వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుర్జ్ ఖలీఫా నిర్మించిన సంస్థకు ఎలా ఇచ్చారు, ముందు మీ లెక్క చెప్పండి: బీజేపీకి కుటుంబరావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీకి సాయం విషయంలో బీజేపీ నేతలు చెబుతున్నవన్నీ అబద్దాలేనని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబ రావు గురువారం మండిపడ్డారు. డోలేరా విషయంలో బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు చెప్పినవి సరికాదన్నారు. కృష్ణపట్నం నోడ్‌కు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ఢిల్లీ - ముంబై ఇండస్ట్రియల్ కారిడార్‌కు నిధులు కేటాయించిన కేంద్రం, విశాఖ - చెన్నై, చెన్నై-బెంగళూరు కారిడార్లకు నిధులు ఇవ్వడం లేదన్నారు.

'సమస్యల'తో పెంచి పోషించి: పవన్ వ్యూహంలో టీడీపీ విలవిల, ఆ ఆయుధం పేలలేదా?'సమస్యల'తో పెంచి పోషించి: పవన్ వ్యూహంలో టీడీపీ విలవిల, ఆ ఆయుధం పేలలేదా?

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధుల బాగా ఇస్తున్న కేంద్రం మిగతా రాష్ట్రాలపై సవితి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు. అందకే విశాఖ-చెన్నై కారిడార్‌కు కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్నారు. తామిచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వమే సక్రమంగా వినియోగించుకోవడం లేదని బీజేపీ నేతలు చెప్పడం ఏమాత్రం సరికాదన్నారు. కృష్ణపట్నం పోర్టుకు ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇచ్చారో లేదో చెప్పాలన్నారు.

 బుర్జ్ ఖలీఫాను నిర్మించిన విదేశీ సంస్థకు వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణ బాధ్యతలా?

బుర్జ్ ఖలీఫాను నిర్మించిన విదేశీ సంస్థకు వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణ బాధ్యతలా?

గుజరాత్‌లో సర్దార్‌ వల్లభాయ్‌ విగ్రహానికి వేల కోట్ల నిధులు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి సాయం చేయమంటే మాత్రం పట్టించుకోవడం లేదని కుటుంబ రావు మండిపడ్డారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం నిర్మాణ బాధ్యతలను బుర్జ్‌ ఖలీఫా కట్టిన విదేశీ సంస్థకు అప్పగించారన్నారు.

అమరావతి డిజైన్లు సింగపూర్ సంస్థకు అప్పగిస్తే తప్పేమిటి?

అమరావతి డిజైన్లు సింగపూర్ సంస్థకు అప్పగిస్తే తప్పేమిటి?

అలాంటిది అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దనున్న అమరావతి డిజైన్లు మాత్రం సింగపూర్‌ సంస్థకు అప్పగిస్తే విమర్శలు చేస్తున్నారని కుటుంబ రావు విమర్శించారు. పటేల్ విగ్రహాన్ని నిర్మించే సత్తా భారత సంస్థలకు లేదా అన్నారు. నర్మదా నిగమ్ లిమిటెండ్ నదులను మళ్లించారని ఆరోపించారు.

 మొదట మీ లెక్కలు సరి చూసుకోండి

మొదట మీ లెక్కలు సరి చూసుకోండి

కేంద్రానికి పంపిన యూసీలపై నీతి ఆయోగ్‌ ఇప్పటి వరకు ప్రశ్నించలేదన్నారు. తప్పు అని చెప్పలేదని వ్యాఖ్యానించారు. కానీ బీజేపీ నేతలు మాత్రం యూసీలు తప్పులతడకగా ఉన్నాయని, ఇవ్వలేదని చెబుతున్నారన్నారు. కాగ్ నివేదిక ప్రకారం కేంద్రంలోని 19 శాఖలు యూసీలు, విద్యా సుంకం రూ.84వేల కోట్లకు లెక్కలే లేవని చెప్పలేదా అని ప్రశ్నించారు. మా లెక్కలు అడిగే ముందు మీ లెక్కలు సరి చూసుకోవాలన్నారు. ఏపీ ఇచ్చిన యూసీలను ఏ శాఖ తప్పు పట్టలేదన్నారు.

డొలేరా స్మార్ట్ సిటీ ప్రణాళిక డిజైన్ కూడా సింగపూర్ సంస్థలే చేస్తున్నాయి

డొలేరా స్మార్ట్ సిటీ ప్రణాళిక డిజైన్ కూడా సింగపూర్ సంస్థలే చేస్తున్నాయి

డొలేరా స్మార్ట్ సిటీ ప్రణాళిక.. డిజైన్ సింగపూర్ సంస్థలే చేస్తున్నాయని, అమరావతిలో కోర్ క్యాపిటల్ ప్రాంతం అభివృద్ధికి సింగపూర్ సంస్థలతో కలిసి పని చేస్తుంటే విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. పటేల్ విగ్రహానికి ఇచ్చే సంస్థలకు పన్ను మినహాయించారని, అమరావతి బాండ్లకు పన్ను మినహాయించడం లేదన్నారు. పెట్రోల్ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి వాటా వెళ్తోందని, పన్ను తగ్గించాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి చేస్తోందన్నారు.

English summary
Kutumba Rao takes on BJP Rajya Sabha Member GVL Narsimha Rao for his comments on TDP government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X