kondru murali kodela siva prasad chandrababu naidu telangana samaikyandhra కొండ్రు మురళి కోడెల శివ ప్రసాద్ చంద్రబాబు నాయుడు తెలంగాణ సమైక్యాంధ్ర
బావమర్దికి, తమ్ముడికి.. అందరికీ తెల్సు: బాబుపై కొండ్రు

ప్రభుత్వ భూములను కొల్లగట్టిన ఘనత చంద్రబాబుదే అన్నారు. చంద్రబాబు మాట మీద నిలబడే వ్యక్తి కాదన్నారు. ఆ విషయం ఆయన కుటుంబ సభ్యులకు కూడా తెలుసునన్నారు. 2014 ఎన్నికల్లో టిడిపి ఐదేళ్ల క్రితం ఎన్ని సీట్లు గెలుచుకుందో అంతకంటే ఒక్క సీటు కూడా ఎక్కువ గెలుచుకోదన్నారు.
అవినీతి అంటూ తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని విమర్శించే హక్కు బాబుకు లేదన్నారు. రెండెకరాల నుండి కోట్ల రూపాయలు సంపాదించింది బాబే అన్నారు. సోనియాను ఒక్క మాట అన్నా ఆయనకే తగులుతుందన్నారు. అవినీతికి పాల్పడలేదని చంద్రబాబు వెంకటేశ్వర స్వామి, కాణిపాకంలలో ప్రమాణం చేయగలరా అని సవాల్ చేశారు. అవినీతి పైన బాబు గొంతు చించుకుంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.
పార్టీ నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు వెళ్లిపోయినా అభ్యంతరం లేదన్నారు. సభలో తాము సమైక్య తీర్మానం కోసం పట్టుబడతామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు వందల మంది ఉన్నారని, వారే పార్టీని కాపాడుకుంటారన్నారు. ముఖ్యమంత్రి పార్టీని వీడి కొత్త పార్టీ పెడతారనేది ఊహాగానాలే అన్నారు.
టిడిపి ప్రభుత్వమే: కోడెల
2014 సంవత్సరంలో కొత్త పరిపాలన, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజారంజకమైన టిడిపి ప్రభుత్వం పాలన వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత కోడెల శివ ప్రసాద రావు అన్నారు. కాంగ్రెసు పార్టీ శిథిలమైందని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజలను డబ్బుతో కొనుగోలు చేసి మోసగించాలని చూస్తోందన్నారు. జగన్ సమైక్యవాదం నేతి బీరకాయలో నెయ్యి చందమే అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం ఉద్యోగాలు ఫణంగా పెట్టి పోరాడుతున్న ఎపిఎన్జీవో సంఘంలోనే జగన చిచ్చు పెట్టారని మండిపడ్డారు.