వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదే సూత్రం: వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై స్పీకర్ కోడెల

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై మండలి బుద్ధప్రసాద్ కమిటీ నివేదిక వచ్చిందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. [రోజాకు షాక్: సస్పెన్షన్‌పై స్టేకు హైకోర్టు నిరాకరణ]

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సింగపూర్ నుంచి ‘వరల్డ్‌ టాయిలెట్‌ ఆర్గనైజేషన్‌' అనే స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా డబ్ల్యుటీఓ, స్వచ్ఛాంద్ర కార్పోరేషన్ మధ్య ఒప్పందం కుదిరిందన్నారు.

Kodela siva prasada rao got buddha prasad report on roja suspension

గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో కూడా మరుగుదొడ్ల నిర్మాణంపై దృష్టిపెట్టామని ఆయన చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో గ్రూప్ మరుగుదొడ్ల నిర్మాణానికి అవకాశం ఎక్కువగా ఉందన్నారు. స్వచ్ఛ ఏపీలో భాగంగా 52 లక్షల టాయిలెట్లు నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు.

రోజా వాయిస్‌ ట్యాంపర్, ప్రెస్ మీట్స్ పెట్టి జగన్‌పై స్పీకర్ విమర్శలు: శ్రీకాంత్ రెడ్డి

2018లోపు టాయిలెట్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి 6వేలు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు. సాంకేతికతను అతి తక్కువ ధరకే వరల్డ్‌ టాయిలెట్‌ ఆర్గనైజేషన్‌ బదలాయిస్తుందన్నారు.

సత్తెనపల్లిలో లక్ష మరుగుదొడ్లను నిర్మించి లిమ్కా బుక్స్‌లో చోటు సంపాదించామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సహకారం ఇచ్చేందుకు జపాన్ ముందుకొచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాకారంతో అర్బన్ ప్రాంతాల్లో కమ్యూనిటీ టాయిలెట్లను నిర్మిస్తామని ఆయన తెలిపారు.

English summary
Andhra Pradesh speaker Kodela siva prasada rao got buddha prasad report on roja suspension.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X