వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ మంచి నిర్ణయం: బీజేపీ-జనసేన పొత్తుపై కృష్ణంరాజు స్పందన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తో జనసేన పొత్తు విషయంపై మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కళ్యాణ్ బీజేపీతో కలవడం శుభపరిణామమని ఆయన వ్యాఖ్యానించారు.

పార్టీల సిద్ధాంతాలు కలపుకుని..

పార్టీల సిద్ధాంతాలు కలపుకుని..

హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ క్లబ్‌లో జరిగిన తన 80వ జన్మదిన వేడుకల సందర్భంగా మీడియాతో తన సినీ, రాజకీయ అనుభవాలను పంచుకున్నారు కృష్ణంరాజు. బీజేపీ-జనసేన పొత్తు స్పందిస్తూ.. రెండు పార్టీలు సిద్ధాంతాలు కలుపుకుని 5 కోట్ల మంది ఆంధ్రులకు సేవ చేయాలని సూచించారు.

అన్ని రకాల మేలు..

అన్ని రకాల మేలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ విస్తరణకు బీజేపీ కృషి చేస్తోందని కృష్ణంరాజు వెల్లడించారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తోడవడం అన్ని రకాలుగా మేలు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను, ఇతర బీజేపీ పెద్దలను కలిసిన విషయం తెలిసిందే. రెండ్రోజుల క్రితం విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి పవన్ కళ్యాణ్, బీజేపీ, జనసేన కీలక నేతలు మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ-జనసేన ఇక నుంచి కలిసి పనిచేస్తాయని ఇరు పార్టీల నేతలు ప్రకటించారు.

1998లో బీజేపీలోకి కృష్ణంరాజు..

1998లో బీజేపీలోకి కృష్ణంరాజు..

1991లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణంరాజు.. అదే సంవత్సరం నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్ రాజు చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 1998 ఎన్నిలకు ముందు బీజేపీలో చేరారు కృష్ణంరాజు. ఆ తర్వాత బీజేపీ టికెట్‌పై పోటీ చేసి కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

వాజపేయి ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా..

వాజపేయి ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా..

1999 మధ్యంతర ఎన్నికల్లో నర్సాపురం లోక్‌సభ నుంచి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొంది కేంద్రంలో వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి పదవిని నిర్వహించారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జోగయ్య చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2009లో బీజేపీని వీడి చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో కొంతకాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న కృష్ణంరాజు అనంతరం మళ్లీ బీజేపీ గూటికే చేరారు. ప్రస్తుతం ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నారు.

English summary
Former Union Minister Krishnam Raju response on bjp-janasena alliance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X