కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్: ఒక్క ఎలుకను పట్టుకొనేందుకు రూ.20 వేల ఖర్చు

ఎలుకలను పట్టుకొనేందుకు లక్షలాది రూపాయాలను ఖర్చు పెట్టినట్టు ఎక్కడైనా చూశారా? ఒక్క ఎలుకను పట్టుకొనేందుకు రూ.20 వేలు ఖర్చుచేయడం గురించి విన్నారా? ...

By Narsimha
|
Google Oneindia TeluguNews

కర్నూల్: ఎలుకలను పట్టుకొనేందుకు లక్షలాది రూపాయాలను ఖర్చు పెట్టినట్టు ఎక్కడైనా చూశారా? ఒక్క ఎలుకను పట్టుకొనేందుకు రూ.20 వేలు ఖర్చుచేయడం గురించి విన్నారా? ... ఈ తరహ వార్తల గురించి తెలుసుకోవాలంటే కర్నూల్ కు వెళ్ళాల్సిందే. ఎలుకలను పట్టుకోవడానికి కర్పూల్ యంత్రాంగం రూ.60 లక్షలను ఖర్చుపెట్టింది. నిజమే మరీ ఇంత పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టి మరీ 300 ఎలుకలను పట్టుకొన్నారు. ఈ వార్త చదువుతోంటే చెవిలో పువ్వులు పెట్టుకొన్నట్టు అన్పిస్తోంది కదా...కానీ, నిజంగా ఇది నిజమే.

వడ్డించేవాడు మనవాడైతే చాలు చివరన కూర్చొన్న వారికి కూడ భోజనం దొరుకుతోందనేది నానుడి.అయితే ఈ నానుడి కర్నూల్ ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు పట్టే కాంట్రాక్టర్ కు వర్తిస్తోంది. ప్రభుత్వాసుపత్రిలో ఎలుకల వల్ల రోగులు ఇబ్బందిపడుతున్నారని భావించారని వాటిని పట్టుకోనేందుకు కాంట్రాక్టు ఇచ్చారు.

 Kurnool: Rs 60 lakh spent to catch 300 rats

ఒక్కో ఎలుకను పట్టుకొనేందుకు కర్నూల్ ప్రభుత్వాసుపత్రి అధికారులు రూ. 20 వేలను ఖర్చు చేశారు. 300 ఎలుకలను పట్టుకొన్నాడు కాంట్రాక్టర్. ఈ లెక్కన రూ. 60 లక్షలను ఖర్చు చేశారు.

నిజానికి 300 ఎలుకలను పట్టుకోవడానికి లక్షలాది రూపాయాలను ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయా అనే అనుమానాలు కూడ లేకపోలేదు. సాధారణంగా గ్రామాలకు వచ్చి ఎలుకలను పట్టుకొనేందుకు తిరుగుతుంటారు.

వారికి భోజనం పెట్టి కొంత నగదును ఇస్తే సరిపోతోంది. కానీ, దానికి విరుద్దంగా కర్నూల్ ప్రభుత్వాసుపత్రిలో రూ. 60 లక్షలను ఖర్చు చేశారు.ఈ కాంట్రాక్టర్ ఎలుకలతో పాటే పందికొక్కులను పట్టుకోవాలి.అయితే ఈ కాంట్రాక్టు పొందిన వ్యక్తి ఏపీ వైద్య ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాస్ కు సన్నిహితుడుగా ప్రచారంలో ఉంది. ఈ విషయమై కాంట్రాక్టర్ ను ఎవరూ కూడ అడిగే సాహసం చేసే పరిస్థితి లేకుండాపోయింది

English summary
Rat catching is a very expensive activity in Kurnool Government Hospital. The hospital spent Rs 60 lakh from June 2016 to June 2017 to catch 300 rats. Which means each rat was caught at an average cost of Rs 20,000. The contractor hired was also assigned to kill other pests like bandicoots.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X