• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
LIVE

అట్టుడుకుతున్న కోనసీమ.. జిల్లా పేరుపై రగడ, మంత్రి ఇంటికి నిప్పు.. హైటెన్షన్

|
Google Oneindia TeluguNews

ఇవాళ కొందరు అల్లరిమూకలు అమలాపురంలో గల మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పుపెట్టారు. దీంతో హై టెన్షన్ నెలకొంది. భారీగా పోలీసు బలగాలను మొహరించారు. 144 సెక్షన్ విధించారు. ఘటనపై హోం మంత్రి వనిత స్పందించారు. ఇదీ బాధాకరం అని కామెంట్ చేశారు. జనసేన పార్టీపై మాట్లాడారు. అందరీ అభిప్రాయం తీసుకొని.. జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టామని చెప్పారు.

Konaseema riots live updates in telugu: Mob attack Minister vishwaroop house

వనిత కామెంట్లను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. పార్టీ పేరు ప్రస్తావించడం సరికాదని మండిపడ్డారు. పచ్చని కోనసీమలో అల్లర్లు ఏంటీ అని పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆందోళన వ్యక్తం చేశారు. కోనసీమలో జరుగుతున్న ఆందోళనలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ వన్ ఇండియా అందిస్తోంది. లైవ్ అప్ డేట్స్ కోసం స్టే ట్యూన్ టు.

Newest First Oldest First
4:23 PM, 25 May
కోనసీమలో చిచ్చు పెట్టింది వైసీపీ. పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయకపోవడం ముందస్తు ప్రణాళికలో భాగమే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును రాజకీయాల కోసం వైసీపీ వాడుకుంటోంది- జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్
3:39 PM, 25 May
అమలాపురంలో చోటు చేసుకున్న అల్లర్లల్లో రౌడీషీటర్లు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కార్యకర్తలతో కలిసి రౌడీషీటర్లు అల్లర్లు సృష్టించారు. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు- రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్
2:51 PM, 25 May
జిల్లాలకు పేర్లు పెట్ట విషయంలో ప్రభుత్వం ద్వంద్వనీతిని అనుసరించింది. ఇతర జిల్లాలకు ఓ న్యాయం, కోనసీమ జిల్లాకు ఓ న్యాయం అన్నట్లు వ్యవహరించింది- జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.
2:46 PM, 25 May
అమలాపురంలో అల్లర్లలో దగ్ధమైన తన ఇంటిని రవాణాశాఖ మంత్రి పినిపె విశ్వరూప్ పరిశీలించారు.
2:44 PM, 25 May
కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును కొనసాగించాలంటూ దళిత సంఘాల ఆందోళన. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో దిష్టిబొమ్మల దగ్ధం.
1:17 PM, 25 May
అమలాపురం ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణం. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేస్తోంది. ప్రజలు సంయమనాన్ని పాటించాలి: తెలుగుదేశం రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు.
1:09 PM, 25 May
అమలాపురం ఘటన పట్ల దళిత బహుజన ఫ్రంట్ ఆగ్రహం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్క్ పేరు పెట్టడాన్ని తాము స్వాగతిస్తున్నామని, వ్యతిరేకించిన వారిపై దేశద్రోహ కేసులను పెట్టాలంటూ డిమాండ్ చేసిన ఫ్రంట్ నేతలు
12:37 PM, 25 May
వాట్సప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా వదంతులు వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలాపురంలో తాత్కాలికంగా ఇంటర్నెట్‌ను నిలిపివేసిన జిల్లా పోలీసు యంత్రాంగం
12:06 PM, 25 May
అమలాపురంలో అల్లర్లకు పాల్పడిన మరో 72 మందిని గుర్తించామని, వారిని అదుపులోకి తీసుకోవడానికి ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపిన పోలీస్ డైరెక్టర్ జనరల్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి
12:01 PM, 25 May
అమలాపురంలో మంత్రి పినిపె విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లు, బస్సులను దగ్ధం చేసిన వారిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు వెల్లడించిన పోలీస్ డైరెక్టర్ జనరల్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి
11:42 AM, 25 May
అమలాపురం అల్లర్ల ఘటనలో ఇప్పటివరకు 46 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపిన పోలీస్ డైరెక్టర్ జనరల్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడి.
11:32 AM, 25 May
అమలాపురానికి చేరుకున్న హోం మంత్రి తానేటి వనతి, గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. తోటి మంత్రి పినిపె విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ కుటుంబ సభ్యులకు పరామర్శ.
8:58 AM, 25 May
ఆంధ్రప్రదేశ్
అమలాపురం ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ దాడులను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైంది. జిల్లాలో అశాంతియుత వాతావరణానికి కారణమైంది ప్రభుత్వమే- బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
8:31 AM, 25 May
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాలో ఇవ్వాళ కూడా ఆందోళనలు జరిగే అవకాశం ఉండటం వల్ల అప్రమత్తంగా ఉన్న పోలీసు యంత్రాంగం.
7:57 AM, 25 May
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోన్న డీఐజీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి.
7:42 AM, 25 May
ఆంధ్రప్రదేశ్
హోం మంత్రి తానేటి వనిత, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, ఇతర మంత్రులు ఇవ్వాళ అమలాపురంలో పర్యటించే అవకాశం ఉంది.
7:20 AM, 25 May
అమలాపురంలో పరిస్థితిని అదుపు చేయడానికి అదనపు పోలీసు బలగాలు తరలింపు
6:53 AM, 25 May
కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని సహించక- అల్లర్లు సృష్టిస్తున్నారని, దీని వెనుక తెలుగుదేశం పార్టీ, జనసేన ఉన్నాయంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్నారు.
6:20 AM, 25 May
ఆంధ్రప్రదేశ్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం లో చోటు చేసుకున్న ఘటన.. అటు రాజకీయ వేడిని రగిల్చింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని తెలుగుదేశం, జనసేన నాయకులు ఘాటు విమర్శలు చేస్తోన్నారు
1:18 AM, 25 May
జగన్ సర్కార్‌పై చంద్రబాబు విమర్శలు
11:07 PM, 24 May
ప్రభుత్వ వైఫల్యాన్ని తమపై నెట్టడం భావ్యం కాదు: చంద్రబాబు నాయుడు
11:04 PM, 24 May
కోనసీమ పేరు మార్చడానికి అన్నీ పార్టీలు అంగీకారం తెలిపాయి: సజ్జల రామకృష్ణారెడ్డి
11:03 PM, 24 May
ఆందోళనకారులు ఇంటిని తగులబెట్టడం దురదృష్టకరం అన్న మంత్రి విశ్వరూప్
9:29 PM, 24 May
కోనసీమలో 144 సెక్షన్ విధింపు
9:19 PM, 24 May
పచ్చని కోనసీమలో అల్లర్లు ఏంటీ అని పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆందోళన
9:18 PM, 24 May
జనసేన రెచ్చగొట్టిందని కామెంట్, తప్పుపట్టిన పవన్ కల్యాణ్
9:18 PM, 24 May
బాధాకరం అని హోం మంత్రి వనిత కామెంట్
9:17 PM, 24 May
భారీగా పోలీసు బలగాలు మొహరింపు
9:16 PM, 24 May
మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు
9:16 PM, 24 May
అగ్గిరాజేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు
READ MORE

English summary
Mob attack andhra pradesh Minister vishwaroop house. recently konasima district name changed dr br ambedkar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X