వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాస్తు ప్రామాణికం కాదు: కెసిఆర్‌పై కోదండరాం, మోడీకి పట్టిన గతేనన్న తమ్మినేని

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి వాస్తు ప్రమాణికం కాదని తెలంగాణ జెఏసి ఛైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని అన్నారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించి నగర పరిరక్షణకు ప్రభుత్వం పూనుకోవాలని అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా నడుచుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి కోదండరాం సూచించారు.

Kodandaram lashed out at Telangana government

రియల్ ఎస్టేట్ లక్ష్యంగా పాలన సరికాదని అన్నారు. అందువల్లే గత పాలకులను ప్రజలు తిరస్కరించారన్నారు.
హైదరాబాద్‌లో వందలాది పరిశ్రమలు మూతపడ్డాయని, వేలాది మంది కార్మికుల బతుకులు వీధినపడ్డాయని అన్నారు. పది వామపక్షాల ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఛాతి ఆస్పత్రి తరలింపు అంశంపై జరిగిన రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు.

హైదరాబాద్ నగరాన్ని పాలకులు మర్చిపోవడంతో వికృతరూపం సంతరించుకుందన్నారు. పాలు, కూరగాయలు అమ్మే ప్రైవేటు కంపెనీలు తీసుకొచ్చారని సంతరించుకుందన్నారు. రియల్ ఎస్టేట్ అవసరాల కోసం ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేశారని ఆయన ఆరోపించారు.

దక్షిణ భారతదేశంలోనే తోళ్ల పరిశ్రమకు హైదరాబాద్ ప్రసిద్ధి అని చెప్పిన ఆయన, అలాంటి హైదరాబాద్ ఇప్పుడు మూడు రకాల సంక్షోభాలకు నిలయంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రాపాలకుల అభివృద్ధి నమూనాను తాము వ్యతిరేకిస్తున్నామని, వ్యక్తిగతంగా, ప్రాంతీయంగా ఆంధ్రా పాలకులను వ్యతిరేకించడం లేదని కోదండరాం తెలిపారు.

Kodandaram lashed out at Telangana government

మోడీకి పట్టిన గతే: తమ్మినేని వీరభద్రం

వాస్తు కోసం చెస్ట్ ఆస్పత్రిని మార్చడం లేదని.. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ్రదం ఆరోపించారు. ఆస్పత్రి తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లకూడదని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. చెస్ట్ ఆస్పత్రిపై మాట్లాడేందుకు కూడా ప్రభుత్వం అనుమతించడం లేదని అన్నారు.

చెస్ట్ ఆస్పత్రిని యునివర్సిటీగా మార్చాలి గానీ, తరలించకూడదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. వాస్తు పేరుతో స్వార్థ ప్రయోజనాలు మానుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

పోరాటం చేస్తాం: లక్ష్మణ్

ఎస్సీ, ఎస్టీలకు సబ్ ప్లాన్ చేసినా పరిస్థితి మారలేదని భారతీయ జనతా పార్టీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. సబ్ ప్లాన్ చట్టానికి సవరణలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎస్సీ, స్టీలకు కేటాయించిన నిధులను గడువులోగా ఖర్చుచేయకుంటే రాజకీయ పోరాటం చేస్తామని లక్ష్మణ్ హెచ్చరించారు.

English summary
TJAC Chairman Prof. Kodandaram on Thursday lashed out at Telangana government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X