వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాడు కేటీఆర్ తోనే బాబు.. జ‌గ‌న్ తో లంచ్ మీటింగ్ : ఆత్మ‌ర‌క్ష‌ణ‌లోకి నెట్టేలా : వైసిపి భ‌విష్య‌త్

|
Google Oneindia TeluguNews

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో ప‌లువురు నేత‌ల వ‌ద్ద‌కు కేసీఆర్ నేరుగా వెళ్లి..ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్ర‌తిపాద‌న పై చ‌ర్చిస్తున్నారు. కానీ, ఏపిలోని ప్ర‌తిప‌క్ష పార్టీ వైసిపి అధినేత జ‌గ‌న్ వ‌ద్ద‌కు మాత్రం కేటిఆర్ . ఎందుకు..జ‌గ‌న్ తో చ‌ర్చ‌ల కోసం కేటిఆర్ ను కేసీఆర్ ఎందుకు ఎంచుకున్నారు. జ‌గ‌న్ - కేటిఆర్ మ‌ధ్య లంచ్ మీటింగ్ సారాంశం ఏంటి. ఏపి లో గ్రౌండ్ ప్రిప రేష‌న్ కోస‌మా..రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల్లో భాగ‌మా....

వ్యూహాత్మకంగానే కేటీఆర్ ఎంపిక‌..

వ్యూహాత్మకంగానే కేటీఆర్ ఎంపిక‌..

అక్క‌డికి కేసీఆర్‌..ఇక్క‌డ‌కు కేటీఆర్‌.ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు ప్ర‌య‌త్నాల్లో భాగంగా.. కెసిఆర్ ప‌లు పార్టీల నేత‌ల‌తో నేరుగా స‌మావేశ‌మ‌య్యారు. బెంగ‌లూరు వెళ్లి జెడిఎస్ నేత‌ల‌తో..కోలోక‌త్తా వెళ్లి మ‌మ‌తా బెన‌ర్జీ,ఢిల్లీలో ఇత‌ర పార్టీల నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశ‌మ‌య్యారు. ఇప్పుడు త‌న‌యుడు కేటీఆర్ ను వైసిపి అధినేత జ‌గ‌న్ వ‌ద్ద‌కు పంపుతున్నారు. అయ‌తే, జ‌గ‌న్ తో కేసీఆర్ నేరుగా స‌మావేశం అవ్వాల‌ని భావించినా..ప్రోటోకాల్ స‌మ‌స్య‌ల‌తో పాటుగా రాజ‌కీయంగా ఏపిలో వైసిపి పై అన‌వ‌స‌రంగా విమర్శ‌ల‌కు కార‌ణం అవుతామ‌నే ఉద్దేశంతోనే కేసీఆర్ కాకుండా కేటీఆర్ ను ఎంపిక చేసుకున్న‌ట్లుగా స‌మాచారం. ఇక‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల నుండి తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కు సీమాంధ్ర ఓట‌ర్లు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌ను కేటీఆర్ సింగిల్ హ్యాండ్ తో గెలిపించారు. దీంతో పాటుగా భ‌విష్య‌త్‌లో ఏపి పై అనుస‌రించే వ్యూహాల్లో కేటీఆర్‌..కేసీఆర్ ప్ర‌తినిధిగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంది. దీంతో..వ్యూహాత్మ‌కంగానే కేటీఆర్‌ ను ఎంచుకున్న‌ట్లుగా కనిపిస్తోంది.

వైసిపి భ‌విష్య‌త్ కోస‌మేనా..

వైసిపి భ‌విష్య‌త్ కోస‌మేనా..

