వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా ఐతేనే: పోలవరంపై కేంద్రం, మోడీజీ! అర్థం చేసుకోండి: బుట్టా రేణుక

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు వేసిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ సోమవారం స్పందించారు. పోలవరంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవరించిన నివేదికలు సంతృప్తిగా ఉన్నప్పుడే కేంద్రం అనుమతులు ఇస్తుందని తెలిపారు.

ఏపీలో గిరిజన వర్సిటీపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగారు. దానికి కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందిస్తూ.. ఈ సమావేశాల్లో గిరిజన యూనివర్సిటీ బిల్లు పెట్టడం లేదని చెప్పారు.

బాబు ఇలాంటోడని తెలిస్తే వేరేలా ఉండేవాడ్ని, ఎదురు తిరగండి.. తూటా పేలితే ముందుంటా: పవన్బాబు ఇలాంటోడని తెలిస్తే వేరేలా ఉండేవాడ్ని, ఎదురు తిరగండి.. తూటా పేలితే ముందుంటా: పవన్

KVP, Butta Renuka raises Polavaram and Special Status issue in Parliament

లోకసభలో జీరో అవర్‌లో ఎంపీ బుట్టా రేణుక ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. ప్రత్యేక హోదాపై ప్రధాని మోడీ ఎలాంటి భరోసా ఇవ్వకపోవడం బాధాకరం అన్నారు. ఏపీ ప్రజల అభిమతాన్ని ప్రధాని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Recommended Video

బుట్టా రేణుక ఫ్లోర్ లీడర్‌ జాబితాలో చేరిక పై విజయ్ సాయి రెడ్డి ఫైర్

అంతకుముందు, కేవీపీ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు. పది నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నేత కేవీపీ రామచంద్ర రావు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని సిడబ్ల్యూసీలో సోనియా గాంధీ మరోసారి చెప్పారన్నారు. ప్రత్యేక హోదా మరిచిపోవాలన్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇంట్లో కూర్చోవడం ఖాయమని ఎద్దేవా చేశారు. సభలో తమ పోరాటం, నిరసనల పర్వం కొనసాగుతూనే ఉంటుందన్నారు.

English summary
Congress MP KVP Ramachandra Rao and Butta Renuka raised Polavaram and Special Status issue in Parliament on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X