కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు షాక్: టిడిపిలోకి కోట్ల హరిచక్రపాణిరెడ్డి, సన్నిహితులతో మంతనాలు?

మూడున్నరేళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న కోట్ల హరిచక్రపాణిరెడ్డి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కర్నూల్: మూడున్నరేళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న కోట్ల హరిచక్రపాణిరెడ్డి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. ఈ మేరకు తన అనుచరులతో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది. అయితే కోట్ల హరిచక్రపాణిరెడ్డి టిడిపిలో చేరతారనే ఊహగానాలు వెలువడుతున్నాయి.

జగన్‌కు షాక్: బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఫ్యామిలీ రాజకీయాలకు గుడ్‌బై?జగన్‌కు షాక్: బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఫ్యామిలీ రాజకీయాలకు గుడ్‌బై?

నంద్యాల ఉప ఎన్నికల ప్రభావం కర్నూల్ జిల్లా రాజకీయాలపై తీవ్రంగా కన్పిస్తోంది. కర్నూల్ జిల్లాకు చెందిన కొందరు కీలక నేతలు టిడిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని ప్రచారం సాగుతోంది.

రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్న హరిచక్రపాణిరెడ్డి కూడ రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు ఆసక్తి చూపడం ప్రాధాన్యత నెలకొంది. ఈ మేరకు తన సన్నిహితులతో ఆయన మంతనాలు నిర్వహించారు.

ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో కోట్ల హరిచక్రపాణిరెడ్డి తన రాజకీయ భవిష్యత్ కోసం చర్చలు సాగిస్తున్నారు.అయితే గతంలోనే హరిచక్రపాణిరెడ్డి టిడిపిలో చేరేందుకు చర్చలు జరిపినా... చివరి నిమిషంలో మాత్రం ఆగిపోయినట్టు ప్రచారం సాగుతోంది.

కోట్ల హరిచక్రపాణిరెడ్డి టిడిపిలో చేరుతారా?

కోట్ల హరిచక్రపాణిరెడ్డి టిడిపిలో చేరుతారా?

మూడున్నరేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న కోట్ల హరిచక్రపాణిరెడ్డి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కర్నూలు సస్య హోటల్‌లో సోమవారం అత్యంత సన్నిహితులు, మీడియా ప్రతినిధులతో సమావేశమై తన రాజకీయ పునఃప్రవేశంపై చర్చించారు. ఈ నెల 5న దేవనకొండలో కార్యకర్తలు, తన సహచరులతో సమావేశం కానున్నారు.

ఆలూరులో బహిరంగసభ

ఆలూరులో బహిరంగసభ

ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గస్థాయి బహిరంగసభ నిర్వహించేందుకు కోట్ల హరిచక్రపాణిరెడ్డి సన్నాహలు చేసుకొంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

2019 ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. అయితే వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారా.. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారా అన్నది స్పష్టత ఇవ్వలేదు.

2014లో ఆలూరు వైసీపీ టిక్కెట్టు దక్కలేదు

2014లో ఆలూరు వైసీపీ టిక్కెట్టు దక్కలేదు

2014 ఎన్నికల్లో ఆలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు కోట్ల హరిచక్రపాణిరెడ్డి ప్రయత్నించారు. జగన్‌ చేపట్టిన ఓదార్పు యాత్రను ఆలూరులో పర్యవేక్షించింది కోట్ల హరిచక్రపాణిరెడ్డి. అయితే ఆ ఎన్నికల్లో వాల్మీకి ఓటర్లకు చేరువయ్యేందుకు జగన్‌ వ్యూహాత్మకంగా గుమ్మనూరు జయరామ్‌కు టికెట్‌ ఇచ్చారు. కోట్ల చక్రపాణిరెడ్డికి పత్తికొండ టికెట్‌ను కేటాయించారు.

టిడిపి టిక్కెట్టిస్తే ఆలూరులో పోటీ?

టిడిపి టిక్కెట్టిస్తే ఆలూరులో పోటీ?

2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పత్తికొండ నుండి కెఈ కృష్ణమూర్తి పోటీచేశారు. కెఈ చేతిలో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన కోట్ల హరిచక్రపాణిరెడ్డి 7వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు. ఆ తర్వాత అధికార టీడీపీలో చేరేందుకు చర్చలు జరిగాయి. అయితే కారణాలు ఏమిటో తెలియదు కానీ, ఆయన టిడిపిలో చేరలేదు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఏడాదిన్నర కాలంలో ఎన్నికలు రానున్న తరుణంలో మరోసారి రాజకీయరంగ ప్రవేశంపై కోట్ల హరిచక్రపాణిరెడ్డి ఆసక్తి చూపుతున్నారు.

English summary
Kotla Hari Chakrapani reddy may re enter into politics.Hari Chakrapani reddy will meeting with his followers Oct 5 at Alur. There is a spreading a rumour Hari Chakrapani reddy may join in Tdp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X