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో జ‌రిగే ఈ స‌మావేశం పై ఏపి లో ఆస‌క్తి నెల‌కొంది. తెలంగాణ ఎన్నిక‌ల త‌రువాత ఏపి రాజ‌కీయా ల్లో వేలు పెడ‌తామ‌ని కేసీఆర్‌- కేటీఆర్ ప్ర‌క‌టించారు. ఇప్పుడు తెలంగాణ తో పాటుగా ఏపి రాజ‌కీయాల్లో తాము నిర్వ హించాల్సిన బాధ్య‌త‌ల‌ను కెసీఆర్‌..కేటీఆర్ కు అప్ప‌గించిన‌ట్లు క‌నిపిస్తోంది. ఒక వైపు కెసీఆర్ తో జ‌గ‌న్ సంబంధాల పై ముఖ్య‌మంత్రి మొద‌లు టిడిపి నేత‌లు..జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ సైతం జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. ఇదే స‌మ‌యంలో టిఆర్‌య‌స్ అధినేత ప్ర‌తినిధులు వ‌చ్చి వైసిపి అధినేత‌తో స‌మావేశం అవుతున్నారు. విమ‌ర్శ‌లు వెల్లువె త్తుతున్న స‌మ‌యంలోనే ...అస‌లు విష‌యాల‌ను బ‌ట‌య పెడ‌తామ‌ని..అప్పుడే ప్ర‌జ‌ల్లోకి వాస్త‌వాలు వెళ్తాయ‌ని వైసిపి నేత‌లు చెబుతున్నారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కోసం ఈ స‌మావేశం జ‌రుగుతుంద‌ని చెబుతున్నా..ఇదే స‌మ‌యంలో ఏపిలో రాజ‌కీయాల పై చ‌ర్చ‌లు సైతం జ‌రుగుతాయి. ఇక‌, ఇప్ప‌టికే టిఆర్‌య‌స్ - జ‌గ‌న్ క‌లిసి ఏపిలో పోటీ చేయాల‌ని సీయం వ్యాఖ్యానించారు. అయితే, నేరుగా కాకుండా..జ‌గ‌న్ కు ఏ ర‌కంగా రాజ‌కీయంగా సాయం అందించాల‌నే దాని పై టిఆర్ య‌స్ నేత‌లు చ‌ర్చించే అవ‌కాశం ఉంది. అయితే, వైసిపి నేత‌లు మాత్రం తాము ఒంట‌రిగానే వెళ్తామ‌ని.. వారి మ‌ద్ద‌తు తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతున్నారు.

టిడిపి చేతికి ఆయుధం.. ఎదురుదాడికి సిద్దం..

టిడిపి చేతికి ఆయుధం.. ఎదురుదాడికి సిద్దం..

ఈ స‌మావేశం ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు కోస‌మ‌ని చెబుతున్నా..అన్ని విష‌యాలు ఇందులో చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే టిడిపి నేత‌లు ఈ భేటీ పై విమ‌ర్శ‌లు ప్రారంభించారు. ఇదే స‌మ‌యంలో..టిఆర్‌య‌స్ - వైసిపి నేత‌లు సైతం చంద్ర‌బాబు టిఆర్‌య‌స్ తో పొత్తు కోసం చేసిన ప్ర‌య‌త్నాల‌ను విస్తృతంగా ప్ర‌చారం చేయాల‌ని భావిస్తున్నారు. ఇదే కేటీఆర్ వ‌ద్ద చంద్ర‌బాబు టిఆర్‌య‌స్ - టిడిపి పొత్తును ప్ర‌తిపాదించారు. హ‌రికృష్ణ భౌతిక కాయం వ‌ద్ద ఈ చ‌ర్చ లు జ‌రిగిన‌ట్లు కేటీఆర్‌..చంద్ర‌బాబు ఇద్ద‌రూ ధృవీక‌రించారు. అయితే, ఇప్పుడు అదే టిఆర్‌య‌స్ ను వైసిపి కి మిత్ర‌ప క్షం గా ప్ర‌చారం చేసి ఏపిలో ల‌బ్ది పొందాల‌నేది టిడిపి ఆలోచ‌న‌. దీనిని తిప్పి కొడ‌తామ‌ని టిఆర్‌య‌స్ - వైసిపి నేత‌లు చెబుతున్నారు. ఈ స‌మావేశం ద్వారానే..ప్ర‌త్యేక హోదా పై స్ప‌ష్ట‌త ఇవ్వ‌టం..లేఖ కోర‌టం వంటి వాటి ద్వారా సీయం
చంద్ర‌బాబును ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసే విధంగా జ‌గ‌న్ వ్యూహాలు సిద్దం చేస్తున్న‌ట్లు స‌మాచారం.

English summary
KTR Lunch meeting with TRS Chief Jagan to discuss on Federal Front progress. TRS inviting YCP into federal Front. Jagan already stated that who will support Special status for AP then YCP support unconditionally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X