వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ గట్టిగాచూస్తే చచ్చే వెధవలు; వార్డుమెంబర్ గా గెలవలేనోళ్ళు మహానాడు వేదికపై: కొడాలి నాని

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మహానాడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర హోరాహోరీగా సాగుతుంది. ఇక తాజాగా మహానాడులో చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విరుచుకు పడి వచ్చే ఎన్నికలలో జగన్ ను ఓడించి తీరుతామని వ్యాఖ్యలు చేశారు. ఇక మహానాడులో పలు అంశాలపై తీర్మానాలు చేసిన చంద్రబాబు జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ వేస్తున్నారు. తాజాగా గుడివాడ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని చంద్రబాబుపై తిట్ల దండకం అందుకున్నారు.

రెండు పేర్లు చెప్తే చంద్రబాబుకు నిద్ర పట్టదు: కొడాలి నాని

రెండు పేర్లు చెప్తే చంద్రబాబుకు నిద్ర పట్టదు: కొడాలి నాని

కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని చవట సన్నాసి జగన్ ను ఓడిస్తాడట అంటూ మాజీ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. రెండు పేర్లు చెబితే చంద్రబాబుకు నిద్ర పట్టదు అని పేర్కొన్న మాజీ మంత్రి కొడాలి నాని సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ పేర్లు చెబితే చంద్రబాబుకు తడిసిపోతుంది అంటూ ఎద్దేవా చేశారు. జామాత దశమగ్రహం అని ఎన్టీఆర్ ఎప్పుడో చంద్రబాబును అన్నారని గుర్తు చేసిన మాజీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు ఈ రాష్ట్రానికి, టిడిపికి పట్టిన శని గ్రహం అని నిప్పులు చెరిగారు.

మహానాడుకు భయపడుతున్నారు అని చెప్పడానికి చంద్రబాబుకు సిగ్గు ఉండాలి

మహానాడుకు భయపడుతున్నారు అని చెప్పడానికి చంద్రబాబుకు సిగ్గు ఉండాలి

అధికారమే పరమావధి అని చంద్రబాబు అనుకుంటున్నారు అని పేర్కొన్న కొడాలి నాని చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు రాజకీయ సమాధి కడుతున్నా మహానాడుకు వైసీపీ నేతలు భయపడుతున్నారు అని చెప్పడానికి చంద్రబాబుకు సిగ్గు ఉండాలి అంటూ విమర్శించారు.

ఎన్టీఆర్ ని చంపి పూలమాలలు వేస్తున్నారు అంటూ చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. అమలాపురం లో వైసీపీ ఎమ్మెల్యే ,మంత్రి ఇళ్లను తగలబెట్టించింది చంద్రబాబే నంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇళ్లకు నిప్పంటించి తనకేమీ తెలియదన్నట్టు చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు.

వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేనోళ్ళు మహానాడు వేదికపై

వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేనోళ్ళు మహానాడు వేదికపై

జగన్ గట్టిగా చూస్తే చచ్చే వెధవలు తొడలు కొడుతున్నారని, వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వారు మహానాడు వేదికపై ఉన్నారని కొడాలి నాని పేర్కొన్నారు. పార్టీ లేదు బొక్క లేదు అన్న అచ్చెన్నాయుడు పార్టీ అధ్యక్షుడు అంటూ ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలు ఫోర్ ట్వంటీ గాళ్ళకు రాజకీయ సమాధి కడతారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు దత్తపుత్రుడు, ఎల్లో మీడియా విషప్రచారం చేస్తున్నారని మండిపడిన కొడాలి నాని, జనసేన నిక్కర్ ల బ్యాచ్ అంటూ నిప్పులు చెరిగారు.

ఎన్టీఆర్ 100 పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబును రాష్ట్రం దాటి వెళ్లేలా తరిమికొట్టాలి

ఎన్టీఆర్ 100 పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబును రాష్ట్రం దాటి వెళ్లేలా తరిమికొట్టాలి

జగన్ ను విమర్శించే అర్హత ఎవరికీ లేదని, ఎన్టీఆర్ 100 పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబును రాష్ట్రం దాటి వెళ్లేలా తరిమికొట్టాలి అని పిలుపునిచ్చారు కొడాలి నాని. చంద్రబాబు తన కుక్కలను ఇంట్లో కట్టేసుకోవాలని బస్సు యాత్ర మీద విషం కక్కితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.

కోట్లు ఖర్చు చేసి చేస్తున్న మహానాడుకు.. సామాజిక న్యాయం కోసం చేస్తున్న బస్సు యాత్రకు ఎక్కడా పొంతన లేదని కొడాలి నాని తేల్చిచెప్పారు. చంద్రబాబు ఎందుకు బతికి ఉన్నాడో ఆయనకే తెలీదు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన కొడాలి నాని ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి అంటూ చంద్రబాబును హెచ్చరించారు.

English summary
Kodali Nani shocking comments on Chandrababu over tdp mahanadu. Kodali nani, slams chandrababu back stabbing politics on NTR gave warning to chandrababu. .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X