వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏమైనా ఉందా, చూపించండి?: కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించిన కెవిపి

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇప్పటి వరకూ చాలా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని, ఏ చట్టం చెబితే వాటికి హోదా కట్టబెట్టారని,అసలు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రభుత్వ ఉత్తర్వుగానీ కేబినెట్‌ తీర్మానం గానీ నోట్‌ గానీ ఉందా? ఉంటే చూపించాలని కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కేంద్రాన్ని ప్రశ్నించారు.

పరిపాలనా ఉత్తర్వులతోనే ప్రత్యేక హోదాను కట్టబెడుతుంటారని ఆయన స్పష్టం చేశారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో నాడు ప్రధాని హామీ ఇచ్చినా, కేంద్ర కేబినెట్‌ సిఫార్సు చేసినా వాటిని బీజేపీ ప్రభుత్వం అమలు చేయకపోవటం సరికాదని ఆయన అన్నారు.

చట్టంలో పొందుపరచకపోవడం వల్లనే ఇవ్వలకపోతున్నాముని బిజెపి నేతలు సమర్థించుకోవాలని చూడడం సబబు కాదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో జేడీ శీలం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన విషయం తెలిసిందే. పార్లమెుంటు సాక్షిగా నాటి ప్రధని చేసి ప్రకటనకు, విభజనచట్టానికి కేంద్రం కట్టుబడి ఉందా? లేదా? అని ఆయున ప్రశ్నిచారు.

KVP questions Centre special status issue

దీనిపై ప్రధని మోూడీ స్పష్టమైన ప్రటన చేయాూలని డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రత్యేక హోదా కోరుతూ మునికోటి అనే కాంగ్రెస్‌ కార్యకర్త కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మాహుతి అయ్యాడని తెలిపారు.

కాగా, ఈ విషయుంలో తెలంగాణ ఎంపీ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు వి. హనుముంతరావు జేడీ శీలంకు మద్దతు పలికారు. గతంలో పార్లమెుంటు సాక్షిగా ఇచ్చిన హావీులలు మోడీ ప్రభుత్వం అములు చేయకపోవడం ఏమిటని, అసలు ప్రధాని ఇచ్చిన హామీకు విలువ ఉందా లేదా స్పష్టం చేయాూలని అన్నారు.

English summary
Congress MP KVP Ramachandar Rao questioned centre on special status to Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X