వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వస్తున్నారంటే భయపడిపోతున్నారు, ఊళ్లలో ఉండరు: మంత్రి కొల్లు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాదయాత్ర ఖర్చును తలచుకుని ఆయన పార్టీ నేతలంతా భయపడిపోతున్నారని అన్నారు. అంతేగాక, ఆ ఖర్చు

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాదయాత్ర ఖర్చును తలచుకుని ఆయన పార్టీ నేతలంతా భయపడిపోతున్నారని అన్నారు. అంతేగాక, ఆ ఖర్చులు భరించలేక ఊళ్లను కూడా వదిలేసి వెళ్లాలని అనుకుంటున్నారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ పాలిట జగన్ ఓ నరకాసురుడిలా తయారయ్యారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి నిధులు కూడా రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.

kollu ravindra on ys jagan's padayatra

బీసీల సంక్షేమం గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి అన్నారు. బీసీల గురించి మాట్లాడే హక్కు కేవలం టీడీపీకి మాత్రమే ఉందని చెప్పారు. త్వరలోనే నిరుద్యోగ భృతి కూడా కల్పిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు.

ఇంటింటికీ టీడీపీలో మంత్రి నారాయణ

సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించడం టీడీపీ విధానమని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు పట్టణంలోని దీనదయాళ్‌నగర్‌లో ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి నారాయణ.. కాలనీలో అప్రోచ్‌ రోడ్డు నిర్మాణానికి రూ. 25 లక్షలను మంజూరు చేశారు. అలాగే ఆ కాలనీలోగల పలువురు మహిళలకు కుట్టు మిషన్లను మంత్రి పంపిణీ చేశారు.

English summary
Andhra Pradesh minister kollu Ravindra on Thursday satires on YSRCP YS Jaganmohan Reddy's padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X