వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పశ్చాత్తాపపడతారు, మావల్లే ఈ పరిస్థితి: విభజనపై కోట్ల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kotla Surya Prakash Reddy
కర్నూలు: పార్టీని వీడితే పశ్చాత్తాపపడాల్సిందేనని కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గురువారం అన్నారు. స్వల్పకాలిక ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ను వీడిన నాయకులు తర్వాత బాధపడాల్సి వస్తుందన్నారు. ఆయన కర్నూలులో విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీది మాత్రమే తప్పు అంటూ ఇతర పార్టీల నేతలు మాట్లాడటం సరికాదన్నారు.

తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఇచ్చిన లేఖల కారణంగానే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని ప్రజలకు చెప్పాల్సిన నాయకులే సొంత పార్టీపై బురద చల్లడం మంచిది కాదన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచినా, ఓడినా తాను మాత్రం పార్టీని వీడే ప్రశ్నే లేదన్నారు.

దేశంలో స్థిరమైన ప్రభుత్వాన్ని అందించే శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని, ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా మరో రెండేళ్లలో మధ్యంతర ఎన్నికలు తథ్యమన్నారు. అప్పుడైనా అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చినపుడు తాను నిర్ణయం తీసుకుంటానన్నారు.

విభజన నేపథ్యంలో ప్రజలకు కాంగ్రెస్ నేతలు వివరించడంలో జరిగిన పొరపాటు వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. అయితే కాంగ్రెస్ అభిమానులు మాత్రం పార్టీకి దూరం కాలేదన్నారు. పార్టీ ఓటు బ్యాంకులో ఒక్కశాతం కూడా మార్పు రాలేదన్నారు. రానున్న ఎన్నికల్లో ఊహించని ఫలితాలు ఏమీ రావని కాంగ్రెస్ పార్టీ తన స్థానాన్ని మళ్లీ నిలబెట్టుకుంటుందన్నారు.

English summary
Union Minister Kotla Surya Prakash Reddy on Thursday said he will not leave the Congress Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X