విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోడెల శివప్రసాద్ ఓ ఫ్యాక్షనిస్టు...చంద్రబాబుకు 3 లక్షల కోట్ల అక్రమాస్తులు:విజయసాయి

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం:ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోడెల ఓ ఫ్యాక్షనిస్టు అని...కేసు నుంచి బయటపడి స్పీకర్ అయ్యారని ఆరోపించారు.

వైఎస్ అవినీతికి పాల్పడలేదని నేనెప్పుడైనా చెప్పానా?...త్వరలో మార్గదర్శిపై మరిన్ని వాస్తవాలు:ఉండవల్లివైఎస్ అవినీతికి పాల్పడలేదని నేనెప్పుడైనా చెప్పానా?...త్వరలో మార్గదర్శిపై మరిన్ని వాస్తవాలు:ఉండవల్లి

టీడీపీ ప్రభుత్వాన్ని విజయసాయి దుయ్యబట్టారు...టీడీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. చంద్రబాబు 3 లక్షల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపించిన విజయసాయి...బీజేపీని అంటరాని పార్టీగా చేసేసి అవినీతి మరకను తుడుచుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన కాంగ్రెస్‌ పార్టీతో జతకట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విజయసాయి ఆరోపించారు.

 Kodela Shivaprasad is a Factionist ...Chandrababu has Rs 3 lakh crores illegal properties: Vijayasai Reddy

వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ స్పీకర్ కోడెల ఒక ఫ్యాక్షనిస్ట్ అని...ఆయనపై హత్యా కేసులున్నాయని చెప్పారు. "కేసుల నుంచి ఆయన ఎవరి సాయంతో బయటకు వచ్చారో అందరికి తెలుసు. కేసులు మాఫీ చేయించుకుని స్పీకర్ అయ్యారు. అధికార పార్టీకి స్పీకర్ అడుగులకు మడుగులోత్తుతున్నారు"...అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

టీడీపీకి రోజులు దగ్గర పడ్డాయని...త్వరలోనే వారికి ప్రజలు బుద్ధిచెబుతారని విజయసాయి వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాను ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని ఆరోపించారు. సోషల్‌ మీడియాలో వైఎస్సార్‌సీపీ ఆధిపత్యం సాధించిందని, చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనను ఎండగడుతూ విమర్శించడంలో విజయవంతం అయ్యామని ఆయన పేర్కొన్నారు. సోషల్‌ మీడియాను టార్గెట్‌ చేస్తూ జరుగుతున్న అరెస్టులని తిప్పికొడుతున్నామని చెప్పారు.

Recommended Video

ప్రారంభ‌మైన ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు..!

ప్రతిపక్షాన్ని అంతుచూస్తామని సీఎం చేసిన వ్యాఖ్యలను విజయసాయి రెడ్డి ఖండించారు. సోషల్‌ మీడియాలో కార్యకర్తలపై పెట్టిన కేసులు అక్రమ కేసులు అని, ఈ విషయాన్ని సుప్రీం కోర్టు కూడా పేర్కొందని చెప్పారు. ఏపీ శాసనసభ రాజ్యాంగ విరుద్ధమైన సభ అని సాక్షాత్తూ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్న విషయాన్ని విజయసాయి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు తాము ఎందుకు హాజరు కావడం లేదో బహిరంగ లేఖ రాశామని తెలిపారు. 23 మంది పార్టీ ఫిరాయింపులకు పాల్పడి, వారిలో ముగ్గురిని మంత్రులుగా చేసిన ఎమ్మెల్యేలను డిస్‌క్వాలిఫై చేయండి...మరునాడే మా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరవుతారని విజయసాయి చెప్పారు.

శాసనసభ సభ్యులు సభకు వెళ్లకుండా జీతాలు తీసుకోవడంపై విజయసాయి రెడ్డి స్పందించారు. శాసనసభకు వెళితేనే అలవెన్స్‌లు వస్తాయని గుర్తుచేశారు.
వైఎస్సార్‌సీపీ చేసే విమర్శలు సహేతుకంగా ఉంటాయని...కానీ టిడిపి ప్రభుత్వం వ్యక్తిగత విమర్శలకి దిగుతోందన్నారు. హైకోర్టు చంద్రబాబుపై సీబీఐ విచారణకు అదేశించినప్పుడు ఆయన భయపడి స్టే తెచుకున్నారు.

English summary
Visakapatnam:YCP MP Vijayasai Reddy has made strong negative comments against Speaker Kodela SivaPrasad over his factionism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X