వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబుల్ డెక్కర్: కూతకు రెడీ, కోట్ల పరిశీలన (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డబుల్ డెక్కర్ రైలు రావడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో రైల్వే పట్టాలపై డబుల్ డెక్కర్ రైళ్లు కూతవేసే సమయం వచ్చింది. కొత్త డబుల్ డెక్కర్ రైలు గురువారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది.

ర్యాక్‌లు కింది, రెండు మధ్యస్థ (ప్యాంట్రీ సైడ్ అండ్ నాన్ ప్యాంట్రీ సైడ్), మీది అనే నాలుగు అంచెలుగా రూపొందించబడ్డాయి. కింది అంచెలో 48, మధ్యలో (ప్యాంట్రీ సైడ్) 6, నాన్ ప్యాంట్రీ సైడ్‌లో 16, మీది అంచెలో 50 సీట్లులో ఉంటాయి.

అంతేకాకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే పొగ, మంటలను గుర్తించి ఆలారం మోగుతుంది. భారత రైల్వేలో ఈ రకమైన సాంకేతికతను ఉపయోగించి ర్యాక్‌లను తయారు చేయడం ఇదే మొదటిసారి. ఇన్ని హంగులతో రూపొందిన ఈ డబుల్ డెక్కర్ రైళ్లు కాచిగూడ నుంచి తిరుపతి, కాచిగూడ నుంచి గుంటూరు మధ్య బై వీక్లీగా సేవలందించనున్నాయని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్వో కె. సాంబశివరావు తెలిపారు.

డబుల్ డెక్కర్ రైలు గురించి...

డబుల్ డెక్కర్ రైలు గురించి...

రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గురువారంనాడు డబుల్ డెక్కర్ రైలు గురించి వివరిస్తూ ఇలా కనిపించారు.

అడిగి తెలుసుకున్న కోట్ల

అడిగి తెలుసుకున్న కోట్ల

రైల్వే మంత్రి కోట్ల డబుల్ డెక్కర్ రైలులో కలియ తిరుగుతూ ఉన్నతాధికారుల ద్వారా రైలు విశిష్టతలు, భద్రతా ప్రమాణాలను తెల్సుకున్నారు. 2014-15కు సంబంధించిన రైల్వే బడ్జెట్‌లో కేటాయించిన రెండు డబుల్ డెక్కర్ రైళ్లు రాష్ట్రానికి చెందిన దక్షిణ మధ్య రైల్వేకు మంజూరైన విషయం తెలిసిందే.

వేగమే వేగం

వేగమే వేగం

గంటకు 160 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ రైళ్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండేలా, ఆధునిక భద్రతా ప్రమాణాలతో డబుల్ డెక్కర్ రైలును రూపొందించారు

చూడముచ్చటగా కూడా..

చూడముచ్చటగా కూడా..

డబుల్ డెక్కర్ రైలును మూడు పవర్ కార్లతోపాటు 14 ఎసి ర్యాక్ (బోగీ)లతో ఆకర్షణీయంగా రూపొందించారు. చూడముచ్చటగా కూడా ఉంది.

కోట్ల పరిశీలన

కోట్ల పరిశీలన

రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు ప్రభృతులు రైల్వే స్టేషన్‌కు చేరుకుని డబుల్ డెక్కర్ రైలును పరిశీలించారు.

కిందా పైనా ప్రయాణికులు

కిందా పైనా ప్రయాణికులు

ఒక్కో ర్యాక్‌లో కిందా, పైనా కలిపి మొత్తం 120 మంది ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణించేలా తయారైంది.

English summary
State minister Railways Kotla Suryaprakash Reddy has visited yet launch double decker train at Secendurabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X