వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హుస్సేన్ సాగర్ లాగా కొండవీటి వాగు అభివృద్ధి: నారాయణ

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ/ న్యూడిల్లీ: హైదరాబాదులోని హుస్సేన్‌సారగ్‌ని తలపించేలా కొండవీటి వాగుని అభివృద్ధి పరుస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. బుధవారం రాజధాని నిర్మాణ అభివృద్ధి కమిటీ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు.2

9 గ్రామాల పరిధిలోనే రాజధాని నిర్మాణముంటుందన్నారు. అనుభవమున్న కంపెనీలకు నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి 5, 10 వేల ఎకరాలు సేకరిస్తామని చెప్పారు. నెలాఖరులోగా రైతులకు కౌలు చెక్కులు అందిస్తామన్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన బృందం వచ్చే గురువారం సింగపూర్‌లో పర్యటిస్తుందని నారాయణ చెప్పారు.

Narayana

ముఖ్యమంత్రి చంద్రబాబుతో జపాన్‌కు చెందిన ఎకోమా అర్బన్‌ స్మార్ట్‌ సొల్యూషన్స్‌ కంపెనీ ప్రతినిధలు భేటీ అయ్యారని, కాకినాడను స్మార్ట్‌ సిటీగా మార్చేందుకు ఆ సంస్థ సుముఖంగా ఉందని చెప్పారు. ఈమేరకు త్వరలోనే ఒప్పందం చేసుకోనున్నట్టు తెలిపారు.

ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు

ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదవుతుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రకటించారు. ఈ అంశమై బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. నిపుణుల పరిశీలన ప్రకారం ఈ ఏడాది 83 శాతం వరకు వర్షపాతం నమోదు కావచ్చని తెలిపారు. వర్షాభావ ప్రభావం ఉంటుంది కానీ అది దేశంలో ఏ ప్రాంతంలో ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం కూడా ఉంటుందని కేంద్ర వాతావరణ పరిశోధకులు చెబుతున్నారని మంత్రి చెప్పారు.

English summary
Andhra Pradesh minister Narayan said that Kondaveeti Vaagu will be developed as Hussain Sagar in Hyderabad of Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X