వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2024లో ఎలా గెలుస్తారో చూస్తామంటూ సవాల్ విసిరిన గ్రామస్తులు?

|
Google Oneindia TeluguNews

గ్రామంలో నాకు డబ్బులు రావాల్సి ఉందని, అవి రాకుండా మన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలే అడ్డుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త షేక్ రఫీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని నిలదీశారు. మీరు కార్యకర్తలకేం చేశారు? గ్రామంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారా? అంటూ ప్రశ్నించారు. రఫీ ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్న సమయంలో ఆయన పక్కనే నాలుగో వార్డు మెంబర్ గణేష్ కూడా ఉన్నారు.

గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా ఇందుకూరు పేట మండలం కొరుటూరులో ఎమ్మెల్యే నల్లపురెడ్డికి కొన్ని చోట్ల నిరసనలు ఎదురయ్యాయి. 2024 ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామంటూ అక్కడి ప్రజలు సవాల్ విసిరారు. పాలిచ్చే గేదెలు మరణిస్తే పరిహారం రాలేదని, పశువైద్యులు అందుబాటులో ఉండటంలేదని గ్రామ ఉప సర్పంచ్ తుమ్మల ప్రసాద్ బాబాయి శీనయ్య నల్లపురెడ్డిని నిలదీశారు. దీనిపై ప్రసాద్ స్పందించి తన బాబాయిని ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తావా? అంటూ అక్కడినుంచి కొట్టుకుంటూ తీసుకువెళ్లారు. తర్వాత ఎమ్మెల్యే తన పర్యటనలో భాగంగా వెన్న వైష్ణవి అనే విద్యార్థిని ఇంటికి వెళ్లారు. విద్యాదీవెన అందడంలేదని తెలపగా, తన జేబులో నుంచి రూ.10వేలు తీసి ప్రసన్నకుమార్ రెడ్డి వైష్ణవికి అందజేశారు.

korattur people challenge to mla nallapareddy prasanna kumar reddy

Recommended Video

సిగ్గులేకుండా అబద్ధాలా, డబ్బా కొట్టుకోవటం జగన్ రెడ్డికి వ్యసనం *AndhraPradesh | Telugu OneIndia

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పార్టీకి, ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకమైందని, మంత్రులు, ఎమ్మెల్యేలతోసహా వార్డు సభ్యులు కూడా హాజరవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం పట్ల అలసత్వం ప్రదర్శించేవారు, హాజరుకాని ఎమ్మెల్యేలకు ఈసారి ఎన్నికల్లో సీటివచ్చేది లేదని స్పష్టం చేశారు.

English summary
YSR Congress Party activist Sheikh Rafi accused MLA Nallapara Reddy Prasannakumar Reddy of saying that the money should come and it is the leaders and workers of our party who are preventing it from coming.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X