కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీ భేటీలో బుట్టా రేణుక: ఎమ్మెల్సీ సీటు పెద్ద సవాలే, చంద్రబాబుకు 'వైసీపీ' ఫీవర్

|
Google Oneindia TeluguNews

కర్నూలు/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, ఇటీవల అధికార పార్టీలో చేరిన పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక ఆదివారం టీడీపీ సమావేశంలో పాల్గొన్నారు. ఆమె అధికారికంగా టీడీపీ తీర్థం పుచ్చుకోలేదు. కానీ చేరినట్లే.

చదవండి: రివర్స్ అయింది, దిమ్మతిరిగేలా: ఇదీ పవన్ క్యారెక్టర్ అంటూ వైసీపీ అభిమాని! (వీడియో)

Recommended Video

YS Jagan Scolds Chandrababu Over Repeated Cheating of Backward Classes | Oneindia Telugu

ఆమె రెండు నెలల క్రితం తన అనుచరులతో కలిసి చంద్రబాబుకు మద్దతు పలికారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు రావొద్దనే ఉద్దేశ్యంతోనే ఆమె టీడీపీలో అధికారికంగా చేరలేదు. అయితే ఇప్పుడు తొలిసారి ఆమె టీడీపీ సమావేశంలో పాల్గొన్నారు.

చదవండి: బాబు సమక్షంలో టిడిపిలోకి బుట్టా రేణుక కానీ ట్విస్ట్: జగన్‌ను దెబ్బతీసేందుకే

ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించేందుకు

ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించేందుకు

నంద్యాల ఉప ఎన్నికలకు ముందు శిల్పా చక్రపాణి రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆ సమయంలో ఆయన తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. దానిని ఆమోదించారు. దీనిపై చర్చించేందుకు చంద్రబాబు కర్నూలు జిల్లా నేతలతో భేటీ అయ్యారు.

రేసులో ఎందరో

రేసులో ఎందరో

శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామా ఆమోదం నేపథ్యంలో కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిపై చర్చించారు. రేసులో కేఈ ప్రభాకర్ రెడ్డి, శివానంద రెడ్డి, శ్రీధర్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, మాండ్ర శివానంద తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యేల మద్దతుతో ఎవరికి వారే విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమావేశానికే బుట్టా రేణుక కూడా హాజరయ్యారు.

 ఆశావహుల సంఖ్య ఎక్కువే

ఆశావహుల సంఖ్య ఎక్కువే

కర్నూలు స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా బరిలోకి దిగేందుకు టీడీపీ నుంచి చాలామంది బరిలో ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి టిక్కెట్ ఇవ్వాలని కేఈ వర్గం కోరుతోంది. గతంలో నంద్యాల డివిజన్ వారికి అవకాశమిచ్చారని, ఈసారి కర్నూలు డివిజన్ వారికి అవకాశమివ్వాలని, అలాగే గతంలో రెండుసార్లు రెడ్డి సామాజిక వర్గానికి అవకాశమిచ్చినందున, ఈసారి బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ టిక్కెట్ ఎవరికి దక్కుతుందో తేలనుంది. ప్రధానంగా కేఈ ప్రభాకర్, చల్లా రామకృష్ణా రెడ్డిల మధ్య పోటీ ఉందని చెబుతున్నారు.

వైసీపీలోను హైటెన్షన్

వైసీపీలోను హైటెన్షన్

వైసీపీలోను అభ్యర్థి ఎంపికపై హైటెన్షన్ నెలకొంది. శిల్పా సోదరులు ప్రధానంగా 2019 అసెంబ్లీ ఎన్నికల టిక్కెట్ పైన గురి పెట్టారని తెలుస్తోంది. దీంతో గత ఎన్నికల్లో పోటీ చేసిన గౌరు వెంకట రెడ్డిని మరోసారి నిలబెట్టవచ్చునని అంటున్నారు. నాడు టిడిపి నుంచి పోటీ చేసిన శిల్పా చక్రపాణిపై వైసీపీ అభ్యర్థిగా గౌరు 62 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఓడారు. ఇప్పుడు గౌరును నిలబెడితే శిల్పా మద్దతుతో వైసీపీ గెలుస్తుందని అంటున్నారు.

టీడీపీకి క్రాస్ ఓటింగ్ ఫీవర్

టీడీపీకి క్రాస్ ఓటింగ్ ఫీవర్

ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ జరగకుండా చూడటం, సీటును కాపాడుకోవడం తెలుగుదేశం పార్టీకి సవాల్‌గా మారిందని అంటున్నారు. ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు మెజార్టీ బలం ఉన్నప్పటికీ టీడీపీని క్రాస్ ఓటింగ్ ఫీవర్ వెంటాడుతోందని అంటున్నారు. అభ్యర్థి ఎంపికను బట్టి క్రాస్ ఓటింగ్ ప్రభావం ఉంటుందని అంటున్నారు. వైసీపీ కూడా క్రాస్ ఓటింగ్‌పై దృష్టి సారించింది. టీడీపీ అభ్యర్థి ఎంపిక తర్వాత జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారినా మారవచ్చునని చెబుతున్నారు.

English summary
MP Butta renuka joined Telugu Desam party meeting on Sunday. CM Chandrababu Naidu is met with Kurnool TDP leaders over MLC elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X