కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నూలులో వైద్యులకు కరోనా భయం ... అలా అయితేనే వైద్యం చేస్తామని డిమాండ్

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఐద్యులకు టెన్షన్ పట్టుకుంది. ఇప్పటివరకు నలుగురు వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్థారణ కావటం వైద్య వర్గాల్లో టెన్షన్ కు కారణం అవుతుంది. . సరైన రక్షణ లేకనే వైద్యులు కరోనా బారిన పడుతున్నారని డాక్టర్ల వాదన . మార్చి 26న అనంతపురంలోని హిందూపురంలో 68 ఏళ్ల వద్ధుడు ఇటీవల కరోనా వైరస్‌తో మరణించాడు. ఆ వ్యక్తికి చికిత్స చేసిన నలుగురు వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది అలాగే వారితో పాటు పనిచేసిన 25 మంది సిబ్బందిని కూడా క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్న పరిస్థితి డాక్టర్లకు టెన్షన్ తెప్పిస్తుంది . దీంతో కర్నూలు జిల్లాలో వైద్యులు తమకు పీపీఈ కిట్లు , మాస్క్‌లు ఇస్తేనే వైద్యం చేస్తామని చెప్తున్నారు .

కరోనా ఎఫెక్ట్ .. ఖాళీగా ప్రైవేట్ ఆస్పత్రులు ... కిటకిటలాడుతున్న సర్కారీ ఆస్పత్రులుకరోనా ఎఫెక్ట్ .. ఖాళీగా ప్రైవేట్ ఆస్పత్రులు ... కిటకిటలాడుతున్న సర్కారీ ఆస్పత్రులు

 కర్నూలులో 74 కరోనా పాజిటివ్ కేసులు .. మర్కజ్ ఎఫెక్ట్

కర్నూలులో 74 కరోనా పాజిటివ్ కేసులు .. మర్కజ్ ఎఫెక్ట్

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి అరకు 344 కేసులు నమోదు కాగా 5 మరణాలు సంభవించాయి. ఇక ఏపీలోని కర్నూలు జిల్లాలో రోజురోజుకీ కరోనా పాజిటివ్‌ కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాలోని మొత్తం 74 కేసుల్లో ఒక్క రెండు రోజుల్లోనే ఏకంగా 70 నమోదయ్యాయి.మొత్తం 74 పాజిటివ్‌ కేసుల్లో 73 మంది ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారే కావటం గమనార్హం .

అరాకొరా వసతులతో వైద్యం చెయ్యలేము అంటున్న వైద్యులు

అరాకొరా వసతులతో వైద్యం చెయ్యలేము అంటున్న వైద్యులు

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు బాగా పెరిగాయి.ఇప్పటి వరకు జిల్లాలో 463 శాంపిల్స్‌కు గాను 393 రిపోర్టులు వచ్చాయి. మరో 70 రావాల్సి ఉంది. నిర్ధారణ పరీక్షల కోసం కర్నూలులోనే ల్యాబ్‌ ఏర్పాటుచేస్తామని సర్కార్ చెప్తున్నా అరాకొరా వసతులతో తాము వైద్యం చెయ్యలేమని చెప్తున్నారు వైద్యులు . ఇక దీంతో కర్నూలు జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కరోనా చికిత్సలు ఎస్మా ప్రయోగించినా సరే చెయ్యలేము అని తేల్చి చెప్పిన కొందరు ప్రభుత్వ వైద్యులు ఇప్పటికే కరోనా వైద్యం చెయ్యకుండా దూరమయ్యారు.

ప్రభుత్వ వైద్యులపై ఎస్మా .. ట్రీట్మెంట్ చెయ్యాలంటే ప్రైవేట్ వైద్యుల డిమాండ్

ప్రభుత్వ వైద్యులపై ఎస్మా .. ట్రీట్మెంట్ చెయ్యాలంటే ప్రైవేట్ వైద్యుల డిమాండ్

ఇక ప్రభుత్వం కూడా ఎస్మా కింద కర్నూలులో అనేకమంది డాక్టర్లకు నోటీసులు జారీ చేశారు. దీంతో మొత్తం భారం ప్రైవేటు వైద్యులపైనే వేశారు. దీంతో పీపీఈ కిట్లు , మాస్క్‌లు లేకుండా వైద్యము చేయలేమని ప్రైవేటు డాక్టర్లు అంటున్నారు. అంతే కాదు తొలి ప్రాధాన్యం జీజీహెచ్‌కే ఇచ్చి ప్రభుత్వ సిబ్బందికీ విధులు అప్పగించాలని, ఆ తరువాతే తమకు విధులు అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు . అప్పుడే తాము సేవలు అందిస్తామని చెప్తున్న వారు కాదంటే అరెస్టులకూ సిద్ధమేనని చెబుతున్నారు. కానీ ఎలాంటి రక్షణ లేకుండా వైద్యం చెయ్యలేమని చేతులెత్తేస్తున్నారు .

Recommended Video

AP Lockdown :15 New కరోనా Cases In AP,Total Cases 329

English summary
The government has issued notices to several doctors in Kurnool under Esma. The whole burden is placed on the private doctors. Private doctors say that this cannot be done without PPE kits and masks. They are demanding that the first priority be given to the GGH and the duties of the public servants and subsequently to the government. Those who claim to serve them are now ready for arrests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X