వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్ ఎఫెక్ట్: రాజ్యసభలో కేవీపీ నిరసన, ప్లకార్డుల ప్రదర్శన

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు శుక్రవారం రాజ్యసభలో నిరసన తెలిపారు. హామీలు విస్మరిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

బడ్జెట్: నిన్న బాబు, నేడు పవన్ కళ్యాణ్ దెబ్బకు దిగొచ్చిన నరేంద్ర మోడీ?బడ్జెట్: నిన్న బాబు, నేడు పవన్ కళ్యాణ్ దెబ్బకు దిగొచ్చిన నరేంద్ర మోడీ?

కేవీపీ ఈ మేరకు ప్లకార్డులు ప్రదర్శించారు. ఏపీకి సాధారణ బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం చేశారని ఆయన నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభ వైస్ చైర్మన్ పదేపదే ఆయనను కూర్చోమని చెప్పాల్సి వచ్చింది. కేవీపీ తీరుపై కురియన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెల్ నుంచి వెళ్లిపోవాలని పదేపదే చెప్పారు. విపక్షాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో రాజ్యసభ వాయిదా పడింది.

KVP protest in Rajya Sabha over Budget

టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివ రావు వేరుగా మాట్లాడుతూ.. విశాఖపట్నంకు రైల్వే జోన్ వస్తుందన్న నమ్మకం తమకు లేదని చెప్పారు.

English summary
Congress MP KVP Ramachandra Rao protest in Rajya Sabha over Union Budget 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X