గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ రెండు జిల్లాల్లో తొమ్మిది వేలకు చేరువగా కేసులు:మళ్లీ లాక్‌డౌన్: కఠినంగా ఆంక్షలు..భారీగా జరిమానాలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా పాజిటివ్ కేసులు ఉధృతంగా నమోదవుతోన్న నగరాలు, పట్టణాల్లో ఇప్పటికే లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. అది కాస్త మరింత విస్తృతమైంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్‌డౌన్‌ను అమలు చేయడం మినహా ప్రత్యామ్నాయమేదీ దరిదాపుల్లో లేదు. రోజురోజుకూ వందల కొద్దీ పాజిటివ్ కేసులు నమోదవుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అది విస్తరించకుండా ఉండటానికి అధికారులు ఎక్కడికక్కడ లాక్‌డౌన్‌ను అమలు చేయాల్సి వస్తోంది.

టీటీడీలో విభేదాలు భగ్గు: శ్రీవారి దర్శనంపై పేచీ: జగన్ వద్దకు పంచాయితీ: రెండుగా చీలినటీటీడీలో విభేదాలు భగ్గు: శ్రీవారి దర్శనంపై పేచీ: జగన్ వద్దకు పంచాయితీ: రెండుగా చీలిన

కొత్తగా కర్నూలు, గుంటూరు జిల్లాల్లో లాక్‌డౌన్ అమల్లోకి రానుంది. శనివారం నుంచి మరింత కఠినంగా ఈ రెండు జిల్లాల్లో లాక్‌డౌన్‌ను అమలు చేయడానికి అధికారులు సన్నాహాలు చేపట్టారు. ఈ రెండు జిల్లాల్లో భారీగా కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి.. అవుతున్నాయి. గురువారం ఉదయం 9 గంటల సమయానికి కర్నూలు జిల్లాలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4816. 24 గంటల్లో ఆ జిల్లాలో 590 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదే తరహా పరిస్థితులు గుంటూరు జిల్లాలోనూ నమోదు అయ్యాయి. ఇప్పటిదాకా ఈ జిల్లాలో 3963 కేసులు వెలుగులోకి వచ్చాయి.

Kurnool and Guntur districts in Andhra Pradesh goes lockdown after Covid 19 positive cases records huge number

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు జిల్లాల్లో శనివారం నుంచి లాక్‌డౌన్‌ను అమల్లోకి తీసుకుని రానున్నారు. వారంరోజుల పాటు లాక్‌డౌన్ కొనసాగుబోతోంది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే షాపులను తెరవడానికి అనుమతి ఇచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తప్పనిసరి పరిస్థితుల్లో వారంరోజుల పాటు పూర్తి లాక్‌డౌన్‌ను అమలు చేయాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఎవరూ తమతమ ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని కర్నూలు జిల్లా కలెక్టర్ జీ వీరపాండియన్, గుంటూరు కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ సూచించారు.

Recommended Video

Bhuma Akhila Priya To Start Film Production House || Oneindia Telugu

కరోనా నియంత్రణలో భాగంగా మాస్క్ తప్పని సరిగా ధరించాలని కలెక్టర్లు ఆదేశించారు. బయటికి వచ్చే వారు సామాజిక దూరాన్ని పాటించాలని, శానిటైజర్లను విస్తృతంగా వియోగించాలని సూచించారు. కరోనా నియంత్రణకు సహకరించాలని ఆయన జిల్లా ప్రజలకు కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. మాస్క్ ధరించని వారిపై భారీగా జరిమానాలను విధిస్తామని అన్నారు. జరిమానాలను 500 రూపాయల వరకు విధించనున్నారు. గుంటూరు జిల్లా నరసరావు పేట, కర్నూలు జిల్లా నంద్యాల, ఆదోని పట్టణాల్లో పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి.

English summary
Kurnool and Guntur districts in Andhra Pradesh goes lockdown after Covid 19 positive cases records huge number. Guntur District collector Samul Anand Kumar has declared partial lockdown in Guntur and allowed shops and establishments to open only till 12 noon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X