వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ను కట్టి పడేసిన కృష్ణా జిల్లా సెంటిమెంట్..! అందుకే ఆ ముగ్గిరికి కీలక పదవులు..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : కీల‌క‌మైన రాజ‌ధాని జిల్లా కృష్ణాలో వైసీపీ ఇక దూకుడు ప్రద‌ర్శిస్తుందా ? ఇక్కడ నుంచి విజ‌యం సాధించిన కీల‌క నాయ‌కులకు వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ గ‌ట్టి భ‌రోసా ఇచ్చారు. సామాజిక వ‌ర్గాల ఈక్వేష‌న్ చ‌క్కగా కుదిరేలా మంత్రి వ‌ర్గంలో చోటు కూడా క‌ల్పించారు. దీంతో రాబోయే రోజుల్లో ఇక్కడ వైసీపీ ప‌రిస్థితి ఏంట‌నే విష‌యంపై స‌ర్వత్రా చ‌ర్చ జ‌రుగుతోంది. కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలో మూడు విజ‌య‌వాడ న‌గ‌ర‌ ప‌రిధిలో ఉన్నాయి. మొత్తం స్థానాల్లో టీడీపీ రెండు చోట్ల విజ‌య‌వాడ తూర్పు, గ‌న్నవ‌రం త‌ప్ప మిగిలిన స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. హోరా హోరీ అనుకున్న స్థానాల్లోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేయ‌డం గ‌మ‌నార్హం.

 కృష్ణా జిల్లా లో క్టీన్ స్వీప్..! బలపడ్డ జగన్ సెంటిమెంట్..!!

కృష్ణా జిల్లా లో క్టీన్ స్వీప్..! బలపడ్డ జగన్ సెంటిమెంట్..!!

దీంతో రాష్ట్రంలో ప్రత్యేకంగా కృష్ణా జిల్లా చ‌ర్చకు వ‌చ్చింది. ఇక్కడ నుంచి విజ‌యం సాధించిన ఎమ్మెల్యేల్లో ముగ్గురికి జ‌గ‌న్ త‌న కేబినెట్‌లో చోటు క‌ల్పించారు. గుడివాడ నుంచి వ‌రుస‌గా నాలుగోసారి విజ‌యం సాధించిన కొడాలి వేంక‌టేశ్వర‌రావు, ఉర‌ఫ్ నాని(క‌మ్మ), మ‌చిలీప‌ట్నం నుంచి విజ‌యం సాధించిన పేర్ని వెంక‌ట్రామ‌య్య ఉర‌ఫ్‌ నాని(కాపు), విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు (వైశ్య)ల‌కు మంత్రి వ‌ర్గంలో కీల‌క శాఖ‌ల‌ను అప్పగించారు. దీంతో జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత ఈ ముగ్గురిపైనే పడింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

 జిల్లాలో ఆ ముగ్గురు నేతలకు కీలక పదవులు..! జగన్ నమ్మకాన్ని నిలబెడతారా..!!

జిల్లాలో ఆ ముగ్గురు నేతలకు కీలక పదవులు..! జగన్ నమ్మకాన్ని నిలబెడతారా..!!

రాజ‌ధాని గుంటూరే అయిన‌ప్పటికీ వాణిజ్యప‌రంగా చూసుకుంటే విజ‌య‌వాడ‌, మ‌చిలీప‌ట్నం కేంద్రాలు జోరుగా ఉన్నాయి. దీంతో జిల్లాలో టీడీపీ గ‌తంలో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేప‌ట్టింది. ప‌దిహేనేళ్లుగా తెలుగుదేశం పార్టీకి కృష్ణా జిల్లా కంచుకోట‌గా ఉంటూ వ‌స్తోంది. గ‌తంలో వైఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి గాలి వీచినప్పుడు కూడా ఈ జిల్లాలో టీడీపీకే మెజార్టీ స్థానాలు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు ఆ కంచుకోట‌ను బ‌ద్దలు కొట్టిన క్రమంలోనే జ‌గ‌న్ ఆ జిల్లాలో పార్టీ నేత‌లే ఊహించ‌ని విధంగా ఏకంగా మూడు కేబినెట్ బెర్త్‌లు ఇచ్చారు. విజ‌య‌వాడ న‌గ‌రంతో పాటు కృష్ణా జిల్లాలో అనేక స‌మ‌స్యలు ఉన్నాయి. వీటిని ప‌రిష్కరించేలా చ‌ర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ మంత్రుల‌పై ఉంది. మ‌రి ఈ విష‌యంలో ఈ ముగ్గురు ఏమేర‌కు విజ‌యం సాధిస్తారు? జ‌గ‌న్ ఆశ‌ల‌ను ఏమేర‌కు నెర‌వేరుస్తారు? అనే అంశాలు చ‌ర్చకు వ‌స్తున్నాయి.

 పాలనాపరంగా గుంటూరే కీలకం..! కాని కృష్ణా జిల్లా కు ప్రాధాన్యం..!!

పాలనాపరంగా గుంటూరే కీలకం..! కాని కృష్ణా జిల్లా కు ప్రాధాన్యం..!!

రాష్ట్రంలో మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి మేకతోటి సుచరిత హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ మంత్రిగా సచివాలయం రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు చేపట్టారు. హోంమంత్రి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హోం మంత్రిని కలిసి అభినందనలు తెలిపారు. దళిత మహిళకు హోంమంత్రి బాధ్యత ఇచ్చారన‍్న ఆమె మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని...నేరం చేయాలంటేనే భయపడేలా కఠిన చట్టాలు తీసుకు వస్తామని అన్నారు. శాంతి భద్రతలు కాపాడి ప్రజలకు భరోసా కల్పిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు.

 ఉత్తరాంధ్రకు ప్రాధాన్యం..! అందుకే ఆ నేతకు బాద్యతలు..!!

ఉత్తరాంధ్రకు ప్రాధాన్యం..! అందుకే ఆ నేతకు బాద్యతలు..!!

ఇక ముఖ్యమంత్రి జగన్ అన్నీ ఆలోచించిన మీదటనే విశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు పర్యాటక శాఖను కేటాయించారన్న అభిప్రాయం సర్వత్రా కలుగుతోంది. విశాఖను అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామన్న నాటి పాలకుల మాటలు నీటి మూటలు అయ్యాయి. ఇక రాయలసీమకు చెందిన నాటి మంత్రి అఖిలప్రియ విశాఖలో పర్యాటక పెట్టుబడులను ఆకట్టుకునేందుకు ఓ సారి సమావేశం పెట్టి అంతటితో కధ అయిందనిపించారు. అంతకు ముందు కాంగ్రెస్ హయాంలో ఏకంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న చిరంజీవిని అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ తీసుకువచ్చి కొన్ని కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టించారు. కానీ తరువాత నిధుల లేమితో అవి మూలనచేరాయి. మొత్తానికి విశాఖకు అన్నీ వున్నా ఏదో లేదన్న తీరున పర్యాటకం ఆలా పడకెసిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితులను అదిగమించి విశాఖను అభివృద్ది పధంలో నడిపించేందకు జగన్ అవంతి శ్రీనివాసరావుకు కీలక బాద్యతలు కట్టబెట్టినట్టు తెలుస్తోంది.

English summary
Will the VCP be aggressive in Krishna, a key capital district? YCP chief and CM Jagan assured the key leaders who succeeded from here. The Minister positions has also been given a place in the equation of social classes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X