వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్రిగోల్డ్ ఆస్తుల కేసులో కీలక మలుపు: మళ్లీ ముందుకొచ్చిన జీఎస్సెల్ గ్రూప్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసు మరో మలుపు తిరిగింది. ఆస్తులను కొనుగోలు చేసేందుకు జిఎస్సెల్ గ్రూప్ ముందుకు వచ్చింది. గతంలో వద్దని చెబుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. అగ్రిగోల్డ్ 10 ఆస్తుల విలువను హైకోర్టుకు సీఐడీ సమర్పించింది. సీఐడీ సమర్పించిన ఆస్తుల విలువ ఎంతో చెప్పాలని అగ్రిగోల్డ్ సంస్థను హైకోర్టు ఆదేశించింది. అనంతరం కేసును ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది.

అగ్రిగోల్డ్‌ ఆస్తుల కొనుగోలుకు జీ-ఎస్సెల్ గ్రూప్ అంతకుముందు ఆసక్తి చూపించి ఆ తర్వాత వెనక్కి తగ్గింది. అయితే ఇప్పుడు మళ్లీ కొనుగోలు చేయడానికి ముందుకు రావడం గమనార్హం. ఆ మేరకే గతంలో దాఖలు వేసిన పిటిషన్‌ను జీ-ఎస్సెల్‌ గ్రూప్‌ ఉపసంహరించుకుంది.‌

kohliZee Essel Group ready to take our Agri Gold

కాగా, దాదాపు రెండు నెలల క్రితం జీఎస్ఎల్ గ్రూప్ ఇప్పుడు వెనక్కి పోయింది. తాము అగ్రిగోల్డ్‌ను స్వాధీనం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఇందుకు గల కారణాన్ని కూడా వివరించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల కంటే అప్పులు నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నాయని విచారణలో భాగంగా సోమవారం హైకోర్టుకు జీఎస్ఎల్ గ్రూప్ వెల్లడించింది. అయితే ఇప్పుడు మళ్లీ ముందుకు వచ్చింది.

English summary
Zee Essel Group ready to take our Agri Gold
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X