• search
  • Live TV
కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

'ఒకేసారి ఏం దొరికార్రా.. చంపండ్రా..': కర్నూలు ఫ్యాక్షన్ హత్యలపై ప్రత్యక్ష సాక్షులు-పక్కా ముందస్తు స్కెచ్‌తో.

|

కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో జరిగిన ఫ్యాక్షన్ హత్యలు రాష్ట్రంలో సంచలనం రేకెత్తించాయి. కొనేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఫ్యాక్షన్ పగలు ఒక్కసారిగా పడగవిప్పడం తీవ్ర కలకలం రేపింది. ప్రత్యర్థులు ముందస్తు ప్లాన్ ప్రకారమే అన్నాదమ్ములు నాగేశ్వరరెడ్డి,ప్రతాపరెడ్డిలను హత్య చేశారని చెబుతున్నారు. కొంతకాలంగా అదును కోసం ఎదురుచూస్తున్న ప్రత్యర్థులు... ఆ అన్నాదమ్ములు తమ చిన్నాన్న కర్మకాండకు వస్తున్నారని తెలుసుకుని అక్కడే స్పాట్ పెట్టేందుకు స్కెచ్ వేశారు.

ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు...

ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు...

ప్రత్యక్ష సాక్షులైన ప్రతాపరెడ్డి భార్య లక్ష్మీదేవీ,కుమార్తెలు ప్రశాంతి,ప్రవలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పలు వివరాలు వెల్లడించారు. 'సరైన అదును కోసం ఎదురుచూస్తున్నాం. అన్నాదమ్ములు ఇద్దరు ఒకేసారి ఏం దొరికార్రా... చంపండ్రా...' అంటూ ప్రత్యర్థి వర్గంలోని శ్రీకాంత్ రెడ్డితో పాటు అతని అనుచరులు వేటకొడవళ్లతో దాడికి దిగారని పేర్కొన్నారు. పెసరవాయికి చెందిన ద్వారం శ్రీకాంత్ రెడ్డి,గ్రంధి వేముల ఎల్లారెడ్డి,యశ్వంత్ రెడ్డి,సింగసాని దామోదర్ రెడ్డి,ద్వారం కేదారనాథ్ రెడ్డి,మంజుల నాగేశ్వరరావు,నిరంజన్ రెడ్డి తదితరులు కార్లలో వచ్చి ఈ దాడికి పాల్పడినట్లు చెప్పారు.

స్పృహలోకి వచ్చేసరికే...:

స్పృహలోకి వచ్చేసరికే...:

ప్రత్యర్థుల దాడిలో ప్రతాపరెడ్డి,నాగేశ్వరరెడ్డి హతమవగా... వడ్డు సుబ్బారెడ్డి,వెంకటేశ్వరరెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. సుబ్బారెడ్డి తల,కాళ్లకు గాయాలయ్యాయి. వెంకటేశ్వరరెడ్డి చేయి,కాలు విరిగాయి. కర్మకాండలో పాల్గొనేందుకు శ్మశానం వైపు వెళ్తుండగా ప్రత్యర్థులు మొదట కారుతో తమను వేగంగా ఢీకొట్టారని వడ్డు సుబ్బారెడ్డి,వెంకటేశ్వరరెడ్డి చెప్పారు. దీంతో తాము ఐదుగురుం చెల్లాచెదురుగా

గన్ లైసెన్స్ అప్లై చేసినా...

గన్ లైసెన్స్ అప్లై చేసినా...

రెండు నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రతాపరెడ్డి వర్గానికి శ్రీకాంత్ రెడ్డి వర్గానికి మధ్య దాడులు జరిగాయి. ఎన్నికల్లో దొంగ ఓటు వేసేందుకు వచ్చాడని ఆరోపిస్తూ ఓ వ్యక్తిని ప్రతాపరెడ్డి వర్గం అడ్డుకుంది. దీంతో శ్రీకాంత్ రెడ్డి వర్గం వారిపై దాడి చేసింది. ఈ నేపథ్యంలో ప్రతాపరెడ్డి గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.నాగేశ్వరరెడ్డి తన తుపాకీని ఎన్నికల సమయంలో పోలీసులకు అప్పగించగా... దాన్ని తిరిగి తీసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ దారుణ హత్యకు గురయ్యారు.

అంత్యక్రియలకు లోకేశ్...

అంత్యక్రియలకు లోకేశ్...

మాజీ సర్పంచ్ వడ్డు నాగేశ్వరరెడ్డి,సహకార సంఘం మాజీ అధ్యక్షుడు ప్రతాపరెడ్డి తోడబుట్టిన సోదరులు. కొంతకాలంగా ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. గురువారం(జూన్ 17) చిన్నాన్న కుమారుడి కర్మకాండ ఉండటంతో ఇద్దరూ పెసరవాయి గ్రామానికి వచ్చారు. ఉదయం 6గంటల సమయంలో కాలినకడన శ్మశానికి బయలుదేరారు.దాని సమీపంలోకి వెళ్లగానే ప్రత్యర్థులు కారులో వచ్చి ఢీకొట్టారు.ఆపై మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నాగేశ్వరరెడ్డి,ప్రతాపరెడ్డిల అంత్యక్రియలు శుక్రవారం జరగనున్నాయి. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అంత్యక్రియలకు హాజరుకానున్నారు.

English summary
Pratapareddy and Nageswarareddy were killed in the attack of the opponents ... Vaddu Subbareddy and Venkateswarareddy were seriously injured. Subbareddy sustained head and leg injuries. Venkateswarareddy's arm and leg were broken. Vaddu Subbareddy and Venkateswarareddy said that the rivals first collided head-on with a car while going towards the cemetery to participate in the ritual. With this, the five of them fell scattered ... Nageswarareddy and Pratapareddy were killed when they came to consciousness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X