వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోడెల ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది?: ఆత్మహత్యేనంటూ పోస్టుమార్టం రిపోర్ట్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతదేహానికి సోమవారం రాత్రి ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. సుమారు గంటా 20 నిమిషాలపాటు ముగ్గురు వైద్యులు పోస్టుమార్టం చేశారు.

కోడెలను కొడుకే చంపాడు: బావమరిది సంచలన ఆరోపణలు, బసవతారకం ఆస్పత్రి వివరణ ఇలాకోడెలను కొడుకే చంపాడు: బావమరిది సంచలన ఆరోపణలు, బసవతారకం ఆస్పత్రి వివరణ ఇలా

ఆత్మహత్య చేసుకోవడం ద్వారానే..

ఆత్మహత్య చేసుకోవడం ద్వారానే..

పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను ఉస్మానియా వైద్యులు పోలీసులకు అందించారు. ఆ నివేదికలో కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడం ద్వారానే మరణించారని వెల్లడించింది. మెడ భాగంలో 8 అంగుళాల తాడు గాట్లు ఉన్నాయని పోస్టుమార్టం నివేదికలో తేలింది. సూసైడ్ చేసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని నివేదకలో పేర్కొన్నారు. వీడియో చిత్రీకరణ మధ్య పోస్టుమార్టం జరిగింది.

టిఫిన్ చేసి బెడ్ రూంలోకి..

టిఫిన్ చేసి బెడ్ రూంలోకి..

కాగా, కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు ముందు జరిగిన పరిణామాలు ఒక్కసారి గమనించినట్లయితే.. సోమవారం ఉదయం 10గంటలకు కోడెల టిఫిన్ చేశారు. ఆ తర్వాత 10.10గంటలకు ఫస్ట్ ఫోర్‌లోని బెడ్ రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు.

పిలిచినా తలుపులు తీయకపోవడంతో..

పిలిచినా తలుపులు తీయకపోవడంతో..

కొంత సేపటి తర్వాత తలుపులు తీయాలంటే కోడెల భార్య కోరింది. అయితే, గది నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో గన్ మెన్‌ను పిలిచారు. తలుపులు తీసి చూడగా.. అప్పటికే కోడెల ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు. వెంటనే ఉ. 10.50కి కోడెలను బసవతారకం ఆస్పత్రికి తరలించారు. 11గంటలకు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే, అక్కడ ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు.

చాలా ఒత్తిడిలో ఉన్నారు..

చాలా ఒత్తిడిలో ఉన్నారు..

కోడెల ఆత్మహత్యపై ఆయన కూతురు విజయలక్ష్మి స్పందించారు. తన తండ్రి ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదని చెప్పారు. గత కొద్ది రోజులుగా తన తండ్రి చాలా ఒత్తిడిలో ఉంటున్నారని ఆమె తెలిపారు.ఏపీలో ప్రభుత్వం మారినప్పటి నుంచి తన తండ్రిని వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కంటినిండా నిద్రలేకుండా మూడు నెలలుగా తన తండ్రిని వేధించారని కంటతడి పెట్టారు. కనీసం ఆయన వయసుకు కూడా విలువనివ్వకుండా వేధించారని అన్నారు. తనతోపాటు సోదరుడు శివరాంపై తీవ్ర దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. మృతిపై మంచిమాటలే ప్రచారం చేయాలని కోరారు.

కోడెల పార్థీవ దేహం ఎన్టీఆర్ భవన్‌కు..

కోడెల పార్థీవ దేహం ఎన్టీఆర్ భవన్‌కు..

పోస్టుమార్టం అనంతరం కోడెల శివప్రసాదరావు పార్థీవ దేహాన్ని సోమవారం రాత్రి ఎన్టీఆర్ ట్రస్ట్ భవనకు తరలించారు. సోమవారం రాత్రి కోడెల పార్థీవ దేహానికి టీడీపీ నేతలు, రాజకీయ పార్టీల నాయకులతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించనున్నారు. మంగళవారం తెల్లవారుజామున కోడెల స్వస్థలానికి ఆయన పార్థీవ దేహాన్ని తరలించనున్నారు.

English summary
It said that Kodela Sivaprasada Rao's postmortem report sent to police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X