వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంతానం మిగిల్చిన ఏకాంతం..! ముగిసినట్టేనా కోడెల రాజకీయ ప్రస్థానం..??

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఆకాశం నుండి అదఃపాతాళానికి పడిపోవడం అంటే ఇదే. రాజకీయాల్లో కొంత సమయం వరకు విరామం వస్తుంది. కాని శాపగ్రస్థ నేతలకు మాత్రం జీవితకాల విరామం ఇస్తారు ప్రజలు. దాంతో చేసిన తప్పులు వెంటాడి ఏంచేయాలో తెలియని అగమ్యగోచరంలోకి వెళ్తారు కొంత మంది నేతలు. ప్రస్తుతం గుంటూరుకు చెందిన ఆ మహా నేత పరిస్థితి కూడా అర్థాంతరంగా ముగిసిపోయే ప్రమాదంలోకి వెళ్లింది. సుధీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్న గుంటూరు రాజ‌కీయ నాయ‌కుడు, మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు పొలిటిక‌ల్ ప్ర‌స్థానం ముగిసినట్టేనా..? ఆయ‌న‌కు తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోందా ? సొంత పార్టీ టీడీపీలోనే వ్య‌తిరేక వ‌ర్గం త‌యారైందా ? అంటే.. తాజా ప‌రిణామాలు ఔన‌నే అంటున్నాయి.

 పార్టీలో ఒంటరైన కోడెల..! తిరస్కరిస్తున్న ప్రజానికం..!!

పార్టీలో ఒంటరైన కోడెల..! తిరస్కరిస్తున్న ప్రజానికం..!!

రాజ‌కీయంగా కోడెల కుటుంబం తాజాగా వార్త‌ల్లో నిలుస్తున్న విష‌యం తెలిసిందే. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుమారుడు కోడెల శివ‌రామ‌కృష్ణ‌, కుమార్తె విజ‌య‌ల‌క్ష్మి చెలరేగిపోయారు. అందిన‌కాడికి దోచుకున్నారు. దందాలు, భూక‌బ్జాలు, వ‌సూళ్ల ప‌ర్వంలో గ‌త ఐదేళ్ల‌లో రికార్డు స్థాయిలో వీరిపై ఆరోప‌ణలు వ‌స్తున్నాయి.
ఇప్ప‌టికే ప‌దుల సంఖ్య‌లో కోడెల పుత్ర‌, పుత్రికా ర‌త్నాల‌పై కేసులు కూడా న‌మోద‌య్యాయి. ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఫ్యామిలీ కుమార్తె, కుమారుడిపై లెక్క‌కు మిక్క‌లిగా ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. రోజుకో కేసు అన్న‌ట్టుగా న‌మోదు అవుతోంది. వైసీపీ నేత‌లు ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే కోడెల‌ను ఓ రేంజులో టార్గెట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు కోడెల‌కు సొంత పార్టీలోనే వ్య‌తిరేక వ‌ర్గం త‌యారైంది. ఆయ‌న నాయ‌క‌త్వాన్ని స్థానిక నాయ‌కులు స‌హించ‌లేక పోతున్నారు.

 ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తి..! పార్టీ నేతల్లోనూ అసహనం..!!

ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తి..! పార్టీ నేతల్లోనూ అసహనం..!!

ప్ర‌స్తుతం స‌త్తెనప‌ల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన కోడెల శివ‌ప్ర‌సాద‌రావు గ‌త 2014ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. అయితే, తాజాగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని భావించారు. అయితే, దీనికి స్థానిక నాయకులు ముందుకు రాలేదు ఇప్ప‌టికే గ‌తంలో ప్రాతినిధ్యం వ‌హించిన న‌ర‌స‌రావుపేట స్థానాన్ని టీడీపీలోని బీసీ నాయ‌కులు ఆక్రమించేశారు. అక్క‌డ నుంచి ఈ ఎన్నిక‌ల్లో బీసీ వ‌ర్గానికి చెందిన డాక్ట‌ర్ చద‌ల‌వాడ అర‌వింద‌బాబు పోటీ చేశారు. ఈ నేప‌థ్యంలోనే త‌న నియోజ‌క‌వ‌ర్గంలో కోడెల జోక్యానికి ఆయ‌న ఒప్పుకోవ‌డం లేదు.

కోడెలకు రాజకీయ దారేదీ..! భవితవ్యం అంధకారమే..!!

కోడెలకు రాజకీయ దారేదీ..! భవితవ్యం అంధకారమే..!!

కోడెలకు ఇప్పుడు స‌త్తెన‌ప‌ల్లి మాత్ర‌మే మిగిలింది. అక్క‌డి నాయ‌కులు కోడెల నాయ‌క‌త్వాన్ని అంగీకరించేలా లేరు. ఎన్నిక‌ల‌కు ముందే, కోడెల‌కు సీటు ఇవ్వ‌వ‌ద్ద‌ని ఆ పార్టీ నేత‌లు స్థానికంగా పెద్దఎత్తున ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు చేప‌ట్టారు. చివ‌ర‌కు, బాబుపై కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఒత్తిడి తెచ్చి టిక్కెట్ ద‌క్కించుకున్నారు. ఇక‌, ఇప్పుడు ఉన్న స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోనూ స్థానిక వ్య‌తిరేక‌త తీవ్రంగా ఉండడంతో పార్టీ అధినేత చంద్ర‌బాబు త‌ర్జ‌నభ‌ర్జ‌న ప‌డుతున్నారు.

 కోడెలకు కోలుకోని దెబ్బ..! రాజకీయాల్లో మనుగడ కష్టమే..!!

కోడెలకు కోలుకోని దెబ్బ..! రాజకీయాల్లో మనుగడ కష్టమే..!!

కోడెల‌కు దాదాపుగా పార్టీలోనే ప్రాధాన్యం త‌గ్గే అవ‌కాశం క‌నిపిస్తోంది. త‌న కుటుంబం చేసిన అక్ర‌మాల‌ను తెలిసి కూడా ఆయ‌న నిలువ‌రించ‌లేక పోవ‌డం, పైగా వాటిని స‌మ‌ర్ధించ‌డం వంటి ప‌రిణామాలు ఆయ‌న‌కు తీవ్ర వ్య‌తిరేక‌త‌ను తీసుకువ‌స్తున్న నేప‌థ్యంలో వ‌చ్చే కోడెల‌కు ఆయ‌న‌కు ప‌ట్టున్న రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీ నేత‌లే పొగ పెట్టేస్తున్నారు. ఆయ‌న్ను అస‌లు టీడీపీ నాయ‌కులు ద‌గ్గ‌ర‌కు రానిచ్చే ప‌రిస్థితి కూడా లేదు. అయిపోయినట్టే... అంతా అయిపోయినట్టే... కోడెల రాజకీయ ప్రస్థానం ముగిసిపోయినట్టే.

English summary
From the time the YCP government came to power in AP, today, the daughter and son of Kodela Sivaprasadrao's family have been accused of negligence. The case is getting worse every day. YCP leaders have been targeting codecs in a range since the election results. In this backdrop, Kodela has now become a party to her own party. Local leaders are unable to accept the leadership.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X