వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాంతిస్తున్న కృష్ణమ్మ.. లంక గ్రామాల్లో వరద తగ్గుముఖం .. ప్రభుత్వ సాయంపై ప్రజల్లో అసహనం

|
Google Oneindia TeluguNews

నిన్నటి వరకు మహోగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ క్రమంగా శాంతిస్తుంది. కృష్ణా ,గుంటూరు జిల్లాలలో వరద ముంపుకు గురైన ప్రాంతాలు ఇప్పుడిప్పుడే వరద ముంపు నుండి బయటపడుతున్నాయి. వరదలు ముంచెత్తి ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఊహించని విధంగా వచ్చి పడిన ఉపద్రవంతో భయాందోళనలో పలు గ్రామాల ప్రజలు గత నాలుగు రోజులుగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇక ముంపు గ్రామాలలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టినట్లు గా ప్రభుత్వం చెపుతున్నా, తమకు ఎలాంటి సహాయం అందడం లేదని, పడరాని పాట్లు పడుతున్నామని ముంపు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుతో తీవ్ర అసహనంతో ఉన్నారు.

<strong>మాకు స్పష్టత కావాలి ..లేకుంటే సెప్టెంబర్ 1న బ్లాక్ డే గా పాటిస్తామంటున్న ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య </strong>మాకు స్పష్టత కావాలి ..లేకుంటే సెప్టెంబర్ 1న బ్లాక్ డే గా పాటిస్తామంటున్న ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య

కృష్ణమ్మకు వరద తగ్గుముఖం ..బయటపడుతున్న ముంపు గ్రామాలు

కృష్ణమ్మకు వరద తగ్గుముఖం ..బయటపడుతున్న ముంపు గ్రామాలు

ఇప్పుడే కృష్ణమ్మ వరద నుండి ముంపు గ్రామాలు బయటపడుతున్నాయి. కృష్ణా నదికి వరద క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ముంపు గ్రామాలు కాసింత ఊపిరి పీల్చుకున్నాయి. ఇప్పటికే భారీగా వచ్చిన వరదనీటితో ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతాల్లో గత నెలరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉద్ధృతంగా ప్రవహించింది. నారాయణపూర్‌, ఆల్మట్టి నిండిపోయింది. అటు జూరాల నుంచి , ఇటు తుంగభద్ర నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద పది గేట్లను ఎత్తేశారు. 885 అడగుల గరిష్ట నీటి మట్టానికి గాను ప్రస్తుతం 882 అడుగుల మేర నీటిమట్టం ఉంది. 215 టీఎంసీలకు ,199 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాంలోకి 4లక్షల 21 వేల 869 క్యూసెక్కులు వస్తుండగా... అవుట్‌ ఫ్లో 5 లక్షల 67 వేల 168 క్యూసెక్కులుగా ఉంది..
మరోవైపు.. నాగార్జున సాగర్‌ నుంచి నీటిని విడుదల చేసిన నేపథ్యంలో గుంటూరు జిల్లాలో లంక గ్రామాలు నీట మునిగాయి. ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. అయినప్పటికీ ఇప్పటికీ 22 గ్రామాలు జలదిగ్భందంలోనే చిక్కుకున్నాయి.

 ప్రభుత్వ సహాయకచర్యలపై అసహనం .. తీవ్ర ఇబ్బందుల్లో వరద బాధితులు

ప్రభుత్వ సహాయకచర్యలపై అసహనం .. తీవ్ర ఇబ్బందుల్లో వరద బాధితులు

ఇక ప్రకాశం బ్యారేజీలో వరదనీరు దిగువకు విడుదల చేయడంతో కృష్ణా, గుంటూరు జిల్లాలలోని లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కృష్ణానది వరద కృష్ణలంక, రాణిగారి తోట, రామలింగేశ్వర నగర్‌లోని ఇళ్లను ముంచెత్తింది. వరద నీరు ఇంటిపైకప్పు వరకు చేరడంతో ప్రజలు కట్టుబట్టలతో రోడ్లపైకి వచ్చారు. పునరావాస కేంద్రాల వద్ద కొందరు తల దాచుకుంటే, నిలువ నీడ లేక ఇబ్బంది పడిన వారు కూడా లేకపోలేదు. తినడానికి ఆహారం సరిగా లేక నానా ఇబ్బందులు పడ్డారు ప్రజలు. మొత్తానికి కృష్ణమ్మ క్రమంగా శాంతించినా వరద బాధితులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దుర్భరంగా ముంపు గ్రామాల ప్రజల పరిస్థితి .. ప్రభుత్వం పట్టించుకోవాలని విజ్ఞప్తి

దుర్భరంగా ముంపు గ్రామాల ప్రజల పరిస్థితి .. ప్రభుత్వం పట్టించుకోవాలని విజ్ఞప్తి

ప్రస్తుతం గ్రామాల్లో వరద పరిస్థితి తగ్గినా.... ప్రజలు మాత్రం దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నారు. తాగేందుకు నీరు లేక, తినేందుకు తిండిలేక అలమటిస్తున్నారు ఇక్కడి ప్రజలు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు . గుంటూరు జిల్లాలోని ముంపుకు గురైన 22 గ్రామాలకు గాను 15 గ్రామాల్లో వరద తగ్గింది. ఇప్పుడిప్పుడు జనం బయటికి వస్తున్నారు మరో 7 గ్రామాల్లో వరదనీరు ఇప్పటికీ తగ్గలేదు. దీంతో ఇంటి పైకప్పులపైనా వీళ్లు జాగారం చేస్తున్నారు. ఇప్పటివరకు అధికారులు ఇక్కడికి రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు తక్షణ సహాయం అందించాలని , ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా తిరిగి సాధారణ పరిస్థితులు తీసుకురావాలని కోరుతున్నారు వరద బాధితులు.

English summary
The flood-hit areas of Krishna and Guntur districts are now getting flood relief as the river Krishna has receded. The people of flood effected villages have been angry on government that they receive no assistance and that they are not getting any help, even as the government says it has taken large-scale relief operations. They are deeply impatient with the government
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X