కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నంద్యాల ఎఫెక్ట్: జగన్‌కు బుట్ష రేణుక షాక్, కోట్లకు బంపర్ ఆఫర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

కర్నూల్: నంద్యాల ఉపఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కర్నూల్ జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారనే ప్రచారం టిడిపి వర్గాల్లో సాగుతోంది. మరోవైపు కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక కూడ టిడిపిలో చేరేందుకు సానుకూలంగా ఉన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. మరోవైపు కర్నూల్ మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి టిడిపితో పాటు వైసీపీ‌ల నుండి ఆహ్వనాలు అందుతున్నాయని సమాచారం. అయితే పార్టీ మారే విషయమై కోట్ల కుటుంబం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

నంద్యాల ఉపఎన్నికల ప్రభావం ఏపీ రాజకీయాలపై తీవ్రంగా కన్పిస్తోంది. వైసీపీ నుండి కీలక నేతలు టిడిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని ప్రచారం సాగుతోంది. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారని మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడులు రెండు రోజుల క్రితమే ప్రకటించారు.

నంద్యాల ఎన్నికల ప్రభావం వైసీపీ ఎమ్మెల్యేలపై కన్పిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పార్టీలు మారేందుకు సిద్దంగా ఉన్న ఎమ్మెల్యేలతో టిడిపి నాయకత్వం చర్చలను జరుపుతోంది. మరోవైపు ఆయా జిల్లాల్లో బలమైన నాయకులను కూడ తమ పార్టీలోకి ఆహ్వనించేందుకు టిడిపి నాయకత్వం వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది.

2019 ఎన్నికల్లో టిడిపిని విజయం వైపుకు తీసుకెళ్ళేందుకు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబునాయుడు వ్యూహరచన చేస్తున్నారు.. ఈ మేరకు అన్ని రకాల అవకాశాలను ఉపయోగించుకొనే ప్రయత్నాన్ని చంద్రబాబునాయుడు చేస్తున్నారు.

కర్నూల్ జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు

కర్నూల్ జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు

నంద్యాల ఉపఎన్నికల ఫలితాల తర్వాత కర్నూల్ జిల్లాలో రాజకీయాల్లో పెనుమార్పులు సంబవించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార పార్టీ వైపు విపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులు చూస్తున్నారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు టిడిపి ప్రయత్నాలు చేస్తోంది. తమతో టచ్‌లోకి వచ్చిన వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలతో టిడిపి ముఖ్య నేతలు చర్చిస్తున్నారు. కర్నూల్ ఎంపీ బుట్టా రేణుకతో పాటు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలతో టిడిపి నాయకత్వం చర్చలు జరుపుతోందని ప్రచారం సాగుతోంది. కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి టిడిపితో పాటు వైసీపీ నుండి కూడ ఆహ్వనాలు అందుతున్నాయని ప్రచారం సాగుతోంది.

కుటుంబసభ్యులతో చర్చించిన తర్వాతే నిర్ణయం

కుటుంబసభ్యులతో చర్చించిన తర్వాతే నిర్ణయం

కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక కూడ వైసీపీని వీడి టిడిపిలో చేరుతారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది.అయితే తాను పార్టీ మారడం లేదంటూ ఆమె పలుమార్లు వివరణ కూడ ఇచ్చారు. అయితే శనివారం నాడు కోడుమూరులో బుట్టా రేణుక చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంచెం ఆసక్తిని కలిగిస్తున్నాయి. పార్టీ మారే విషయమై వస్తున్న వార్తలపై బుట్టా రేణుక నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.. ‘ఆ విషయం మా కుటుంబ సభ్యులతో చర్చించాలి. అలాంటిది ఉంటే ముందు మీకే చెబుతా. ఆ తర్వాతే పార్టీ మారుతా' అంటూ కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక చెప్పారు..బుట్టా రేణుక గెలిచిన వెంటనే భర్త బుట్టా నీలకంఠతో కలసి సీఎం చంద్రబాబును కలిశారు. ఆ వెంటనే ఆమె టీడీపీలో చేరే ఆలోచనను విరమించుకోగా, భర్త నీలకంఠ మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు.ఎంపీ బుట్టా వైసీపీలోనే ఉన్నా.. అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారే తప్ప ఏనాడూ అధికార పార్టీపై ఘాటు విమర్శలు చేయలేదు. నంద్యాల ఉపఎన్నిక తర్వాత ఆమె టీడీపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి టిడిపి, వైసీపీ నుండి ఆఫర్లు

కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి టిడిపి, వైసీపీ నుండి ఆఫర్లు

నంద్యాల ఉప ఎన్నికకు ముందు ప్రముఖ సినీ నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించేందుకు తన బావ కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిని వెంటబెట్టుకుని అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారు. వారి మధ్య 45 నిమిషాలకు పైగా ఏకాంతంగా చర్చలు సాగాయని సమాచారం.. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి క్యాబినెట్‌లో చంద్రబాబు సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు. కోట్లను తమవైపు తిప్పుకునేందుకు టీడీపీ అధినాయకత్వం పావులు కదుపుతున్నట్టు సమాచారం.అయితే వైసీపీ కూడ కోట్లను తమ పార్టీలో చేర్చుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. వైసీపీలో చేరితే కర్నూలు లోక్‌సభ సీటుతో పాటు ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, తనయుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డికి రెండు ఎమ్మెల్యే సీట్లు కూడా ఆఫర్‌ చేసినట్లు సమాచారం. కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి టిడిపిలో చేరితే కర్నూల్ ఎంపీ స్థానంతో పాటు ఆలూరు అసెంబ్లీ సీటును కేటాయించే అవకాశం ఉందని సమాచారం. అయితే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి టిడిపిలో చేరడాన్ని కె.ఈ స్వాగతిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

 మంత్రి పదవి కావాలంటూ ఎమ్మెల్యేల షరతు

మంత్రి పదవి కావాలంటూ ఎమ్మెల్యేల షరతు


టీడీపీతో గతంలో అనుబంధం కలిగిన జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో టీడీపీ అధినాయకత్వం హైదరాబాదులో శుక్రవారం క్రితం భేటీ అయినట్లు సమాచారం. అయితే.. వారు అధికార పార్టీలోకి చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. అయితే టిడిపిలో చేరిన వెంటనే మంత్రి పదవి ఇవ్వాలని షరతు పెట్టినట్లు టిడిపి వర్గాల్లో ప్రచారం సాగుతోంది.అయితే టిడిపి నాయకులు మాత్రం మంత్రి పదవిని ఇచ్చేందుకు మాత్రం సానుకూలంగా లేరనేది సమాచారం. మరికొందరు కీలక వైసీపీ నాయకులు కూడా అధికార పార్టీతో టచ్‌లో ఉన్నట్లు విశ్వసనీయ సమచారం.

English summary
There is a spreading a rumour on kurnool MP Butta Renuka will join in TDP soon. I Will discuss with family members, after that I will take decision said Kurnool Mp Butta Renuka on Saturday in Kodumur. Tdp and Ysrcp offered to Former Kurnool Mp Kotla Surya Prakash reddy to join their parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X