• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పీర్ల పండగలో అపశృతి: అగ్నిగుండంలో పడి వ్యక్తి సజీవ దహనం

|
Google Oneindia TeluguNews

అమరావతి: కర్నూలు జిల్లా అవుకు మండలం సుంకేసుల గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పీర్ల పండగను పురస్కరించుకుని అగ్ని గుండం వెలిగించగా.. ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ అందులో పడి మృతి చెందాడు. అందరూ చూస్తుండగానే కాలిపోయాడు. స్థానికులు అతడ్ని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పీర్ల పండగను తెలుగు రాష్ట్రాల్లో హిందూ, ముస్లింలు సోదరభావంతో ఘనంగా జరుపుకుంటారు. అలాగే, సుంకేసులలో పెద్ద సరిగేతు పండగను ఘనంగా జరుపుకుంటారు. పండగను తిలకించేందుకు భారీగా జనం వస్తారు. ఇక కాశీపురంకు చెందిన వెంకటసుబ్బయ్య(55) గురువారం పొరుగు గ్రామంలో జరుగుతున్న పీర్ల ఊరేగింపు చూడసేందుకు సుంకేసులకు వెళ్లాడు.

 Kurnool: A man who fell fire was burnt alive

అయితే, అగ్నిగుండం వెలిగించిన సమయంలో ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు వెంకటసుబ్బయ్య. వెంటనే అప్రమత్తమైన కొందరు స్థానికులు, యువకులు కర్రల సాయంతో అతడిని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆలస్యం కావడంతో సుబ్బయ్య తీవ్రగాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని బయటికితీశారు.

సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు కాశీపురం గ్రామానికి చెందినవాడని, వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. మొహర్రం తిలకించేందుకు వచ్చి ప్రమాదవశాత్తు అగ్నిగుండంలో పడి మృతి చెందాడని పోలీసులు చెప్పారు.

పిల్లలకు విషమిచ్చిన తండ్రి

విశాఖపట్నంలో యారాడలో కన్నతండ్రే దారుణానికి ఒడిగట్టాడు. బాదం పాలలో విషం కలిపి కూతురు, కొడుకుకు తాగించాడు. యారాడలో నివాసముంటున్న మొల్లి శ్రీను.. 14 ఏళ్ల కూతురు అను, 10ఏళ్ల కుమారుడు చరణ్‌కు విషం కలిపిన బాదం పాలు ఇచ్చాడు. ఆ పాలను ఎంతో ఇష్టంగా తాగిన అను, చరణ్‌.. వెంటనే స్పృహ తప్పి పడిపోయారు. స్థానికులు ఈ విషయం గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులిద్దరికీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబంలోని ఆర్థిక వ్యవహారాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంతోనే కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో మొల్లి శ్రీను విషం కలిపిన బాదం పాలను తన కొడుకు, కూతురుకు తాగించాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తున్నారు. పిల్లలిద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి ఎందుకు పిల్లలను చంపాలనుకున్నాడనేదానిపై విచారణ చేస్తున్నారు.

వెంటాడిన తేనెటీగలు.. గుండెపోటుతో వ్యక్తి మృతి

గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తేనెటీగల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో పరిగెత్తుతూ గుండెపోటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.... మాచర్ల పట్టణంలో టైలరింగ్ వృత్తి చేసే మద్దోజు శ్రీనివాసాచారి(55) బంధువుల సంవత్సరికం ఉండటంతో ఉప్పలపాడు గ్రామానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. గ్రామ శివారులో పూజలో భాగంగా హోమం చేస్తుండగా పొగ దట్టంగా వ్యాపించింది. దీంతో ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న చెట్టుపై గల తేనెతుట్టె పొగ వల్ల చెల్లా చెదురైంది. ఈ క్రమంలో తేనెటీగలు ఒక్కసారిగా అక్కడున్న వారిపై దాడి చేశాయి. అదే సమయంలో అక్కడే ఉన్న శ్రీనివాసాచారిపై కూడా దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తుతూ కింద పడి పోయాడు. స్పృహ కోల్పోయిన ఆయనను హుటాహుటిన మాచర్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Kurnool: A man who fell fire was burnt alive
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X