నేనే చంపేస్తా: పేరెంట్స్‌పై కృపామణి అత్త ఆగ్రహం, వెలుగులోకి మరిన్ని విషయాలు
పశ్చిమగోదావరి : కృపామణిని వ్యభిచారంలోకి దించాలని ఒత్తిడి చేసిన ఆమె తల్లిదండ్రులపై అత్త వెంకటరమణమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకులో తల్లిదండ్రుల వేధింపులు తాళలేక కృపామణి అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. కృపామణి ఆత్మహత్యపై ఆమె అత్త వెంకటరమణమ్మ స్పందించింది.
కృపామణి ఆత్మహత్యకు కారణమైన ఆమె తల్లిదండ్రులను ఉరితీయాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకపోతే తానే చంపేస్తానని హెచ్చరించింది. కృపామణి చాలా మంచిదని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే కృపామణిని వ్యభిచారం కోసం గుడాల శ్రీనివాస్ అనే వ్యక్తికి రూ. 7 లక్షలకు అమ్మినట్లు ఆమె భర్త పవన్ చెప్పాడు. తన భార్య మంచిదని, ఆమె తల్లి వల్లే కృపామణి ఆత్మహత్య చేసుకున్నదని ఆవేదన చెందాడు.
పశ్చిమగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన వివాహిత కృపామణి ఆత్మహత్య కేసులో దిగ్ర్భాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వేల్పూరులోని స్థానిక నేత గుడాల సాయిశ్రీనివాస్‌కు కృపారాణిని తల్లిదండ్రులు రూ.7 లక్షలకు విక్రయించారు. కృపామణితో వ్యభిచారం చేయించాలనే ఉద్దేశంతోనే సాయిశ్రీనివాస్ కొనుగోలు చేశాడు.

వ్యభిచారం చేయాలని కృపామణిని అతడు తీవ్రంగా వేధించాడు. తాను చెప్పినట్టు వినకపోతే నగ్న వీడియోలను నెట్లో పెడుతానని సాయిశ్రీనివాస్ బెదిరింపులకు పాల్పడ్డాడు. గతంలోనూ వేధింపులు తాళలేక తల్లిదండ్రులు, సాయిశ్రీనివాస్‌పై కృపామణి కేసు పెట్టింది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
కాగా బెయిల్‌పై వచ్చి తర్వాత కూడా కృపామణిని నిందితులు వేధింపులకు గురిచేశారు. అప్పటి నుంచి కృపామణికి వేధింపులు మరింత పెరిగాయి. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు.
తల్లిదండ్రులు, సోదరుడు వ్యభిచారంలోకి దింపాలని చూస్తున్నారనే మనస్థాపంతో మంగళవారం కృపామణి వేల్పూరులోని ఓ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!