హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీహరి ఇంటర్వ్యూ కదిలిస్తుంది: సురేఖ, పిలిస్తే..: తలసాని

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Surekha on Real Star
హైదరాబాద్: రియల్ స్టార్ శ్రీహరి ఇంటర్వ్యూలు ప్రతి ఒక్కరిని కదిలిస్తాయని మాజీ మంత్రి, వరంగల్ జిల్లా రాజకీయ నాయకురాలు కొండా సురేఖ గురువారం ఉదయం అన్నారు. శ్రీహరి భౌతికకాయం హైదరాబాదులోని స్వగృహానికి చేరుకుంది. ఆయనను చూసేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు వచ్చారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. కొండా సురేఖ శ్రీహరి స్వగృహానికి చేరుకున్నారు.

శ్రీహరి తమ కుటుంబానికి సన్నిహితుడని, వివిధ సందర్భాలలో తమ ఇంటికి వచ్చారని, సొంత సొదరుడి కంటే ఎక్కువగా అభిమానించే వారని చెప్పారు. ఆయన నటుడే కాకుండా పెద్ద మానవతావాది అని, తన కూతురు అక్షర పేరిట ఫౌండేషన్ ఏర్పాటు చేసి గ్రామాలు దత్తత తీసుకొని సేవ చేసిన వ్యక్తి అన్నారు. ఆయన ఇంటర్వ్యూలు ఎవరినైనా కదిలిస్తాయని చెప్పారు. చాలామంది ఓ స్టేజ్‌కు వచ్చాక గత జీవితాన్ని మర్చిపోతారని, శ్రీహరి అందుకు మినహాయింపు అన్నారు.

తన భర్త కొండా మురళీధర రావుకు శ్రీహరి మంచి మిత్రుడన్నారు. ఆయన మృతి ఇండస్ట్రీకే కాకుండా అభిమానులకు, తమలాంటి కుటుంబ సన్నిహితులకు కూడా లోటు అన్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. ఆయన అభిమానులు, తమలాంటి హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారన్నారు. శ్రీహరి సతీమణి శాంతి తన భర్తను ఎప్పుడు విడిచి ఉండేది కాదన్నారు.

పిలిస్తే పలికే వ్యక్తి: తలసాని

శ్రీహరికి హైదరాబాదుతో మంచి అనుబంధముందని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సహాయం చేయడంలో శ్రీహరి ఎప్పుడు ముందుండేవారన్నారు.

English summary
Former Ministers Konda Surekha and Talasani Srinivas Yadva are said Srihari is Humanitarian.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X