వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి నేతలకు ముందే తెలుసు..అలా కుప్పకూలిపోతుంది:నోట్ల రద్దుపై కుటుంబరావు సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

అమరావతి:నోట్ల రద్దు గురించి ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు జరిగి నేటితో రెండేళ్లయిన సందర్భంగా అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై విమర్శల వర్షం కురిపించారు.

పెద్ద నోట్ల రద్ద విషయం బిజెపి నేతలకు ముందే తెలుసని కుటుంబరావు ఆరోపించారు. అందువల్ల బీజేపీ నేతలు ముందుగానే నల్లధనాన్ని తెల్ల ధనంగా మార్చుకున్నారని కుటుంబరావు విమర్శించారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షాకు చెందిన కో-ఆపరేటివ్ బ్యాంక్ మొదట నాలుగు రోజుల్లోనే అత్యధిక డబ్బును మార్చుకోవడమే అందుకు నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐని నిర్వీర్యం చేస్తోందని, ఫలితంగా అర్జెంటీనా ఆర్ధిక వ్యవస్థ లాగా భారత ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలే ప్రమాదం ఉందన్నారు.

నోట్ల రద్దే...అతిపెద్ద కుంభకోణం

నోట్ల రద్దే...అతిపెద్ద కుంభకోణం

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక పెద్ద నోట్ల రద్దే అత్యంత పెద్ద కుంభకోణమని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అభివర్ణించారు. అమిత్ షాకు చెందిన కో అపరేటివ్ బ్యాంక్ ద్వారా డబ్బులు పెద్ద మొత్తంలో చేతులు మారాయని...ఎలాంటి కుంభకోణం లేకపోతే జేపీసీ ఎందుకు వేయలేదని కుటుంబరావు నిలదీశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక నోట్ల రద్దే అత్యంత పెద్ద కుంభకోణమని కుటుంబరావు అభివర్ణించారు.

 కొత్త ప్రభుత్వం...విచారణ

కొత్త ప్రభుత్వం...విచారణ

పెద్ద నోట్ల వినియోగం తగ్గించటానికే నోట్ల రద్దు చేశామని కేంద్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటించిందని కానీ ప్రస్తుతం రెండు వేల నోట్లు వినియోగం మాత్రం బాగా దేశంలో ఇప్పుడు నల్లధనం ఇంకా ఎక్కువ అయిపోయిందన్నారు.2019 తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం నోట్ల రద్దు పై తప్పకుండా ఎంక్వయిరి చేస్తుందన్నారు.కేంద్ర ప్రభుత్వం మోసాలపై100 కేసులపై ఛార్జ్ షీట్ విడుదల చేస్తామన్నారు.దేశంలోఇప్పటికి పాత రూ. 1000, 500 ల నోట్లు మారుస్తున్నారని చెప్పారు. కేంద్రంఏ అంశాలను అయితే అరి కడతామని చెప్పారో అవే రెట్టింపు అయ్యాయన్నారు.

కేంద్ర మంత్రి...తప్పు దోవ

కేంద్ర మంత్రి...తప్పు దోవ

కేంద్రం ఇటీవల క్యాపిటల్ వర్డ్ కంపెనీ ద్వారా ఎంఎస్ఎఈ రుణాలు 59 నిమిషాల్లో ఇస్తారంటున్నారని..ఆ ప్రాజెక్ట్ క్యాపిటల్ వర్డ్ కు ఎలా అప్పజెప్పారని నిలదీశారు.షా లు ప్రజలను దోచుకుంటున్నారని...ఈ స్కామ్ లను ఆర్ధిక ఉగ్రవాదులు మాత్రమే చేయగలరని దుయ్యబట్టారు.నోట్ల రద్దుపై కేంద్ర ఆర్థిక మంత్రి ప్రజలను తప్పుదోవ పట్టించారని...నోట్ల రద్దు ఓ పెద్ద డిజాస్టర్ గా కుటుంబరావు అభివర్ణించారు.

కుప్పకూలొచ్చు...ఆయన రాజీనామా

కుప్పకూలొచ్చు...ఆయన రాజీనామా

బిజెపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఏ విధంగా అడుకోవచ్చు అనేదానికి ఒక ఉదాహరణ అన్నారు. కేంద్ర ప్రభుత్వమే ఆర్బీఐని నిర్వీర్యం చేస్తూ వస్తోందని...ఫలితంగా అర్జెంటీనా ఆర్ధిక వ్యవస్థ లాగా భారత ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్బీఐ బోర్డ్ మీటింగ్ త్వరలోనే జరగనుందని...ఆ రోజు ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేసే అవకాశం లేక పోలేదని కుటుంబరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

English summary
AP Planning Commission Vice President Kutumba Rao has made sensational comments on the Demonetisation. Speaking to reporters in Amaravathi he claimed that the BJP leaders knew before about Demonetisation. Hence, he criticized BJP leaders for making black money into white.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X