వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ, తెలంగాణా రాష్ట్రాల నీటి లెక్క తేలుతుందా.. అక్టోబర్ 28న కృష్ణా రివర్ బోర్డు భేటీపై ఆసక్తి

|
Google Oneindia TeluguNews

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు పలుమార్లు భేటీ అయినప్పటికీ పరిష్కారం కాలేదు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడాన్ని పరిష్కరించడానికి కేంద్రం నేరుగా రంగంలోకి దిగినప్పటికీ ఎవరి వాదన వారు బలంగా వినిపించారు. దీంతో కేంద్రం రెండు రాష్ట్రాల జల వనరుల విషయంలో నిర్ణయాలను చేతిలోకి తీసుకొనే పరిస్థితి వచ్చింది. ఇక తాజాగా కృష్ణా రివర్ బోర్డు రెండు తెలుగు రాష్ట్రాల నీటి అవసరాలపై 28వ తేదీన తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతో సమావేశం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రతినిధులు ఈ భేటీకి హాజరై తమ నీటి అవసరాలపై ఈ భేటీలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ముందు ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.

కృష్ణా బోర్డు ఆదేశాలు బేఖాతరు .. ఏ లెక్కా చెప్పని ఏపీ, తెలంగాణా .. తీవ్ర అసహనంలో బోర్డు కృష్ణా బోర్డు ఆదేశాలు బేఖాతరు .. ఏ లెక్కా చెప్పని ఏపీ, తెలంగాణా .. తీవ్ర అసహనంలో బోర్డు

ఏపీ, తెలంగాణా రాష్ట్రాలతో అక్టోబర్ 28వ తేదీన కృష్ణా రివర్ బోర్డు భేటీ

ఏపీ, తెలంగాణా రాష్ట్రాలతో అక్టోబర్ 28వ తేదీన కృష్ణా రివర్ బోర్డు భేటీ


అక్టోబర్ 28వ తేదీన ఈ భేటీని నిర్వహిస్తున్నట్లుగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సభ్యుడు , కార్యదర్శి అయిన హరికేష్ మీనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖలు రాశారు.

ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు హరికేష్ మీనా. కృష్ణా డెల్టా, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, కేసీ కెనాల్ నీటి వినియోగంపై ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య సయోధ్య అంశం 2019 డిసెంబర్ 17 వ తేదీ నుంచి పెండింగ్లో ఉందని, ఇప్పుడు దానిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని హరికేష్ మీనా పేర్కొన్నారు.

కృష్ణా నదీ జలాల వినియోగంపై పెండింగ్ వివాదాల పరిష్కారానికి భేటీ

కృష్ణా నదీ జలాల వినియోగంపై పెండింగ్ వివాదాల పరిష్కారానికి భేటీ

అంతేకాదు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీటి వినియోగానికి సంబంధించి కూడా ఏప్రిల్ 21 ,2019 నుండి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వినియోగం పై కూడా ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావడం కూడా పెండింగ్ లోనే ఉందని మీనా పేర్కొన్నారు. 2019నుండి రెండు తెలుగు రాష్ట్రాలు వినియోగించుకున్న కృష్ణా నది జలాలకు సంబంధించి సమావేశంలో చర్చించి రాటిఫై జరగాల్సి ఉందని మీనా ఆ లేఖలలో పేర్కొన్నారు. తదనుగుణంగా ఇరు రాష్ట్రాలు తమ ప్రతినిధులను సమావేశానికి పంపించాలని మీనా స్పష్టం చేశారు.

కేంద్ర మంత్రి ముందే తగ్గకుండా ఇరు రాష్ట్రాల వాదనలు

కేంద్ర మంత్రి ముందే తగ్గకుండా ఇరు రాష్ట్రాల వాదనలు

అయితే ఇటీవల నదీజలాల విషయంలో ఏకంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రంగంలోకి దిగి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడినప్పటికీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తగ్గలేదు. ఎవరి వాదన వారు వినిపించారు. కేంద్రం తీరుతోనే తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగిందని సీఎం కేసీఆర్ బలంగా వాదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీటి వినియోగంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నిర్వహించే రాయలసీమ ఎత్తిపోతల పథకం పాతదేనని ఏపీ సీఎం జగన్ తన వాదన వినిపించారు.

కృష్ణా బోర్డును లెక్క చెయ్యని తెలుగు రాష్ట్రాలు .. ఎవరి వాదన వారిదే !!

కృష్ణా బోర్డును లెక్క చెయ్యని తెలుగు రాష్ట్రాలు .. ఎవరి వాదన వారిదే !!

ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదీ జలాల వినియోగంలో ఎవరు అనుకూలంగా వారి వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశాల్లో రెండు రాష్ట్రాల నదీ జలాల వినియోగాన్ని రాటిఫై చేయడం సాధ్యమవుతుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే కృష్ణానది యాజమాన్య బోర్డును లెక్క చేయడం లేదని, బోర్డు పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Recommended Video

#SonuSood : విద్యార్థికి అండగా నిలిచిన Sonu Sood..ఆదుకుంటానని భరోసా !
నీటి వినియోగం లెక్క తేల్చటం కృష్ణా బోర్డుకు సాధ్యమా ?

నీటి వినియోగం లెక్క తేల్చటం కృష్ణా బోర్డుకు సాధ్యమా ?

ఈ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న క్రమంలో కృష్ణానది యాజమాన్య బోర్డు అక్టోబర్ 28న నిర్వహించనున్న ఈ సమావేశం రెండు తెలుగు రాష్ట్రాల నదీజలాల సమస్యలను పరిష్కరిస్తుందా అంటే కష్టమేనేమో అన్న భావన వ్యక్తమవుతోంది. గతంలోనూ పలుమార్లు బోర్డు సమావేశమైనా బోర్డు అడిగిన వివరాలను రెండు తెలుగు రాష్ట్రాలు సమర్పించలేదు . ఇక ఇప్పుడు కూడా సమస్య పరిష్కారానికి రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు సహకరిస్తాయా, బోర్డు ఈ భేటీలో రెండు రాష్ట్రాల సమస్యకు పరిష్కారం చెయ్యగలుగుతుందా అనేది తేలాల్సి ఉంది.

English summary
The Krishna River Management Board (KRMB) will hold a meeting with Telangana and AP governments on October 28 to reconcile water utilisation.KRMB member-secretary Harikesh Meena on Tuesday wrote a letter to both governments to depute officers to finalise utilisation of water.“Reconciliation of Krishna delta system, Mahatma Gandhi Kalwakurthy Lift Irrigation Project and KC Canal has been pending since December 17, 2019. For outlets like Pothireddypadu head regularator and Nagarjuna Sagar left canal, water utilisation needs to be reconciled from April 21, 2019,” Meena said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X