వెటర్నరీ ఆస్పత్రిలో చేర్చాలని అభిప్రాయపడ్డారు. ఇటీవల రాష్ట్రానికి ఒక మానసిక వైద్య కేంద్రం వచ్చిందని శ్రీకాంత్ రెడ్డి చెబితే విన్నానని కొడాలి నాని పేర్కొన్నారు. ఆ ఆస్పత్రికి చంద్రబాబు నాయుడు మానసిక వైద్య కేంద్రం పేరు పెట్టాలని సూచించారు.

 లోకేశ్ కూడా..

లోకేశ్ కూడా..

ఆస్పత్రిలో చంద్రబాబును, మార్షల్స్‌పై దాడిచేసిన వారిని కూడా చేర్చాలని కొడాలి నాని సూచించారు. ఈ మేరకు సీఎం జగన్‌మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తర్వాత సభ్యుల ఏపీ దిశ బిల్లుపై చర్చించారు. మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. తర్వాత బిల్లు ఆమోదం పొందిందని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు.

English summary
andhra pradesh assembly Approve ap disha bill
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X