కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ల‌భించ‌ని హామీ : క‌లిసి ప‌ని చేయండి : కోట్ల వ‌చ్చేనా..కెఇ కి ప్రాధాన్య‌త ద‌క్కేనా..!

|
Google Oneindia TeluguNews

క‌ర్నూలు జిల్లా సీనియ‌ర్ నేత కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి టిడిపిలో చేర‌టం పై ఇంకా సస్పెన్స్ కొన‌సాగుతోంది. ఆయ‌న రెండు రోజులుగా తాను జిల్లాలో ఇరిగేష‌న్ ప్రాజెక్టులు..అభివృద్ది ప‌నుల మీదే ముఖ్య‌మంత్రిని క‌లిసాన‌ని చెబుతున్నా రు. ఇదే స‌మ‌యంలో సీయంతో కెఇ సోద‌రులు భేటీ అయ్యారు. కోట్ల కు ఇచ్చే సీట్ల మీద‌..కెఇ సోద‌రుల‌కు సీట్ల మీద సీయం నుండి స్ప‌ష్ట‌త రాలేద‌ని స‌మాచారం.

కోట్ల టికెట్‌లు కోర‌లేదా..

కోట్ల టికెట్‌లు కోర‌లేదా..

కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాశ రెడ్డి టిడిపిలో చేర‌టం పై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. కొద్ది రోజుల క్రితం కోట్ల త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తో స‌మావేశం అయ్యారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న క‌ర్నూలు జిల్లాలోని ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌తో పాటుగా టిడిపి లో చేరిక అంశాన్ని ప్ర‌స్తావించిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఆ భేటీలోనే త‌మ‌కు క‌ర్నూలు ఎంపి సీటుతో పాటుగా మ‌రో రెండు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు కోరిన‌ట్లుగా పార్టీ నేత‌లు చెబుతూ వ చ్చారు. కోట్ల టిడిపిలో చేరిక పై ఇటు అదే జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత కెఇ కృష్ణ‌మూర్తి అసంతృప్తితో ఉన్నారు. కోట్ల టిడిపిలో చేర‌టం పై సీయం త‌న‌కు ఏ విష‌యం చెప్ప‌లేద‌ని.. ఆయ‌న చెప్పిన‌ప్పుడే తాను మాట్లాడుతాన‌ని డిప్యూటీ సీయం కెఇ కృష్ణ‌మూర్తి చెప్పారు. కానీ, ఆయ‌న త‌న సోద‌రుల‌తో క‌లిసి సీయం ను క‌లిసారు. నేరుగా తన సోద‌రుల‌తో క‌లిసి ప‌త్తికొండ‌..డోన్ టిక్కెట్ లు త‌మ‌కే కేటాయించాల‌ని కోరారు. అయితే, ముఖ్య‌మంత్రి ఈ భేటీలో ఆస‌క్తి క‌ర వ్యాఖ్య లు చేసిన‌ట్లు తెలుస్తోంది. కోట్ల కుటుంబం కూడా తమకు ఫలానా టికెట్‌లు కావాలని కోరలేదని, ఎలాంటి హామీ ఇవ్వ లేదని ముఖ్యమంత్రి స్పష్టంచేసినట్టు సమాచారం.

పవన్ కళ్యాణ్ ఎవరికి తెలుసు.. పొత్తుకు రా, బాబును భూస్థాపితం చేస్తా, జగన్‌పై పోటీ చేస్తా: కేఏ పాల్పవన్ కళ్యాణ్ ఎవరికి తెలుసు.. పొత్తుకు రా, బాబును భూస్థాపితం చేస్తా, జగన్‌పై పోటీ చేస్తా: కేఏ పాల్

లభించ‌ని హామీ..క‌లిసి ప‌ని చేయండి

లభించ‌ని హామీ..క‌లిసి ప‌ని చేయండి

ప‌త్తికొండ‌..డోన్ టికెట్ ల పై కెఇ సోద‌రుల‌కు స్ప‌ష్ట‌మైన హామీ ల‌భించ‌లేదు. పార్టీని బలోపేతం చేసే క్రమంలో ఎవరు వచ్చినా ఆహ్వానించాలని, కోట్ల కుటుంబంతో కలసి పనిచేయాలని కేఈ సోదరులకు ముఖ్యమంత్రి సూచించారు. కోట్ల కుటుంబం తెదేపాలోకి వచ్చినా తమకు ఇబ్బంది లేదని, కలసి పనిచేస్తామని కేఈ సోదరులు చెప్పినట్టు తెలిసింది. కేఈ కృష్ణమూర్తి ప్రస్తుతం పత్తికొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన సోదరుడు ప్రతాప్‌ గత ఎన్నికల్లో డోన్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో పత్తికొండ నుంచి తన కుమారుడు శ్యాంబాబుని, డోన్‌ నుంచి ప్రతాప్ ని పోటీ చేయించే యోచనలో కేఈ ఉన్నారు. కానీ కర్నూలు లోక్‌సభ టికెట్‌తో పాటు, డోన్‌ అసెంబ్లీ టికెట్ని కూడా కోట్ల కుటుంబం అడుగుతుందని భావించిన కేఈ కృష్ణమూర్తి... పత్తికొండ, డోన్‌ టికెట్‌లపై స్పష్టత కోసం సీఎంను కలిశారు.
క‌ల‌సి ప‌ని చేయాల‌ని మాత్రం సీయం సూచించిన‌ట్లు కెఇ సోద‌రులు స్పష్టం చేసారు.

వారు ఎలా పోటీ చేస్తారు..

వారు ఎలా పోటీ చేస్తారు..

ముఖ్య‌మంత్రి తో స‌మావేశం స‌మ‌యంలో కెఇ కుటుంబానికి పార్టీలో ప్రాధాన్య‌త ఉంటుంద‌ని సీయం హామీ ఇచ్చిన‌ట్లు గా చెబుతున్నారు. అయితే, కెఇ సోద‌రులు మాత్రం త‌మ‌ను కాద‌ని కోట్ల కుటుంబానికి ప్రాధాన్య‌త ఇస్తే రాజ‌కీయంగా ఏ నిర్ణ‌యానికైన సిద్ద‌మ‌నే సంకేతాలు ఇస్తున్నారు. ముఖ్య‌మంత్రితో స‌మావేశం త‌రువాత కెఇ సోద‌రులు కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. కోట్ల కుటుంబం కొత్తగా రాబోతోంది అని వారు వ్యాఖ్యానించ‌టం ద్వారా వారి ఉద్దేశం స్ప‌ష్టం అవుతోంది. డోన్‌ నియోజకవర్గం నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉందని, సూర్యప్రకాష్‌రెడ్డి కర్నూలు లోక్‌సభ స్థానం నుం చి, ఆయన సతీమణి డోన్‌ నుంచి ఎలా పోటీ చేస్తారని కేఈ ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు. దీని ద్వారా ఇప్పుడు కోట్ల టిడిపి లో చేరిక‌..కెఇ సోద‌రుల స్పంద‌న టిడిపిలో ఉత్కంఠగా మారాయి.

English summary
Deputy CM K.E Krishna Murthy met CM with his brothers to know about cm mood on Kurnool district assembly seats allocation for Kotla family and KE family. But, CM not given any clarity on their doubts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X